Matka Movie : మట్కా రిలీజ్ అయి రెండు రోజులు అవుతుంది. అందరికీ మొదటి రోజే మెగా ప్రిన్స్‌కు మరో అత్యంత భారీ డిజాస్టర్ వచ్చిందని తెలిసిపోయింది. వారంలో రెండే సినిమాలు. అందులోనూ ఒకటి తమిళ మూవీ. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా… మట్కా సేఫ్ సైడ్ అయ్యేది. కానీ, ఆడియన్స్ ఆ తమిళ మూవీని, ఇటు ఈ తెలుగు మూవీని పక్కన పెట్టేసి పోయిన వారం రిలీజ్ అయిన మూడు సినిమాలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే తాజాగా వరుణ్ తేజ్ మట్కా మూవీకి ఓ పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. ఇది మెగా ప్రిన్స్‌కు కెరీర్‌లోనే మర్చిపోలేని దెబ్బ. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస డిజాస్టర్ల తర్వాత హోప్స్ పెట్టుకున్న మూవీ మట్కా. పిరియడికల్ యాక్షన్ మూవీ కాబట్టి సేఫ్ సైడ్ ఉంటుందని అనుకున్నాడు. ఆయన క్యారెక్టర్‌లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. అది కూడా కలిసొస్తుందని అంచనా వేశాడు. కానీ, ఈ సినిమా ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
దీంతో అప్పటి వరకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ పెట్టుకున్న ఆడియన్స్ థియేటర్స్ గడప తొక్కడానికి ముందుకు రాలేకపోతున్నారు. దీంతో మట్కా మూవీని రన్ చేస్తున్న థియేటర్స్ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కేవలం మట్కాకే కాదు, ఈ వారం రిలీజ్ అయిన మరో మూవీ కంగువకు కూడా ఉంది. కానీ, ప్రభావం మాత్రం ఎక్కువ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీకే ఉందని స్పష్టం తెలుస్తుంది.
A క్లాస్ థియేటర్స్ నుంచే షాక్…
వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు చాలా థియేటర్స్ వచ్చాయి. కంగువ సినిమాకు రిలీజ్ కు ముందు నైజం డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ మూవీ మేకర్స్ కి పీవీఆర్ కి మధ్య ఏదో ఇష్యూ. ఇది కూడా మట్కాకు థియేటర్లు, స్క్రీన్స్ పెరగడానికి ఓ కారణం అయింది. అలా మట్కా కు స్క్రీన్స్ పెరిగినా… ఉపయోగం లేకుండా పోయింది. సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో క్రమంగా స్క్రీన్స్ తగ్గుతున్నాయని తెలుస్తుంది. హైదరాబాద్ సిటీతో పాటు చాలా ఏరియాల్లో A క్లాస్ థియేటర్స్ నుంచి మట్కా మూవీకి ఎదురుదెబ్బ తగులుతుందట. చాలా వరకు థియేటర్స్ మట్కా సినిమాను తీసివేసి… గత వారం వచ్చిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలతో రిప్లేస్ చేస్తున్నారట.
ఆ మూడు సినిమాలకు మంచి అవకాశం…
ఈ వారం రిలీజ్ అయిన మట్కా, కంగువ సినిమాలను ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. ఇది గత వారం రిలీజ్ అయిన అమరన్, లక్కీ భాస్కర్, క సినిమాలకు బాగా కలిసొస్తుంది. ఇప్పటికే క మూవీ 50 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టింది. అలాగే లక్కీ భాస్కర్ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అమరన్ మూవీ 172 కోట్లు వసూళ్లు చేసింది. వరల్డ్ వైడ్ అయితే… 300 కోట్ల క్లబ్‌లో చేరడానికి దగ్గరలో ఉంది.