Hormuz Strait Shipping: యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మార్గంలో చమురు రవాణా నౌకలను నిలిపివేస్తు్న్నట్లు ఇటీవల ఇరాన్ ప్రకటించింది. ఎవరైనా ముందుకు వస్తే దాడి చేస్తామని హెచ్చరించింది. దీంతో ఈ మార్గంలో చమురు రవాణా నౌకలు పూర్తిగా నిలిచిపోయింది. హార్ముజ్ కు వద్ద నౌకల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే చమురు నౌకలకు అమెరికా హామీ ఇచ్చింది. నౌకలకు ఎస్కార్ట్ కల్పిస్తామని తెలిపింది. ఇంతలో తమ జలసంధిపై అమెరికా పెత్తనమేంటని ఇరాన్ స్పందించింది.
హార్ముజ్ నుంచి అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయట్లేదని ఇరాన్ ప్రకటించింది. దీంతో భారత్, చైనా సహా మరికొన్ని దేశాలకు భారీ ఊరట లభిస్తుంది. త్వరలోనే భారత్ షిప్పులు ఈ మార్గం గుండా బయలుదేరే అవకాశం ఉంది. అయితే యూఎస్, యూరప్, ఇజ్రాయెల్ నౌకలకు ఎంట్రీ లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే యూఎస్ చమురు నౌకపై ఇరాన్ దాడి చేసింది.
అమెరికా, ఇజ్రాయెల్ తో యుద్ధంలో ఇరాన్ కు చైనా మద్దతుగా నిలుస్తుంది. ఇరాన్ కు ఆయుధాలు చైనా నుంచి వస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో టెహ్రాన్ పట్ల బీజింగ్ వైఖరికి కృతజ్ఞతగా.. హార్ముజ్ జలసంధి గుండా చైనా నౌకలను మాత్రమే అనుమతించనున్నట్లు ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. పర్షియన్ గల్ఫ్ ఓడరేవులను సముద్రానికి కలిపే మార్గమే హార్ముజ్ జలసంధి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఈ జలసంధిని అనధికారికంగా మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయింది.
హార్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ దళాలు హెచ్చరించాయి. ఆ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని ఇరాన్ తెలిపింది. దానిని దాటడానికి ప్రయత్నించే క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేస్తామని హెచ్చరించింది. హార్ముజ్ జలసంధి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాలకు సముద్ర మార్గాన్ని కల్పిస్తుంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% చైనా, భారత్ వంటి ఆసియా మార్కెట్లకు వెళ్లే ముందు ఈ మార్గం నుంచే వెళ్తుంది.
హర్ముజ్ గుండా వెళ్లే చమురు నౌకలకు యూఎస్ నేవీ ఎస్కార్ట్ ఇస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. హోర్ముజ్ జలసంధిని ఎక్కువ కాలం దిగ్బంధిస్తే చమురు ధరలు భారీగా పెరుగుతాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ప్రపంచ దేశాల చమురు సరఫరా దెబ్బతింటే దాని ప్రభావం అమెరికా పడనుంది.
కువైట్ జలాల్లో ఓ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. దాంతో ఇంధనం సముద్రంలోకి ఒలికింది. గురువారం బ్రిటన్‌కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఓ ప్రకటన చేసింది. కువైట్‌లోని ముబారక్ అల్ కబీర్ పోర్ట్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత అక్కడి నుంచి చిన్న బోటు వెళ్లడం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ట్యాంకర్ నుంచి ఒలికే ఇంధనం వల్ల పర్యావరణంపై ప్రభావం ఉండవచ్చని ఏజెన్సీ పేర్కొంది.
Also Read: యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో మేమే తేలుస్తాం.. ఇరాన్ వార్నింగ్ వెనుకున్న బలమేంటి?
డీజిల్, గాసోలిన్ ఎగుమతులు నిలిపివేయాలని చైనా తన రిఫైనరీలను ఆదేశించింది. గల్ఫ్ దేశాలకు తన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చైనా షిప్పింగ్ సంస్థ COSCO వెల్లడించింది. విశాఖపట్నం నుంచి ఇరాన్ వెళ్తున్న ఆ దేశ యుద్ధ నౌక ఐరిస్ దేనా-75ను అమెరికా జలాంతర్గామితో దాడిచేసి ముంచేసిన విషయం తెలిసిందే. దీనిని ఇరాన్ తీవ్రంగా పరిగణించి ప్రతికారంగా ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేసింది. అమెరికా చమురు ట్యాంకర్ పై దాడి చేసింది.