BigTV English

State govt Scheme: పైసా ఖర్చు లేకుండా 6 లక్షల ప్రమాద భీమా – పేదల కోసం  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన స్కీం

State govt Scheme: పైసా ఖర్చు లేకుండా 6 లక్షల ప్రమాద భీమా – పేదల కోసం  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన స్కీం

State govt Scheme: పైసా ఖర్చు లేకుండా ప్రమాద బీమా పొందాలనుకుంటున్నారా..? బీమాతో పాటు మరిన్ని బెనిఫిట్స్‌ లభించే పథకం గురించి తెలుసుకోవాలనుందా..? ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుందో తెలుసా..? ఇంతకీ ఆ పథకం ఏంటి..? అనుకుంటున్నారా..?  పథకం పాతదే అయినప్పటకీ చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ పథకం ఏంటో..? ఆ పథకం తీసుకొవడం వల్ల కలిగే లాభాలేంటో  ఈ కథనంలో తెలసుకుందాం.


సామాన్య ప్రజలకు చేయూతనిచ్చేందుకు ఇప్పటి వరకు మన రాష్ట్ర  గవర్నమెంట్‌  ఎన్నో వినూత్నమైన పథకాలు తీసుకొచ్చింది. ఆలాంటి వాటిలో   కార్మిక శాఖ అందిస్తున్న లేబర్‌ కార్డు పథకం ఒకటి.   ఈ లేబర్‌ కార్డు తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే ఈ కార్డును తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ఎవరైనా తీసుకోచ్చని ఈ మధ్య సోషల్‌ మీడియాలో మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదంతా తప్పుడు సమాచారం అని  కార్మికశాఖ అధికారులు చెప్తున్నారు. అయితే లేబర్‌ కార్డుకు ఎవరు అర్హులు. ఎలాంటి బెనిఫిట్స్‌ ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రతలు ఏంటి..? సమర్పించాల్సిన సర్టిఫికెట్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరు అర్హులు:  ఈ లేబర్‌ కార్డు తీసుకోవడానికి ఎవరు అర్హులు అనేది ఆ కార్డు అప్లికేషన్‌ ఫామ్‌లోనే డీటెయిల్‌గా ఉంటుంది. భవన నిర్మాణ కార్మికులు మాత్రమే ఈ కార్డుకు అర్హులు. భవన నిర్మాణ కార్మికులు అంటే తాపీ మేస్త్రీలు, కూలీలు, ప్లంబర్లు, ఎలక్రీషన్స్‌, వాల్‌ పెయింట్‌, సెంట్రిగ్‌ పని చేసేవారు.  ఇలా ఇంటి నిర్మాణం మొదలైన దగ్గర నుంచి ఆ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు వివిధ రకాలుగా పని చేసే కార్మికులందరూ ఈ లేబర్‌ కార్డు అర్హులు అంటున్నారు కార్మిక శాఖ అధికారులు.


ఎలా అప్లయ్‌ చేసుకోవాలి: ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉంటారో వాళ్లు ముందుగా మీకు దగ్గరలోని మీసేవ సెంటర్‌కు వెళ్లి మీరు లేబర్‌ కార్డు తీసుకోవాలని వాళ్లకు చెబితే వాళ్లు ఒక ఫామ్‌ ఇస్తారు. ఆ ఫామ్‌ తీసుకుని మీరు నివసిస్తున్న గ్రామ పంచాయతి సెక్రటరీతో కానీ మీరు పని చేస్తున్న  ఇంటి యజమానితో  కానీ ధృవీకరణ పత్రం తీసుకోవాలి. (అంటే మీరు నిజంగా భవన నిర్మాణ కార్మికులే అని చెప్పే ఫామ్‌ మీద వారు సంతకం చేయాలి.) తర్వాత  ఆ ఫామ్‌ తీసుకుని మళ్లీ  మీ సేవకు వెళితే అక్కడ మీ వివరాలు ఆన్‌లైన్‌ లో నమోదు చేస్తారు.  అందుకోసం వాళ్లు 110 రూపాయల నామమాత్రపు చార్జీ వసూలు చేస్తారు.

ఫామ్‌ ఎలా పూరించాలి: లేబర్‌ కార్డు తీసుకోవాలనే ఆత్రుతలో చాలా మంది తమ ఇంట్లోని వాళ్లందరి పేర్లు రాస్తుంటారు. అలా రాయడం కరెక్టు కాదంటున్నారు లేబర్‌ ఆఫీసర్లు. తెల్ల రేషన్‌ కార్డులో ఎవరి పేర్లు ఉంటాయో వారి పేర్లు, వివరాలు మాత్రమే ఇవ్వాలి.

 ఏఏ సర్టిఫికెట్స్‌ ఇవ్వాలి:  ఎవరైతే లేబర్‌ కార్డు కోసం అప్లయ్‌ చేస్తారో వాళ్ల ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ జీరాక్స్‌ కాపీ, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు, ధృవీరణ పత్రం ఇవ్వాలి.

మీ సేవలో ప్రాసెస్‌ పూర్తి అయిన తర్వాత అక్కడ ఇచ్చే ప్రిట్‌ అవుట్ రసీదు. మిగతా సర్టిఫికెట్స్‌ తీసుకుని వెళ్లి మీకు దగ్గరలోని లేబర్‌ ఆఫీసులో హార్డ్‌ కాపీ సబ్మిట్‌ చేయాలి.  మీరు సబ్మిట్‌ చేసిన వివరాలను.. ఆన్‌లైన్‌ లో నమోదైన వివరాలను కార్మిక శాఖ అధికారులు వెరిఫై చేసి నెల రోజుల్లో మీకు లేబర్‌ కార్డు శాంక్షన్‌ చేస్తారు.

లేబర్‌ కార్డుతో బెనిఫిట్స్‌:   తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మిక సంక్షేమ బోర్డు (TBOCWWB) లేబర్‌ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి అనేక బెనిఫిట్స్‌ ను అందిస్తుంది. ఈ కార్డు కలిగిన వ్యక్తి భార్యకు ప్రవస సాయం కింద  రెండు సార్లు మొత్తం 60 వేల రూపాయలు ( ఒక్కో కాన్పుకు 30 వేల చొప్పున) అందిచనుంది. అలాగే వారికి పుట్టిన ఆడ బిడ్డలు పెద్దవారై వారికి వివాహం జరిగితే ఇద్దరు ఆడ బిడ్డలకు వివాహ కానుకగా 30 వేల చొప్పున మొత్తం 60 వేల రూపాయలు ఇస్తారు. ఆలాగే ఆ కూతుళ్ల కాన్పులకు రెండు సార్లు 60 వేల చొప్పున ఇద్దరు కూతుళ్లకు  మొత్తం లక్షా ఇరవై వేల రూపాయలు కార్మికశాఖ అందిస్తుంది. ఇక కార్డు హోల్డర్‌ కు ఏదైనా ప్రమాదం జరిగి శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే ఆ వ్యక్తికి  రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు  సాయం అందిస్తుంది కార్మిక సంక్షేమ బోర్డు. ఇక ఆ వ్యక్తి సహజంగా మరణిస్తే 1 లక్షా 30 వేల రూపాయలు, ప్రమాదంలో మరణిస్తే.. 6 లక్షల 30 వేల రూపాయలను కార్మిక శాఖ సాయం చేస్తుంది.

అయితే ఈ బెనిఫిట్స్‌ అన్ని రావాలంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లేబర్‌ కార్డును తప్పకుండా  రెన్యూవల్‌ చేయించుకోవాలని లేబర్‌ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ రెన్యూవల్‌ చేయని కార్డు ఉంటే ఎలాంటి బెనిఫిట్స్‌ రావంటున్నారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

Related News

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

Big Stories

×