BigTV English

Houthis attack Red sea : హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. ప్రపంచ దేశాలపై పెను ప్రభావం పడనుందా?

Houthis attack red sea: హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలపై ప్రభావం పడింది. యూరప్ నుంచి ఆసియాకు సముద్రమార్గం గుండా సరుకు రవాణా చేసే వందలాది షిప్పులపై యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం యూరప్ నుంచి ఆసియాకు ప్రయాణించే నౌకలపై ఇరాన్ బినామీ అయిన హౌతీ విద్రోహలు.

Houthis attack Red sea : హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. ప్రపంచ దేశాలపై పెను ప్రభావం పడనుందా?

Houthis attack Red sea: హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలపై ప్రభావం పడింది. యూరప్ నుంచి ఆసియాకు సముద్రమార్గం గుండా సరుకు రవాణా చేసే వందలాది షిప్పులపై యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం యూరప్ నుంచి ఆసియాకు ప్రయాణించే నౌకలపై ఇరాన్ బినామీ అయిన హౌతీ విద్రోహలు. హౌతీ రెబల్స్ డ్రోన్ , మిసైల్స్ తో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడుల భయం వల్ల షిప్పులు మార్గాన్ని మార్చుకుంటున్నాయి. ప్రస్తుతం యూరప్ నుంచి ఇండియా, ఇతర ఆసియా దేశాలకు వెళ్ళే షిప్పులకు ఎర్రసముద్రం (RED sea) ద్వారా నే షార్ట్ కట్ రూట్ ఉన్నది. ఈ మార్గం గుండా ప్రయాణించడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి.


ఈ మార్గం నుంచే యూరప్ నుంచి మధ్యదరా సముద్రం(Mediterranean sea) గుండా ఈజిప్టు లోని సూయజ్ కెనాల్‌ని దాటుకుని గల్ఫ్ లోని ఎర్రసముద్రం గుండా అరేబియా సముద్రానికి , ఇండియన్ ఓషియన్ మీదగా ఆసియా దేశాలకు నౌకలు రాకపోకలు సాగిస్తున్నాయి.

ఎర్ర సముద్రం ద్వారా వెళ్లే షిప్పులపై యెమెన్ నుంచి హౌతి రెబల్స్ నౌకలపై డ్రోన్ , మిసైల్ దాడులు చేస్తున్నారు.


గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంబించినప్పటి నుండి హమాస్ కు మద్దతుగా హౌతీలు దాడులు పెంచారు. దీంతో అనేక షిప్పింగ్ కంపెనీలు తమ సరుకు రవాణా నౌకలను యూరప్ నుంచి ఆఫ్రికా చుట్టూ తిరిగి అరేబియా సముద్రం మీదగా ఇండియాకు, ఇతర ఆసియా దేశాలకు పంపుతున్నాయి. దీంతో సరుకు రవాణాకు ఎక్కువ సమయం పడుతుంది. ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతోంది.

ఫలితంగా ఆసియా దేశాల్లో చమురు ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణించడం వల్ల కార్గో ధరలు రెట్టింపు కాన్నున్నాయి. హమస్ మద్దతుగా ఉన్న హౌతీలు దాడులు చేయ్యడం వల్ల అంతర్జాతీయ షిప్పింగ్ బిజినెస్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉదాహరణకు సూయజ్ కెనాల్ రూట్‌లో ఒక టీఈయూ 20 అడుగుల కంటైనర్ సరుకు రవాణాకు రూ.83 వేలు ఖర్చు అవుతుంది. ఆఫ్రికా చుట్టూ ఉన్న మార్గంలో ప్రయాణించడం వల్ల అదే కంటైనర్ రవాణా ఖర్చు రూ.1.66 లక్షలు పైనే అవుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు ముందు సరుకు రవాణా ఖర్చులు పెరిగి సామాన్యులపై ధర పెరుగుదల పిడుగు పడుతుంది.

Related News

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

Big Stories

×