BigTV English

Flights: వాళ్లు సినిమాలకు వెళ్లాలన్నా విమానాల్లోనే..

Flights: వాళ్లు సినిమాలకు వెళ్లాలన్నా విమానాల్లోనే..

Flights: ప్రస్తుత కాలంలో బయటకు వెళ్లాలంటే చాలు.. అందరూ బైకు, కార్లను వినియోగిస్తున్నారు. కొద్దిదూరమైనా బైకు లేనిదే అడుగు బయట పెట్టడం లేదు. మన దగ్గర అయితే ప్రతి ఒక్కరూ బైకు.. మరికొందరు కార్లను వాడుతున్నారు. ఇక దిగ్గజ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కొందరు మాత్రమే సొంత విమానాలను మెయింటెన్ చేస్తున్నారు.


అయితే అమెరికాలోని ఓ గ్రామంలో మాత్రం ప్రతి ఇంటి ముందు ఓ విమానం ఉంటుంది. మన దగ్గర బైకును ఉపయోగించినట్లే.. అక్కడ విమానాలను వినియోగిస్తుంటారు. చిన్న పనులకు కూడా విమానాల్లో తుర్రున ఎగిరిపోతుంటారు. రోడ్లను రన్‌వేలా ఉపయోగించుకుంటున్నారు.

కాలిఫోర్నియాలోని ఎయిర్ పార్క్ అనే ప్రాంతంలోని ప్రజలు విమానాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అక్కడ మొత్తం 124 ఇళ్లు ఉండగా.. ప్రతి ఇంటి ముందు ఓ విమానం ఉంటుంది. వారికి పైలెట్లతో కూడా పని ఉండదు.. ఎవరి విమానాన్ని వారే నడుపుకుంటారు. అక్కడ నివసించే వారిలో చాలా మంది రిటైర్డ్ ఆర్మీ పైలట్లే ఉంటారు. ప్రతి ఇంట్లో ఒకరికి కచ్చితంగా విమానం నడపడం తెలిసి ఉంటుంది. ఆఫీస్‌లకు, సినిమాలకు, పార్టీలకు ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా విమానంలోనే ప్రయాణిస్తుంటారు.


Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×