E-Paper
Advertisement

Manchu Vishnu: యుద్ధంలో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ.. తలపైనే వెళ్తున్న క్షిపణి!

Manchu Vishnu: యుద్ధంలో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ.. తలపైనే వెళ్తున్న క్షిపణి!
Advertisement

Manchu Vishnu: ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సామాన్య ప్రజలను ఎంతటి భయాందోళనలకు గురిచేస్తున్నాయో మంచు విష్ణు (Manchu Vishnu) చేసిన తాజా ఎక్స్ పోస్ట్ స్పష్టం చేస్తోంది. తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉన్న సమయంలో ఎదురైన భయంకర అనుభవాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దుబాయ్‌లో తన కుటుంబ సభ్యులతో గడుపుతున్న సమయంలో, ఆకాశంలో క్షిపణులు దూసుకుపోవడం చూసి విష్ణు దిగ్భ్రాంతికి లోనైనట్లుగా తెలిపారు. ముఖ్యంగా క్షిపణులను అడ్డుకుంటున్న సమయంలో వెలువడిన భారీ శబ్దాలు తమ ఇంటిని సైతం కంపింపజేశాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల మంచు విష్ణు అండ్ ఫ్యామిలీ దుబాయ్‌లోనే నివాసం ఉంటున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు గల్ఫ్ దేశాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. అమెరికా.. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై జరిపిన ఉమ్మడి దాడులకు ప్రతికారంగా టెహ్రాన్ తన క్షిపణి శక్తిని ప్రయోగించింది. శనివారం సాయంత్రం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు యూఏఈలోని అబుదాబీ.. దుబాయ్‌లతో పాటు ఖతార్ రాజధాని దోహా.. సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరాలను తాకినట్లుగా తెలుస్తోంది. ఆ యుద్ధ దాడుల్లోనే మంచు విష్ణు ఫ్యామిలీ చిక్కుకున్నారు. ఆయన పోస్ట్ చేసిన వీడియో చూస్తే.. ఆయన తలపై నుంచే క్షిపణి వెళుతోంది. ఈ వీడియో షేర్ చేసిన మంచు విష్ణు..

Also Read- US Israel Attacks: ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి తృటిలో బయటపడిన ఎన్టీఆర్!

భయాందోళనలో చిన్నారి ఐరా!

Advertisement

ఏ చిన్నారి కూడా తన ఇంటిపై యుద్ధ శబ్దాలను వింటూ పెరగకూడదు అని ఆయన పోస్ట్ చేసింది చూస్తుంటే.. ఈ భీకర శబ్దాలకు తన చిన్నారి కుమార్తె ఐరా ఎంతగా భయపడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం తెలపుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల కలిగే మానసిక ఆందోళనలు పిల్లలపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఒక తండ్రిగా ఆయన మాటల్లో తెలుస్తోంది. పౌరుల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న యూఏఈ (UAE) రక్షణ దళాలకు మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. క్షిపణి దాడుల నుండి సామాన్యులను కాపాడుతున్న వారి తెగువను, ధైర్యాన్ని ఆయన కొనియాడారు.

Also Read- Ranabaali: విజయ్, రష్మికల పెళ్లి ఫొటోల కంటే.. ‘రణబాలి’ పాట ఫొటోలు భలే ఉన్నాయిగా!

జీవితం ఎంత సున్నితమైందో..!

Advertisement

అంతేకాదు, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడే జీవితం ఎంత సున్నితమైనదో అర్థమవుతుందని విష్ణు పేర్కొన్నారు. అంతా సవ్యంగా ఉందనుకున్న క్షణంలోనే అనూహ్య మార్పులు సంభవిస్తాయని, అందుకే ప్రతి క్షణం విలువైనదని ఆయన గుర్తుచేశారు. చివరగా ‘హర హర మహాదేవ్’ అంటూ దైవస్మరణ చేస్తూ, అందరూ ధైర్యంగా ఉండాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆయన ప్రార్థించారు. ఇంతకు ముందు ఎన్టీఆర్ (Jr NTR) కూడా ఈ యుద్ధ దాడుల నుంచి బయట పడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంచు విష్ణు అండ్ ఫ్యామిలీ, ఆ ప్రదేశం నుంచి వెంటనే సురక్షిత ప్రదేశానికి రావాలని, క్షేమంగా ఇండియాకు వచ్చేయాలని ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు.. ఈ పోస్ట్‌కు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Renu Desai: అమ్మవారి దుస్తుల్లో ఉన్న నన్ను.. ‘నైట్‌కు రేటు ఎంత‌?’ అని అడుగుతారా?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×