BigTV English

Hurricane Milton: : హరికేన్ మిల్టన్.. అంతరిక్షం నుంచి అరుదైన వీడియో, దీన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే!

Hurricane Milton: : హరికేన్ మిల్టన్.. అంతరిక్షం నుంచి అరుదైన వీడియో, దీన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే!

Hurricane Milton: హెలెన్‌ తుఫాను పెను విధ్వంసాన్ని మర్చిపోక ముందు అమెరికాను మరో తుఫాన్ వణిస్తోంది. ఫ్లోరిడా వైపు మిల్టన్ హరికేన్ శరవేగంగా దూసుకొస్తోంది. అత్యంత ప్రమాదకరమైన 5వ కేటగిరీ హరికేన్ మిల్టన్ దెబ్బకు అమెరికాలోని పలు ప్రాంతాలు పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని అమెరికా తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. శరవేగంగా వస్తున్న హరికేన్ ఇవాళ ఫ్లోరిడా దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోంది.


అమెరికాను తాకిన తీవ్ర గాలులు

మిల్టన్ హరికేన్ ప్రభావంతో బుధవారం తెల్లవారుజాము నుంచే తీవ్రమైన గాలులు వీస్తాయని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. మిల్టన్‌ ఐదో కేటగిరీ హరికేన్ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. ప్రజలను సేఫ్ జోన్లకు తరలిస్తున్నారు. ఫ్లోరిడాలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ప్రెసిడెంట్ బైడన్ కోరారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను ధ్వంసం చేసే రాక్షస తుఫాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


ఐదో కేటగిరీ తుఫాన్ టోర్నడోకు మించి బీభత్సం సృష్టిస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్లోరిడాలో ఇప్పటికే పలు సురక్షిత షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు. తుఫాన్ నేపథ్యంలో  ఫ్యూయెల్ స్టేషన్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. చాలా స్టేషన్ల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం అధికారులు ప్రత్యేకంగా స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ శతాబ్ద కాలంలో అత్యంత తీవ్రమైన తుఫాన్

మిల్టన్ తుఫాన్ తొలత రెండో కేటగిరీ హరికేన్ గా మొదలై ప్రస్తుతం ఐదో కేటగిరీ హరికేన్ గా బలపడింది. ఈ తుఫాన్ ప్రభావంతో సుమారు 200 కిమీ నుంచి 280 కిమీకి పైగా వేగంతో గాలులు వీస్తాయి. ఇంత వేగంగా తుఫాన్ బలపడటం ఆశ్చర్యం కలిగిస్తుందంటున్నారు వాతావరణ నిపుణులు. గత శతాబ్ద కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన తుఫాన్ కావచ్చని   అంచనా వేస్తున్నారు. రీసెంట్ గా ఫ్లోరిడాను తాకిన హెలెన్ తుఫాన్ నాలుగో కేటగిరీకి చెందినది.

దీని ప్రభావంతో సుమారు 225 కిమీ వేగంతో గాలులు వీచాయి. నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టేనస్సీ, వర్జీనియా సహా పలు రాష్ట్రాల్లో సుమారు 230 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఐదో కేటగిరీ హరికేన్ గా మిల్టన్ రూపుదిద్దుకోవడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అటు ఫ్లోరిడాలో టూరిస్టు కేంద్రాలైన డిస్నీ ల్యాండ్‌, కెన్న‌డీ స్పేస్ సెంట‌ర్ల‌ను క్లోజ్ చేశారు.

బైడెన్ విదేశీ పర్యటన రద్దు

ఇక మిల్టన్ హరికేన్ నేపథ్యంలో ప్రెసిడెంట బైడన్ విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. జర్మనీ, అంగోలాలో బైడెన్ పర్యటించాల్సి ఉంది. కానీ, తుఫాన్ పునరావాస పనులను ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫారిన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు.

సోషల్ మీడియాలో మిల్టన్ హరికేన్ బీభత్సం

మిల్టన్ హరికేన్ సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తోంది. ప్రమాదకరమైన ఈ తుఫాన్ కు సంబంధించి పరిశోధకులు కీలక విషయాలను పంచుకుంటున్నారు. పశ్చిమ-మధ్య ఫ్లోరిడాలో మిల్టన్ హరికేన్ విధ్వంసం సృష్టించబోతుందని   నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. పలువురు శాస్త్రవేత్తలు మిల్టన్ హరికేన్ కు సంబంధించి స్పేస్ నుంచి తీసిన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. NASA వ్యోమగామి మాథ్యూ డొమినిక్  డ్రాగన్ ఎండీవర్ అంతరిక్ష నౌక నుంచి తీసిన వీడియోను షేర్ చేశారు.

Read Also: మస్క్ మామ బంపర్ ఆఫర్.. అలా చేస్తే రూ.4 వేలు ఇస్తాడట, చంపేద్దాం అనుకుంటున్నాడా?

Related News

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Big Stories

×