E-Paper
Advertisement

Iran Attacks On Dubai: దుబాయ్‌ పై ఇరాన్ డ్రోన్ దాడి.. భయంలో తెలుగువారు.. విమాన సర్వీసులు రద్దు

Iran Attacks On Dubai: దుబాయ్‌ పై ఇరాన్ డ్రోన్ దాడి.. భయంలో తెలుగువారు.. విమాన సర్వీసులు రద్దు
Advertisement

Iran Attacks On Dubai: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడితో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో అమెరికా స్థావరాలతో పాటు అమెరికా మద్దతుదారులపై దాడులు చేస్తుంది. తాజాగా దుబాయ్ పై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. దీంతో దుబాయ్ ఎయిర్ పోర్టులో అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. దుబాయ్ బుర్జ్ ఖలీఫా, ఫేమస్ ఫెయిర్ ఫ్రంట్ ది పామ్ హోటల్ వద్ద పేలుళ్లు జరిగాయి.

భయాందోళనలో తెలుగోళ్లు

దుబాయ్ పై దాడుల నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. తమ వారు ఎలా ఉన్నారో? అని భయాందోళన చెందుతున్నారు. హీరో మంచు విష్ణు సైతం దాడులకు సంబంధించి ఓ వీడియో పోస్టు చేశారు. ఇరాన్ డ్రోన్ దాడుల్లో దుబాయ్ లో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా బూర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించినట్లు ప్రకటించారు.

యూఎస్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు

Advertisement

అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసిన కొన్ని గంటల తర్వాత.. టెహ్రాన్ గల్ఫ్‌ దేశాల్లో యూఎస్ సైనిక స్థావరాలను లక్ష్యంగా ప్రతీకార దాడులకు దిగింది. దోహా, అబుదాబితో సహా మిడిల్ ఈస్ట్ నగరాల్లో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. బహ్రెయిన్, ఖతార్, యూఏఈలోని స్థావరాలతో సహా ఇజ్రాయెల్, యూఎస్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. దుబాయ్‌లోని పామ్ జుమేరాలోని హోటల్ సమీపంలో భారీగా పొగలు కనిపించాయి. దుబాయ్‌లోని ప్రసిద్ధ ద్వీపం ది పామ్ సమీపంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. బహ్రెయిన్ లక్ష్యంగానూ ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది.

పామ్ జుమేరాలో పేలుడు

Advertisement

పామ్ జుమేరా ప్రాంతంలోని ఒక భవనంలో పేలుడు సంభవించిందని దుబాయ్ అధికారులు తెలిపారు. మంటలు చెలరేగి నలుగురు గాయపడ్డారన్నారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ మంటలను అదుపు చేసిందన్నారు. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ దాడులపై ఓ ప్రకటన విడుదల చేసింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను తిప్పికొడుతున్నాయని పేర్కొంది. తమ దేశ భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ధైర్యంగా ఎదుర్కొంటున్నామని తెలిపింది. ఇరాన్ ఇందుకు భారీ మూల్యం చెల్లించుకుంటుందని తెలిపింది.

గల్ఫ్ దేశాలకు ప్రయాణాలు వద్దు

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రయాణ సూచనలు చేసింది. గల్ఫ్ దేశాలకు ప్రయాణాలు వద్దని సూచించింది. దుబాయ్ ఎయిర్ పోర్టు తాత్కాలికంగా మూసివేయడంతో శనివారం పూణే నుంచి దుబాయ్, అబుదాబికి వెళ్లాల్సిన మూడు అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి.

విమాన సర్వీసులు రద్దు

ప్రతిస్పందనగా, అనేక దేశాలు వైమానిక రక్షణ వ్యవస్థలను సక్రియం చేశాయి మరియు వారి గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసాయి, దీని ఫలితంగా గల్ఫ్ గుండా లేదా సమీపంలో ప్రయాణించే అంతర్జాతీయ వైమానిక కారిడార్‌లలో విమాన రద్దు మరియు మార్గాల మళ్లింపులు సంభవించాయి.

Also Read:  వణికుతున్న దుబాయ్, రియాద్.. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు

 

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×