Trump Govt: వలస వాదులపై ఉక్కుపాదం మోపుతోంది ట్రంప్ సర్కార్. కనీసం నెలకు ఓ కొత్త రూల్స్ తెరపైకి తీసుకొస్తోంది. అక్కడి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగిలిన కొద్దీ కొత్త చటాలకు పదును పెడుతోంది. తాజాగా H-1B వీసాదారులకు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది ట్రంప్ సర్కార్. వీసాలపై ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను ఎత్తివేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అదే జరిగితే అమెరికాలో ఉద్యోగం పోయిన వెంటనే అక్కడివారు స్వదేశానికి రావడం ఖాయం.
ఉద్యోగాల నిమిత్తం అమెరికాకు వచ్చేవారిని ఏదో విధంగా వెనక్కి పంపే ప్రయత్నాలు ముమ్మరం చేసింది ట్రంప్ సర్కార్. అందుకోసం నెలకు ఒక కొత్త అంశాలను తెరపైకి తెస్తోంది. ఈసారి ఏకంగా H-1B వీసాదారులను టార్గెట్ చేశారు. విదేశీ కార్మికుల నిబంధనల్లో పెద్ద మార్పును పరిశీలిస్తోంది. దారి ప్రకారం హెచ్-1బి వీసా హోల్డర్లు, తాత్కాలిక విదేశీ కార్మికులు, తమ ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత ప్రస్తుతం 60 రోజుల గడువును కోల్పోయే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉద్యోగం పోయిన తర్వాత మరో ఉద్యోగం వెతుక్కోవడానికి ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను ఎత్తి వేసేందుకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
అందుకు ఎలిమినేటింగ్ ద డిస్క్రీషనరీ 60-డే గ్రేస్ పీరియడ్ పేరుతో కొత్త నిబంధనను శుక్రవారం ఫెడరల్ రిజిస్టరులో ప్రచురించనుంది ట్రంప్ ప్రభుత్వం. దీనిపై 60 రోజుల్లోగా అభిప్రాయాలను డిపార్టుమెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తెలుపనుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. భారతీయ టెక్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది. హెచ్ 1బీ వీసాలపై ప్రతీ ఏటా వేలాది మంది అమెరికాలో ఉద్యోగాలను పొందుతున్నారు. కొత్త నిబంధన ఆమోదం పొందితే వీసాకు గడువున్నా, ఉద్యోగం పోయిన వెంటనే అమెరికాను వీడాల్సి ఉంటుంది. ప్రత్యేక ఆథరైజేషన్ ఉంటేనే తప్పితే అమెరికాలో ఉండటానికి ఏ మాత్రం వీలు పడదు. ప్రస్తుతం 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఈ1, ఈ2, ఈ3, హెచ్1బీ, హెచ్1బీ1, ఎల్1, ఓ1 వీసాదారులకు, టీఎన్ వలసేతరులకు వర్తించనుంది. H-1B వీసా హోల్డర్లు అధిక వాటాను కలిగి వుంది. అందులోని ఉద్యోగులు అమెరికా టెక్నాలజీ, సేవల రంగంలో పని చేస్తున్నారు.
ALSO READ: తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌లో ఘోరం
2017 నుండి H-1B వీసా హోల్డర్లకు గడువు కాలం అందుబాటులో ఉంది. విదేశీ కార్మికులు ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయినప్పుడు ఆ నష్టాన్ని తట్టుకోవడానికి కొంత సమయం ఇచ్చేందుకు ఈ పద్దతి ప్రవేశపెట్టారు. చాలామంది కార్మికులకు, కొత్త ఇల్లు వెతుక్కోవడం, కుటుంబాలను తరలించడం, పిల్లల చదువులకు ఏర్పాట్లు చేసుకోవడం వంటి కారణాల వల్ల కూడా 60 రోజులు ఇచ్చారు.కొత్త నిబంధనల వల్ల ఈ కింద ఇచ్చిన వీసా హోల్డర్లపై ప్రభావం చూపనుంది.
E-1 వీసా కేవలం అంతర్జాతీయ వ్యాపారులు
E-2 అనేది కొన్ని వాణిజ్య వాహన ఆపరేటర్లు
E-3 అనేది ఆస్ట్రేలియా నుండి ప్రత్యేక కార్మికులు
H-1B1 అనేది సింగపూర్, చిలీ నుండి నైపుణ్యం కలిగిన కార్మికులు
H-1B అనేది ఐటీ, సేవల రంగంలో పని చేసే కార్మికులు
L-1 అనేది అంతర్జాతీయ కంపెనీలలో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు
O-1 అనేది సైన్స్-క్రీడలు, కళలు వంటి రంగాలలో అసాధారణ సామర్థ్యం ఉన్న వ్యక్తులు
TN అనేది కెనడా-మెక్సికో నుండి వచ్చిన వృత్తి నిపుణులు