Podarillu Today Episode November 11th : శైలు అక్కడ ఉండగానే మిగిలిన వాళ్ళందరూ ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయ్యేందుకు వెళ్లిపోతారు అయితే కేశవ వెనకాలే వెళ్లిన శైలు అందులో నా పేరు రాశావా అని అడుగుతుంది. అయితే శైలు పేరు రాయలేదు అని తెలిస్తే ఖచ్చితంగా ఏడుస్తుంది నన్ను తినేస్తుంది అని అనుకుంటుంది. అయితే శైలు నేను ఏం చెప్పినా కూడా వీడు దొరికిపోయాను అని అనుకుంటాడు ఎందుకురా నువ్వు నా పేరు పెట్టలేదు అని అడుగుతుంది. అంటే నీకు నేనంటే ఇష్టం లేదా ఎందుకు నువ్వు నా పేరు రాయలేదు అని శైలు గొడవ వేసుకుంటుంది నువ్వు నా గుండెల్లో ఉన్నావ్ కదా నీ పేరు షాప్ కి పెట్టడం అవసరమా అని అనగానే శైలు కూల్ అయిపోయి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది.
ఇకపోతే రాత్రి అవ్వగానే కేశవ షాప్ ఓపెనింగ్ రోజు అందరికీ బట్టలు తీసుకురావాలని అనుకుంటాడు. ఇంట్లోని వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకొని వస్తాడు. అయితే అందరికీ బట్టలిచ్చిన కేశవ చక్రీకి మాత్రం అస్సలు ఇవ్వడు.. చక్రీనీ ఒక ఆట ఆడుకున్న తర్వాత బట్టలు ఇస్తాడు. ఇకపోతే అందరికీ తెచ్చిన కేశవ నారాయణకి కూడా బట్టలు తీసుకురావడంతో.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కన్నతండ్రి కి బట్టలు తెచ్చావు కదా నువ్వే వెళ్లి ఇస్తే ఆయన ఇంకాస్త సంతోషంగా ఫీల్ అవుతాడు అని చెప్పగానే కేశవ వెళ్లి నారాయణకు బట్టలు ఇవ్వగానే నారాయణ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. నువ్వేంటి నాకు బట్టలు తీసుకుని వచ్చావా..? అయితే అంతేకాదు షాప్ కి ఓపెనింగ్ అప్పుడు మీరు రావాల్సిందే అని నారాయణ పిలుస్తాడు దాంతో నారాయణ ఇప్పుడు నువ్వు అన్నదానికే నేను ఇంకా ఆలోచనలో ఉన్నాను ఇప్పుడు షాప్ కి కూడా పిలిచావు కదా వస్తాను పో అనేసి అంటాడు. అన్న నారాయణకు బట్టలు ఇచ్చారు అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అందరూ కలిసి నారాయణకి ఇవ్వడంలో తప్పులేదు కదా అని కన్నా నీ కన్విన్స్ చేస్తాడు.
కన్నాకి ఎంత చెప్పినా కూడా అసలు వినకుండా నారాయణను తీసుకురావడం నాకు అసలు ఇష్టం లేదు అని అంటూనే ఉంటాడు. ఇక మొత్తానికి కన్నా ఏమీ మాట్లాడకుండా మహాలక్ష్మి ఏం చెప్తే అది నమ్ముతూ ఉంటాడు. ఉదయం లేవగానే దీపావళి పండుగ కాబట్టి అందరూ చాలా సంతోషంగా రెడి అయ్యి బయటకు వస్తారు. మహాలక్ష్మి రాగానే అదొక వైబ్రేషన్ మొదలైపోతుంది అంత అందంగా మహాలక్ష్మి రెడీ అయ్యి వస్తుంది. ఇక మనిషా కూడా చీరలో రావడంతో మాధవ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు మొత్తానికి ఇంట్లోని ఆడవాళ్లు పట్టుచీరలో కళకళలాడుతూ రావడంతో అందరూ కూడా చాలా బాగుంది పండుగ అంటే ఇవాళ్లే కదా అంటూ సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఇళ్లంతా కూడా పండగ వాతావరణంతో సందడిగా ఉంటుంది.
ఇక తర్వాత చక్రి నారాయణతో అందరిని ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు. అయితే ముందుగా మాధవ్ మనిషా జంటగా నారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత చక్రి మహాలక్ష్మి తీసుకోవాలని అనుకుంటే మహాలక్ష్మి ముందు నువ్వు తీసుకువచ్చాలు అని అంటుంది. కానీ మహాలక్ష్మికి నారాయణ మాత్రం షాక్ ఇస్తాడు. ఇక కేశవ మహాలక్ష్మి చెప్పిన విషయానికి గుర్తు తెచ్చుకొని నారాయణ కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. అయితే కేశవ ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. కేశవ ఏడుస్తున్నందుకు కన్నా కూడా షాక్ లో ఉండిపోతాడు. మొత్తానికి అందరూ కూడా నారాయణ గొప్పతనాన్ని తెలుసుకొని బాధ పడిపోతూ ఉంటారు.. చక్రి ప్లాన్ మాత్రం దారుణంగా ఫెయిల్ అయిందని అర్థమవుతుంది.
నారాయణ ఆశీర్వాదం తీసుకోమంటే మాధవ దగ్గరికి వెళ్లి నాకు అన్నయ్య నాన్న అయినా అన్ని నువ్వే కాబట్టి.. మనం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే కాబట్టి నువ్వే నన్ను ఆశీర్వదించాలి అన్నయ్య అని ఎమోషనల్ అయిపోతాడు కన్నా.. ఇక చక్రి నారాయణ కాళ్ళకి దండం పెట్టమని ఎంతగా అడుగుతున్నా సరే కన్నా మాత్రం అస్సలు వినడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి కాళ్లు పట్టుకుంటాను కానీ అతని కాళ్లు మాత్రం నేను అస్సలు పట్టుకొని అని అనగానే నారాయణ కూడా షాక్ అయిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి..
Also Read :Illu Illalu Pillalu Today Episodes: నర్మదా పై ప్రేమ సీరియస్.. ఇంత మోసమా..? ఫుల్లుగా తాగొచ్చిన చందు..