E-Paper
Advertisement

World’s Tallest Bridges Guizhou: ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 ఒకే రాష్ట్రంలో.. ప్రకృతి ఒడిలో ఈ అందమైన బ్రిడ్జిలు ఒక్కసారైనా చూడాలి!

World’s Tallest Bridges Guizhou: ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 ఒకే రాష్ట్రంలో.. ప్రకృతి ఒడిలో ఈ అందమైన బ్రిడ్జిలు ఒక్కసారైనా చూడాలి!

World’s Tallest Bridges Guizhou| ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 చైనాలోని ఒక గుయిజౌ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ 49లో కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నాలుగు వంతెనలు ఉండడం విశేషం. ఈ నాలుగు బ్రిడ్జీల నిర్మాణానికి అంతర్జాతీయం స్థాయిలో ప్రతిష్టాత్మక గుస్తావ్ లిండెథెల్ అవార్డ్ లభించింది.

ఎక్కువ బ్రిడ్జీలు, అద్భుతమైన కట్టడాలతో గుయిజౌ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కనెక్టివిటీ పెరిగి రవాణా సౌకర్యం వల్ల వ్యాపారాభివృద్ధి వేగంగా జరుగుతోంది. డిసెంబర్ 2023లో ఖిన్ జెన్ కౌంటీ ఉన్న హుయాడోంగ్ బ్రిడ్జి ప్రారంభమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ బ్రిడ్జి చాలా పాపులర్ అయింది. దీంతో ఈ బ్రిడ్జి చూడడానికి.. దాని చుట్టూ ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి బారులు తీరుతున్నారు.

Also Read: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

ఒకటిన్నర కిలోమీటర్ ఉన్న ఈ బిడ్రి విశాల పర్వతాల మధ్యన నిర్మించారు. గుయిజౌ రాష్ట్రంలోని రెన్ హుయాయి, జున్ యి నగరాలకు ఈ బ్రడ్జి ద్వారా వెళ్లడం సులభమైన మార్గం. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం అంత సులువుగా జరగలేదు. ఎత్తైన బండలు, చెట్లు, కారడవి.. ఇన్ని అవాంతరాలున్నా ఇంజినీర్లు, నిర్ణాణ కూలీలు దీని నిర్మాణం పూర్తిచేశారు.

రెండు ప్రధాన నగరాల మధ్య అడవి ప్రాంతం ఉండడం, సరైన రోడ్లు లేకపోవడంతో బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి తరలించాడానికి, బ్రిడ్జి నిర్మాణానికి ఖరీదైన టెక్నాలజీ ఉపయోగించాల్సి వచ్చింది. దీనికి భారీ మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేసింది. దాదాపు 2.79 బిలియన్ డాలర్లు నిర్మాణ ఖర్చు అయినట్లు సమాచారం.

అలాగే గిన్నిస్ బుక్ లో అత్యంత ఎత్తైన బ్రిడ్జిగా రికార్డు సృష్టించిన బెయిపాన్ బ్రిడ్జి కూడా ఇక్కడే ఉంది. గుయిజౌ రాష్ట్రంలోని నిజూ నదిపై దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జి 565 మీటర్ల పొడవు ఉంది. ఈ బ్రిడ్జీలు నిర్మించడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని చైనా కమ్యూనికేషన్స్ కన్‌ట్రక్షన్స్ ప్రాజెక్ట్ మెనేజర్ వాంగ్ చావ్ తెలిపారు. దీంతోపాటు హుయాజియాంగ్ నదిపై మరో హ్యాంగింగ్ బ్రిడ్జి నిర్మాణంలో ఉందని కూడా వెల్లడించారు.

Also Read: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

అయితే అన్నింటి కంటే పెద్ద బ్రిడ్జి దఫాఖు గ్రాండ్ బ్రిడ్జి రెన్ హుయాయి, జున్‌యి ఎక్స్ ప్రెస్ వే పై నిర్మించారు. ఈ బ్రిడ్జి పై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని.. దీంతో రెండు నగరాల మధ్య ఉన్న 52.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే 90 నిమిషాల సమయం పట్టేది, కానీ ఇప్పుడు దఫాఖు బ్రిడ్జి మీదుగా కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చని నిర్మాణ కంపెనీ తెలిపింది.

ఈ బ్రిడ్జీలు, చుట్టుపక్కల అడవి ప్రాంతాలు చూడడానికి పర్యాటకులు వస్తూ ఉండడంతో ఆ ప్రాంతంలో హోటల్స్ కూడా వెలిశాయి. దీంతో ఆ కొండ ప్రాంతాలు టూరిస్ట్ బిజినెస్ గా మారుతున్నాయి. వందల మందికి ఉపాధి లభిస్తోంది.

Also Read: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×