Mike Tyson: ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కు ( Mike Tyson ) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తాజాగా భారీ ఓటమిని చవిచూశారు. కేవలం 27 సంవత్సరాలు ఉన్న యువకుడు చేతిలో ఓడిపోయారు మైక్ టైసన్ ( Mike Tyson ). దాదాపు 20 సంవత్సరాలుగా… బాక్సర్ గా తిరిగి వచ్చిన మైక్ టైసన్… ఓ యూట్యూబర్ చేతిలో ఓడిపోయాడు. తాజాగా యూట్యూబర్ జేక్ పాల్ ( Jake Paul) వర్సెస్ మైక్ టైసన్ ( Mike Tyson ) మధ్య ఫైట్ జరిగింది.
Also Read: Rohit Sharma Baby: మరోసారి తండ్రైన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ
Also Read: IND vs SA 4th T20i: సౌతాఫ్రికా చిత్తు..135 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ !
ఈ మ్యాచ్లో 74 -78 తేడాతో ఓడిపోయాడు మైక్ టైసన్ ( Mike Tyson ). దీంతో యూట్యూబర్ పాల్…గ్రాండ్ విక్టరీ కొట్టారు. టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్‌లోని AT&T స్టేడియంలో జేక్ పాల్, మైక్ టైసన్ ( Mike Tyson ) మధ్య ఎంతో ఆసక్తిగా ఫైట్ జరిగింది. దాదాపు ఎనిమిది రౌండ్ల తర్వాత యూట్యూబర్-బాక్సర్ పాల్ విజేతగా నిలిచాడు.
Also Read: IPL 2025 Auction: IPL 2025 మెగా వేలంలో 13 ఏళ్ల కుర్రాడితో పాటు.. 50 ఏళ్ల ముసలోడు ?
అంటే 58 సంవత్సరాలు ఉన్న మైక్ టైసన్ ఓ 27 సంవత్సరాల యూట్యూబర్ చేతిలో ఓడిపోయాడన్నమాట. ఇక ఈ మ్యాచ్ లో…10-9, 10-9, 9-10 , 9-10 , 9-10 , 9-10 , 9-10 , 9-10 , తేడాతో మైక్ టైసన్ ను ఓడించాడు పాల్. అంటే… 74 -78 తేడాతో పాల్ విజయం సాధించడం జరిగింది. దీంతో మైక్ టైసన్ కు నిరాశ తప్పలేదు. ఇది ఇలా ఉండగా 2005 సంవత్సరంలో… మైక్ టైసన్ బాక్సింగ్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: KL Rahul – Mumbai Indians: RCBకి ఎదురుదెబ్బ… ముంబైలోకి కేఎల్ రాహుల్.. ఓపెనర్ గా ప్రమోషన్ ?
ఆ సమయంలో కెవిన్ అనే వ్యక్తి చేతిలో ఓడిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చాడు. మళ్లీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత రింగులోకి అడుగు పెట్టాడు. అయితే ఈ ఫైట్ లో పాల్గొన్న టైసన్ కు 168 కోట్లు, పాల్ కు సుమారు 334 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Also Read: Shikhar Dhawan – NPL 2024: ఐపీఎల్ కు గుడ్ బై..నేపాల్ కు వెళ్లిపోతున్న శిఖర్ ధావన్ ?