BigTV English

Healthy Foods: సోయాబీన్స్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు..

Healthy Foods: సోయాబీన్స్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు..

Healthy Foods: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వంటింట్లో ఉండే ప్రతీ పదార్థంతోను పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ తరుణంలో సోయాబీన్స్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ చాలా మంది కేవలం దీనిని ఒక ఆహార పదార్థంగా మాత్రమే చూస్తుంటారు. అయితే సోయాబీన్స్ ఎక్కువగా చైనీస్ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు.


సోయాబీన్స్ లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఈ, ప్రోటీన్, కాల్షియం, రైబోఫ్లావిన్, ఫైబర్, అమినో యాసిడ్, థయామిన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు రక్తపోటు వంటి చాలా రకాల సమస్యలను కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇక సోయాబీన్స్ వల్ల కేవలం ఇవి మాత్రమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముకల ఆరోగ్యం


సోయాబీన్స్ లో ఉండే కాల్షియం కారణంగా ఎముకలను దృఢంగా తయారుచేస్తుంది. అంతేకాదు దంతాలను కూడా బలంగా ఉంచుతుంది. ముఖ్యంగా మహిళలను సోయాబీన్స్ తీసుకోవడం వల్ల ఎములక క్షీణత వంటి సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చు. 30 ఏళ్లు పైబడిన మహిళలు సోయాబీన్స్ తినడం చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

రక్తపోటును నియంత్రణ

రక్తపోటును నియంత్రించేందుకు సోయాబీన్స్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. సోయాబీన్ పాలను ఉపయోగించడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు. మరోవైపు ఒత్తిడి వంటి సమస్యల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇందులో ఉండే అధిక ప్రోటీన్ ఒత్తిడి సమస్యను తగ్గిస్తుంది.

అధిక బరువు

అధిక బరువు వంటి సమస్య బారిన పడిన వారు సోయాబీన్ లో ఉండే పోషకాల వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇది మాంసాహారం కంటే చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. సోయాబీన్స్ తో కట్లెట్, కబాబ్స్ కూడా తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా సోయా బీన్స్ తో బిర్యానీ కూడా తయారుచేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Nail Biting: తరచూ గోళ్లు కొరుకుతున్నారా ? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే !

Causes Of Anger: ప్రతి చిన్న విషయానికీ కోపం వస్తుందా.. ? కారణాలివే !

Longtime Sitting: ఆఫీసులో ఎనిమిది నుంచి పది గంటలు కూర్చుంటున్నారా? అయితే ఈ వ్యాధి త్వరలోనే వచ్చేస్తుంది

Weight Loss Tips: ఉదయం పూట ఇలా చేస్తే.. ఈజీగా వెయిట్ లాస్

Strawberries: డైలీ స్ట్రాబెర్రీలు తింటే.. శరీరంలో జరిగే మార్పులివే !

Open Pores On Face: ఓపెన్ పోర్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ?

Big Stories

×