India Vs Pakistan War : 4 రోజులు.. 96 గంటలు.. భారత్ నాన్‌స్టాప్ దాడులకు పాక్ బెంబేలెత్తింది. త్రివిధ దళాల త్రిశూల వ్యూహంతో పాక్‌కు ముచ్చెమటలు పట్టాయి. యుద్ధం ముందు ఉన్న కాన్ఫిడెన్స్.. యుద్ధం మొదలయ్యాక పాక్‌లో లేకుండా పోయింది. భారత్ భీకర దాడులు చేస్తుందని పాక్ ఊహించలేకపోయింది. మెరుపు దాడులతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది ఇండియా. యుద్ధం ఇలాగే కొనసాగితే.. ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనే భావన తలెత్తింది. వెంటనే కాళ్ల బేరానికి వచ్చింది దాయాది దేశం. భారత్ దాడులు ఆపితే.. తాము సైతం సీజ్ ఫైర్‌కు ఒప్పుకుంటామని ప్రకటించింది. అమెరికా సాయాన్ని కోరింది. ట్రంప్ పెద్దరికంతో మధ్యవర్తిత్వం చేశారు. గంటల తరబడి ఇరు దేశాలతో చర్చించారు. భారత్‌కు నచ్చజెప్పి.. పాక్‌తో యుద్ధాన్ని ముగించేలా ఒప్పించారు. ప్రస్తుతానికైతే వార్.. ది ఎండ్.
పాక్ పరువంతా పాయే..
భారత్‌తో యుద్ధం మొదలయ్యాక.. స్వదేశంలోనే పాక్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. స్వయంగా ఆ దేశ పౌరులే పాక్ తీరును ఎండగట్టారు. ఏ దేశ ఎంపీనే తమను కాపాడాలంటూ పార్లమెంట్‌లో బోరున ఏడ్చేశారు. ప్రపంచవ్యాప్తంగా పాక్‌పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ.. చేసిన తప్పును ఒప్పుకోకపోగా.. ఎదురుదాడి చేస్తారా? అంటూ ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా పాక్‌పై విరుచుకుపడ్డాయి. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ దోషిగా నిలబడింది. పరిస్థితి పాక్ చేజారిపోయింది.
పాక్‌కు చావు దెబ్బ..
యుద్ధానికి యుద్ధంతోనే బదులు చెబుదామని అనుకుంది పాకిస్తాన్. కానీ, అటాక్ మొదలుపెట్టాక కానీ పాక్‌కు తెలిసి రాలేదు తామెంత పెద్ద మిస్టేక్ చేశామో. ఏదో చేసేద్దామని వందలాది డ్రోన్లతో భారత్‌పై దాడి చేసింది. కానీ, ఒక్కటంటే ఒక్కటి కూడా మన భూభాగాన్ని టచ్ చేయలేక పోయింది. అదే టైమ్‌లో.. ఇండియన్ ఆర్మీ చేసిన అటాక్‌తో పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాలన్నీ షేక్ అయ్యాయి. 6 ఎయిర్‌బేస్‌లు నాశనమయ్యాయి. 5 ఫైటర్ జెట్స్ నేలకూలాయి. ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఆర్మీ స్థావరాలు స్మాష్ అయ్యాయి. ఉగ్రవాద క్యాంపులు శవాల దిబ్బగా మారాయి. టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్‌లు నామరూపాలు లేకుండా పోయాయి. ఆయిల్ కొరత ఏర్పడింది. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. అసలే పేదరికంతో కునారిల్లుతున్న పాపిస్తాన్.. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలం అయింది. భారత్ జోలికి వస్తే ఏం జరుగుతుందో క్లియర్ కట్‌గా సినిమా చూపించింది. దాయాదికి గట్టి గుణపాఠమే నేర్పింది.
మళ్లీ మన జోలికొస్తే..
ఒక్క నైట్.. జస్ట్ కొన్ని గంటలు.. భారత్ చేసిన దాడితో దశాబ్దాలుగా పాక్ గడ్డపై నుంచి బుసలు కొడుతున్న ఉగ్రవాద ప్రధాన కేంద్రాలన్నీ బూడిద కుప్పగా మిగిలాయి. ఏకంగా 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహ్మద్ చీఫ్ మసూడ్ అజార్ సోదరుడు రవూఫ్ గాడు చచ్చాడు. మసూద్ ఫ్యామిలీలో 10 మంది ప్రాణాలతో లేకుండా పోయారు. ఇండియా దెబ్బకు పాకిస్తాన్‌కు, ఉగ్రవాదులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇంకోసారి టెర్రరిజం పేరెత్తితేనే.. సైతాన్ వారసులకు వెన్నులో వణుకు పుట్టేలా గట్టి దెబ్బ కొట్టింది ఇండియా. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌తో భారత్ కొట్టిన దెబ్బ.. పాకిస్తాన్‌కు మరో వందేళ్ల వరకు గుర్తిండిపోవాలి. కాదూ, లేదు అంటూ మరోసారి తోక జాడిస్తే.. మామూలుగా ఉండదు మనతోని. అదే విషయం తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా అది యుద్ధ చర్యగానే చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతానికి పాక్‌తో యుద్ధాన్ని ముగించినా.. ఉగ్రవాదంపై పోరు మాత్రం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఎనీ డౌట్?
Also Read : యుద్ధంతో అమెరికా డబుల్ గేమ్? ట్రంప్ ప్లాన్ ఇదేనా?