E-Paper
Advertisement

ప్రపంచాన్ని ఏలుతున్న AI కింగ్.. ఒక మహిళ వల్ల జైలుకు వెళ్లబోతున్నాడా?

ప్రపంచాన్ని ఏలుతున్న AI కింగ్.. ఒక మహిళ వల్ల జైలుకు వెళ్లబోతున్నాడా?
Advertisement

Jensen Huang: ప్రపంచ AI సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న వ్యక్తి చుట్టూ ఇప్పుడు గూఢచర్య వివాదం! చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో సంబంధాలు.. భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు సీఈఓ అంగీకారం.. చివరకు సొంత కంపెనీలోనే విచారణ! అసలు జెన్సన్ హువాంగ్‌కు, ఆ మహిళకు మధ్య సంబంధం ఏంటి? అసలు ఈ వివాదం వెనుక కథేంటి? ఇందులో చైనా పాత్ర ఏంటి? అమెరికా ఎందుకు ఆందోళన చెందుతోంది? ఇప్పుడు పాయింట్ టు పాయింట్‌గా తెలుసుకుందాం.

ముందుగా ఎన్విడియా గురించి తెలుసుకోవాలి..

Advertisement

1993లో జెన్సన్ హువాంగ్ తన భాగస్వాములతో కలిసి ఎన్విడియాను స్థాపించారు. మొదట కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం చిప్స్ తయారు చేసిన ఈ కంపెనీ.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచంలోనే కీలక సంస్థగా ఎదిగింది. ChatGPT లాంటి AI టెక్నాలజీలు పనిచేయడానికి అవసరమైన శక్తివంతమైన GPU చిప్స్‌ను ఎన్విడియా తయారు చేస్తుంది. అంటే.. ప్రస్తుతం ప్రపంచం AI వైపు పరుగులు తీస్తుంటే.. ఆ ప్రయాణంలో ఎన్విడియా కీలక పాత్ర పోషిస్తోంది.

ఇప్పుడు అసలు వివాదంలోకి వెళ్దాం.

Advertisement

జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్ హువాంగ్ అనే మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆమె సింగపూర్‌కు చెందిన Megaspeed కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. అయితే అమెరికా నిఘా వర్గాలు ఆమెపై అనుమానాలు వ్యక్తం చేసాయి. ఆమె చైనా నిఘా సంస్థల కోసం పనిచేస్తూ.. జెన్సన్ హువాంగ్‌తో సంబంధాల ద్వారా కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె గూఢచారి అన్నది ఇంకా నిరూపితం కాలేదు.

దీనికి ప్రధాన కారణం AI చిప్స్.

ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య టెక్నాలజీ పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. ముఖ్యంగా అత్యాధునిక AI చిప్స్ చైనాకు చేరకుండా అమెరికా ప్రభుత్వం ఎగుమతి ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఈ చిప్స్ కేవలం ChatGPT లాంటి AI టూల్స్‌కే కాదు.. సైనిక పరిశోధనలు, నిఘా వ్యవస్థలు, అత్యాధునిక ఆయుధ సాంకేతికత అభివృద్ధికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే అమెరికా తన అత్యాధునిక చిప్ టెక్నాలజీ చైనాకు చేరకుండా కట్టడి చేయాలనుకుంటోంది.

ఈ లావాదేవీల్లో ఆలిస్ హువాంగ్ పాత్ర ఏంటి?

ఇక్కడ మరో కీలకమైన పేరు Megaspeed. ఈ కంపెనీ ఎన్విడియా నుంచి భారీ మొత్తంలో AI చిప్స్ కొనుగోలు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆ చిప్స్ చివరకు ఎక్కడికి వెళ్లాయి? అమెరికా విధించిన ఎగుమతి ఆంక్షలను తప్పించుకుని చైనాకు చేరాయా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ లావాదేవీల్లో ఆలిస్ హువాంగ్ పాత్ర ఏంటి? ఆమెకు జెన్సన్ హువాంగ్‌తో ఉన్న సంబంధాలు ఈ వ్యవహారంలో ఏమైనా ప్రభావం చూపించాయా? అనే కోణాలు కూడా పరిశీలనలోకి వచ్చాయి.అయితే చిప్స్ అక్రమంగా చైనాకు చేరినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.

జెన్సన్ హువాంగ్ ఏమన్నారు అంటే ?

ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత జెన్సన్ హువాంగ్ తన ఉద్యోగులకు సందేశం పంపారు..తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు అంగీకరిస్తూ.. తన చర్యల వల్ల భార్య, పిల్లలు బాధపడ్డారని క్షమాపణలు చెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత జీవితంలో జరిగిన తప్పును అంగీకరించడం వేరు.. గూఢచర్య ఆరోపణలు నిజమని నిరూపించడం వేరు.

ఎన్విడియా బోర్డు ఆదేశాలు..

ఈ వివాదం కంపెనీ ప్రతిష్ఠతో పాటు టెక్నాలజీ భద్రతకు సంబంధించినది కావడంతో ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. బయటి న్యాయ నిపుణుల పర్యవేక్షణలో ఈ విచారణ జరగనుంది. కంపెనీ రహస్యాలు లేదా అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లీక్ అయినట్లు ప్రస్తుతం ఆధారాలు లేవని బోర్డు తెలిపింది. విచారణ పూర్తయ్యేంతవరకు జెన్సన్ హువాంగ్ సీఈఓగా కొనసాగనున్నారు.

న్విడియా చిప్స్ చైనాకు చేరుకోవాలంటే ఏం చేయాలి..

ఈ వ్యవహారం ఇప్పుడు ఒక కంపెనీ అంతర్గత సమస్యగానే మిగల్లేదు.అమెరికా కాంగ్రెస్‌లోని కొందరు కీలక ప్రతినిధులు కూడా ఈ అంశంపై వివరణ కోరారు. న్విడియా చిప్స్ చైనాకు చేరకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కంపెనీ టెక్నాలజీ భద్రతకు ఎలాంటి రక్షణ కల్పిస్తోంది? అనే అంశాలపై జెన్సన్ హువాంగ్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. అంటే.. ఇప్పుడు ఈ వ్యవహారం కార్పొరేట్ స్థాయి నుంచి అమెరికా జాతీయ భద్రత చర్చ వరకు చేరింది.

అమెరికా, చైనా మధ్య టెక్నాలజీ యుద్ధం..

ఒకవైపు ప్రపంచ AI రంగాన్ని శాసిస్తున్న ఎన్విడియా.. మరోవైపు అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న టెక్నాలజీ యుద్ధం.. ఈ రెండింటి మధ్య జెన్సన్ హువాంగ్ వివాదం ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ఇక్కడ అసలు తేలాల్సింది ఒక్కటే.. ఇది కేవలం ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదమా? లేక ప్రపంచ టెక్నాలజీ భద్రతకు సంబంధించిన పెద్ద వ్యవహారమా? విచారణలో బయటపడే నిజాలే దీనికి సమాధానం చెప్పాలి.

Also Read: సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-కారు ఢీకొని తండ్రి, కూతురు మృతి!

Tags

Related News

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అమెరికా చరిత్రలో భారీ వెనుకడుగు, తిరిగి పుంజుకుంటాం

జపాన్‌‌ను వణికించిన భారీ భూకంపం.. భారీగా షాపులు డ్యామేజ్, బుల్లెట్ రైల్లు నిలిపివేత

2028లో అమెరికాను ఏలేది ఎవరు? ట్రంప్ స్థానంలో ఈ ముగ్గురిలో ఒకరా?

ఇరాన్ ముందస్తు వ్యూహం.. యుద్ధానికీ అయోడిన్ టాబ్లెట్లకీ సంబంధమేంటి?

అమెరికా బంపరాఫర్.. ఇరాన్ అణు రహస్యాలు చెప్తే రూ.165 కోట్లు.. గిఫ్ట్‌గా యూఏస్ పౌరసత్వం!

వైట్‌హౌస్‌లో ఊహించని పరిణామం.. సుసీ వైల్స్ అవుట్.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్!

ట్రావెలర్లకు బిగ్ అలర్ట్.. కువైట్ ఎయిర్‌పోర్టులో ఫోటోలు, వీడియోల చిత్రీకరణపై నిషేధం

Big Stories

Advertisement
×