E-Paper
Advertisement

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే
Advertisement

Russia Prisident: రష్యా అధ్యక్షుడు పుతిన్ విదేశీ టూర్లకు వెళ్తే ఆయన భద్రత అంతా ఇంకా కాదు. కేవలం సెక్యూరిటీ మాత్రమే కాదు.. తినే ఆహారం మొదలు చేతులు తుడుచుకునే టిష్యూల మొదలు టవల్స్ వరకు ఎంతో భద్రంగా ఉంచుతారు రష్యా సిబ్బంది. వాటిని మళ్లీ రష్యాకు తరలిస్తారు. చివరకు జీవ సంబంధమైన ఆనవాళ్లు ఉంచకుండా జాగ్రత్తగా తీసుకెళ్తారు. జీవ సంబంధమైన విషయాలకు ఒక్కసారి వద్దాం.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘అంతర్గత’ భద్రత

బిక్స్ సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఉదయం ఢిల్లీలో దిగారు. విమానంలో ఆయన అడుగుపెట్టింది మొదలు భద్రత అంతా ఇంకా కాదు. బుల్లెట్‌ప్రూఫ్ కార్లు, సాయుధ కమాండోలు, కట్టుదిట్టమైన భద్రతా వలయానికి మాత్రమే పరిమితం కాదు. రష్యా అధ్యక్షుడు భద్రతలో అత్యంత సున్నితమైన అంశమైన జీవ భద్రత. శరీరానికి సంబంధించిన వెంట్రుకలు, చర్మ కణాలు, రక్తం లేదా ఇతర జీవ నమూనాల వంటివి ఆనవాళ్లు ఇతరులకు బహిర్గతం కాకుండా చూసుకుంటారు సెక్యూరిటీ విభాగం. అధ్యక్షుల గుర్తింపు, ఆరోగ్యం గురించి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయవు. పుతిన్ జీవ సంబంధమైన ఆనవాళ్ల సహా అతని చుట్టూ ప్రతి ఒక్కరినీ, ప్రతి ప్రదేశాన్ని నియంత్రించడం భద్రతకు అత్యంత కీలకం. ప్రపంచంలోని దాదాపు దేశాధినేతలందరూ ఆ తరహా భద్రత కలిగి ఉంటారు.

దీని వెనుక ఓ చారిత్రక గూఢచర్య

Advertisement

1949 నాటిది కథ. సోవియట్ రష్యా నాయకుడు స్టాలిన్- చైనా నాయకుడు మావో జెడాంగ్ గురించి చెప్పనక్కర్లేదు. అ నేతలిద్దరూ కమ్యూనిస్ట్ భావజాలాన్ని పంచుకున్నప్పటికీ సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్.. చైనా నాయకుడ్ని పూర్తిగా విశ్వసించలేదు. అంతర్జాతీయ మీడియా కథనాల మేరకు స్టాలిన్ కాలంలో సోవియట్ గూఢచార సంస్థ విదేశీ నాయకుల గురించి సమాచారాన్ని సేకరించడానికి ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించింది.
విదేశీ నాయకుల మానసిక ప్రొఫైల్‌లను రూపొందించడానికి ఓ రహస్య ప్రయోగశాల వారి మల నమూనాలను విశ్లేషించిందని మాజీ సోవియట్ గూఢచారి అధికారి ఇగోర్ అటమానెంకో తెలిపారు. 1949, డిసెంబర్‌లో మావో మొదట మాస్కోకు చేరుకుని అక్కడ 10 రోజులు ఉన్నారు. ఆ సమయంలో ఆయన కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, వాటిలో మలాన్ని మురుగు నీటి కాలువలోకి వదిలి వేయకుండా రహస్యంగా సేకరించేవారని చెబుతారు. ఈ నమూనాలను తర్వాత అమైనో ఆమ్లాలు, పొటాషియం వంటి మూలకాల విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపారు. శరీరంలోని కొన్ని రసాయన మూలకాల స్థాయిలు ఒక వ్యక్తి స్వభావాన్ని సూచించగలవని సోవియట్ శాస్త్రవేత్తలు విశ్వసిస్తారని ప్రచారం ఉంది.

సోవియట్ యూనియన్ సమయంలో కేజీబీ గూఢచార సంస్థలో గూఢచారిగా పని చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ప్రపంచంలో గూఢచర్య ఎలాంటి కుతంత్రాలు అవలంబిస్తారో ఆయనకు బాగా తెలుసు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన పూర్తి భద్రతా పరివారంతో ఢిల్లీకి వచ్చారు. ఈ విమానాల్లో రష్యా అతిపెద్ద భారీ సైనిక రవాణా విమానం, ఐఎల్-76 కూడా ఉంటుంది. సోవియట్ కాలం నాటి నాలుగు ఇంజన్ల విమానం అది. అధ్యక్షుడు పుతిన్ భద్రతా సిబ్బందిని, సైనిక అధికారులు, అవసరమైన పరికరాలను రవాణా చేస్తుంది. అధ్యక్షుడు పుతిన్ ఎక్కడికి వెళ్లినా ముందుగా ఒక కట్టు దిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేయబడుతుంది. ఆ వలయాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ప్రత్యేక భద్రతా అధికారులు, సైనిక అధికారులు, సమాచార నిపుణులు, లాజిస్టిక్స్ బృందాలు, ప్రోటోకాల్ అధికారులు, ప్రత్యేక వాహనాలు, కొన్నిసార్లు ఆయనకు ఇష్టమైన ఆహారాన్ని పంపుతారు. ఈ మొత్తం వ్యవస్థ కొన్నాళ్లుగా ప్రారంభమైనట్లు కాదు.

చివరకు పుతిన్ మలం కూడా రష్యాకు తిరిగి తరలిస్తారు

Advertisement

2000 ఏడాదిలో పుతిన్ తొలిసారి రష్యా అధ్యక్షుడి నుంచి హోటల్‌లో నీరు, పాత్రలు, హౌస్‌ కీపింగ్ సిబ్బందిపై ఆధారపడలేదు. ఆయన ప్రతి విదేశీ పర్యటనలో రష్యా నుండి నీరు, పరుపులు, వైద్య కిట్లు, వైద్యులు, ప్రత్యేక భద్రతా అధికారుల బృందాన్ని పంపేవారు. అధ్యక్షుడు పుతిన్ బస చేసిన హోటల్‌లో మొదట పరుపులను మార్చి ఆ తర్వాత గది మొత్తాన్ని శానిటైజ్ చేసేవారు. 2010 నుంచి పుతిన్ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా ఆయనకు ఓ మొబైల్ ఆహార ప్రయోగశాలను పంపాలనే నిబంధనను ఏర్పాటు చేశారు. పుతిన్ ఎంపిక చేసిన చెఫ్‌లు, శాస్త్రవేత్తలు ఉంటారు. నీటి నుండి సలాడ్ వరకు ప్రతి దాన్నీ పరీక్షించడం వారి పని. ఆ తర్వాత దాన్ని అధ్యక్షుడు పుతిన్‌కు వడ్డించడానికి అనుమతిస్తారు. 2014 ఏడాదిలో ఈ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈసారి అధ్యక్షుడు పుతిన్ తన విదేశీ పర్యటనల సమయంలో ఎలాంటి జీవ సంబంధమైన ఆనవాళ్లు ఉంచకూడదని నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో అధ్యక్షుడు పుతిన్ తాకిన ఏ గాజు వస్తువు, ఉపయోగించిన టిష్యూ పేపర్‌, టవల్ వంటివి విడిచిపెట్టిన ఏ వస్తువునైనా ఆయన బృందం వెంటనే సేకరించి రష్యాకు తిరిగి తీసుకెళ్తుంది.

అధ్యక్షుడు పుతిన్ బస చేసే హోటల్‌లో ఏవైనా జీవ నమూనాలు మరో దేశంలోకి విడుదల కాకుండా నిరోధించడానికి గదిలోని ప్లంబింగ్, డ్రెయిన్‌లను సిబ్బంది మూసివేస్తారు. అందుకోసం భద్రత సిబ్బంది కొద్దిరోజులు ముందుగా ఆ దేశానికి చేరుకుంటుంది. రష్యా అధ్యక్షుడి భద్రత కోసం డ్రోన్ జామ్మర్లు, డ్రోన్ నిరోధక ఆయుధాలు, బుల్లెట్‌ప్రూఫ్, బ్లాస్ట్‌ప్రూఫ్ వాహనాలను పంపిస్తారు. అంతేకాక వారి రక్షణ కోసం స్నైపర్ కమాండోలు అందుబాటులో ఉంటారు. అధ్యక్షుడు పుతిన్ భద్రత కోసం 800 మందికి పైగా సైనికులతో ఒక ప్రత్యేక సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు క్రెమ్లిన్ స్వయంగా వెల్లడించింది.

Related News

H-1B వీసాదారులకు ట్రంప్ ఝలక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ ఎత్తేసే ఛాన్స్, అందుకోసం కొత్తగా

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

Big Stories

Advertisement
×