E-Paper
Advertisement

Iran Attack: వణుకుతున్న దుబాయ్, రియాద్.. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు

Iran Attack: వణుకుతున్న దుబాయ్, రియాద్.. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
Advertisement

Iran Missile Attack Dubai Abu Dhabi: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు గల్ఫ్ దేశాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. అమెరికా.. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై జరిపిన ఉమ్మడి దాడులకు ప్రతికారంగా టెహ్రాన్ తన క్షిపణి శక్తిని ప్రయోగించింది. శనివారం సాయంత్రం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు యూఏఈలోని అబుదాబీ.. దుబాయ్‌లతో పాటు ఖతార్ రాజధాని దోహా.. సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరాలను తాకాయి. అబుదాబీలోని ఒక నివాస ప్రాంతంలో క్షిపణి శకలాలు పడటంతో ఒక పౌరుడు మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

దుబాయ్ లో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆకాశంలో క్షిపణులు నిప్పులు చిమ్ముతూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. శక్తివంతమైన పేలుళ్ల ధాటికి భవనాల కిటికీలు.. తలుపులు కంపించాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ దాడులను యూఏఈ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పౌరుల భద్రతకు ముప్పు కలిగించే ఇటువంటి చర్యలు అత్యంత ప్రమాదకరమని.. ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే పిరికిపంద చర్యలని ఆ దేశ రక్షణ శాఖ మండిపడింది.

Advertisement

ఇరాన్ ప్రధానంగా అమెరికా సైనిక స్థావరాలు ఉన్న నగరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. అబుదాబీలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్.. దోహాలోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్‌లలో అమెరికా వైమానిక దళానికి బలమైన ఉనికి ఉంది. అదేవిధంగా దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్ట్ అమెరికా నౌకాదళానికి కీలకమైన కేంద్రంగా ఉంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద కూడా సుమారు 2,000 మంది అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమ ఆసియాలోని గగనతలం పూర్తిగా అనిశ్చితిలో పడిపోయింది. క్షిపణి దాడుల భయంతో గల్ఫ్ దేశాలు తమ విమానాశ్రయాలను మూసివేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యుద్ధ తీవ్రత పెరుగుతున్న కొద్దీ చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం పడనుంది. ఇరాన్ అగ్రనేతలు ఇజ్రాయెల్.. అమెరికా చర్యలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించడంతో ఘర్షణలు మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది.

Advertisement

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×