E-Paper
Advertisement

Rice Mill Scam: మిర్యాలగూడ మిల్లర్ల అక్రమాల పై ఆఫీసర్లు సైలెన్స్.. మతలబేంటో..?

Rice Mill Scam: మిర్యాలగూడ మిల్లర్ల అక్రమాల పై ఆఫీసర్లు సైలెన్స్.. మతలబేంటో..?
Advertisement

Rice Mill Scam: స్వేచ్ఛ బ్యూరో: నల్గొండ జిల్లాలో 2022_23 రబీ సీజన్ లో ప్రభుత్వం మిల్లర్లకు అలాట్ చేసిన ధాన్యాన్ని మిల్లర్లు బరితెగించి బ్లాక్ మార్కెట్ లో అమ్మేశారు. అయితే ఇటీవల ప్రభుత్వం సీఎంఆర్ అక్రమాలపై ఫోకస్ చేయటంతో తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, నల్గొండ జిల్లా కేంద్రంలో ఇప్పటికే కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నల్గొండ జిల్లా కేంద్రం, చిట్యాల మునుగోడు లో మొత్తం ఏడు మిల్లులపై కేసులు నమోదు చేయగా ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించగా ఐదుగురు రైస్ మిల్లర్లు పరారీలో ఉన్నారు.. అయితే ఈ ఏడు మిల్లుల్లో చోటు చేసుకున్న సీఎంఆర్ అక్రమాల నేపథ్యంలో మిర్యాలగూడ మిల్లర్ల అక్రమాల వ్యవహారం తెరపైకి వచ్చింది. 2022 23 రబీ సీజన్ లో మిర్యాలగూడ పరిధిలో సుమారు 72 రైస్ మిల్లులకు ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి కేటాయించింది.

మిర్యాలగూడ మిల్లుల్లో 7,559.2 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్ గుర్తింపు

2022 23 రబీలో జిల్లా వ్యాప్తంగా 131 రైస్ మిల్లులకు 6.71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కేటాయించింది. ఇందులో వివిధ ప్రాంతాల్లోని 59 రైస్ మిల్లులకు 50 శాతానికి పైగా ధాన్యం కేటాయించగా మిగిలిన ధాన్యాన్ని మిర్యాలగూడ ప్రాంత రైస్ మిల్లులకు సీఎంఆర్ నిమిత్తం ఇచ్చేసింది. కాగా మిర్యాలగూడ పరిధిలోని కీర్తి రైస్ ఇండస్ట్రీస్, వాగ్దేవి ఫుడ్ ప్రొడక్ట్స్, ఎస్ వీటీ ఆగ్రో ఇండస్ట్రీస్, శివరామకృష్ణ, శ్రీరామకృష్ణ, మిర్యాలగూడ రైస్ ఇండస్ట్రీస్ కలిపి మొత్తం ఆరు మిల్లులకు 2022_23 రబీలో మొత్తం 23, 597.8 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా ఈ ధాన్యానికి సంబంధించి 7,559.2 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్ ఉన్నట్లు సివిల్ సప్లై అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. ఓవైపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) సివిల్ సప్లై అధికారులు మిల్లులపై తనిఖీలు చేపట్టి ఏ మిల్లు ఎంత సీఎంఆర్ బకాయి ఉన్నది గుర్తించి ప్రభుత్వానికి రిపోర్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే మిర్యాలగూడలో సుమారు రూ. 15.42 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయికి సంబంధించిన ధాన్యం ప్రభుత్వానికి అప్పగించలేదని గుర్తించిన ఇక్కడి మిల్లర్లపై అధికారులు చర్యలు తీసుకోకుండా సైలెన్స్ కావడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Also Read: Uttam Kumar Reddy: తెలంగాణలో భూసేకరణకు ప్రభుత్వం 500 కోట్లు విడుదల

ఎలక్షన్ల ముందు మంతనాలు …!

మిర్యాలగూడలో రైస్ మిల్లర్ల సీఎంఆర్ అక్రమాలు మున్సిపల్ ఎన్నికల సమయానికి ముందు వెలుగులోకి రాగా కీలకమైన మిల్లర్ల అసోసియేషన్ నేతలు, బకాయి పెండింగ్ ఉన్న మిల్లర్లు సమావేశమై అధికార పార్టీకి మద్దతు ఇచ్చి అక్రమాల నుంచి దశలవారీగా బయటపడేందుకు రాజీ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ అక్రమాలపై గట్టి ఫోకస్ పెట్టగా ఇప్పటికే నల్గొండ జిల్లా కేంద్రంలో ఏడు మిల్లులపై కేసులు నమోదు కావడం మిర్యాలగూడలో సైతం 7, 559.2 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ పెండింగ్ ఉండటం అధికారులు ఏ మేరకు రికవరీ చేస్తారన్నది సర్వత్ర హాట్ టాపిక్ గా మారింది. నల్గొండ తో పాటుజిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చిన రైస్ మిల్లర్లు అక్రమాలపై లోకల్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు తీసుకునే నిర్ణయాలు, మిల్లర్ల వ్యవహారం, అటు అక్రమాలకు సహకరించిన అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Also Read: Iran Strategy: యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో మేమే తేలుస్తాం.. ఇరాన్ వార్నింగ్ వెనుకున్న బలమేంటి?

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×