Trump: నిత్యం వార్తల్లో ఉండేందుకు అధిక ప్రయార్టీ ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. సమయం, సందర్భం కాకున్నా ఏదో విధంగా మాట్లాడడం, మార్కెట్లు పతనానికి కారణమయ్యేవారు. మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు తత్వం బోధపడింది. అమెరికా చరిత్రలో ఇదొక భారీ వెనుకడుగు అంటూనే, మళ్లీ తిరిగి పుంజుకుంటామన్నారు.
అమెరికా ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్లకు ప్రతికూల ఫలితాలు రావడంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఫలితాలతో అమెరికా చరిత్రలో భారీ వెనుకడుగు వేసిందన్నారు. తన హయాంలో దూసుకుపోయిన అక్కడి స్టాక్ మార్కెట్, తాజా ఫలితాల కారణంగా ఒక్క రోజులోనే 3 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూసిందన్నారు. ఈ విషయంలో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని తేల్చేశారు. తాము తిరిగి పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
గతంలో కన్నా మరింత బలంగా తయారు అవుతామని ట్రూత్ సోషల్ వేదికగా రాసుకొచ్చారు. గత మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రాట్లు కాంగ్రెస్ ఉభయ సభలను మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. దశాబ్దాలుగా అధికార రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యం చెలాయించిన రాష్ట్రాల్లో ఊహించని విధంగా పరాజయం పాలైంది. రిపబ్లికన్ చట్టసభ సభ్యులు ఎదురుదెబ్బ నుండి తేరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్షుడు ట్రంప్.
కఠిన వైఖరి గల సలహాదారు స్టీఫెన్ మిల్లర్‌ను తన కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు. ట్రంప్ కఠిన వలస విధాన రూపకర్త మిల్లర్‌కు వ్యతిరేకంగా, ట్రంప్ పరిపాలనను జవాబుదారీగా ఉంచుతామని డెమొక్రాట్లు ప్రతిజ్ఞ చేశారు. ప్రతినిధుల సభపై నియంత్రణతో డెమోక్రాట్లు కాంగ్రెస్ కమిటీలపై అధికారాన్ని పొందుతారు. పరిపాలనా అధికారులను పిలిపించడానికి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది. ఇరాన్ యుద్ధం, వలసల అమలు, ఖర్చులు, అవినీతి ఆరోపణల విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిని నిశితంగా పరిశీలించడానికి ఆ పార్టీ తన కొత్త స్థానాన్ని ఉపయోగించుకుంటుందని భావిస్తున్నారు.
ALSO READ: జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. భారీగా షాపులు డ్యామేజ్, బుల్లెట్ రైల్లు నిలిపివేత
ట్రంప్ కార్యనిర్వాహక అధికారాలు యథాతథంగా ఉంటాయి. ఆయన తన అధికార పరిధిలో విధానాలను అమలు చేయడాన్ని కొనసాగించవచ్చు, కాంగ్రెస్ ఆమోదించిన చట్టాలకు వ్యతిరేకంగా తన వీటో అధికారాలను ఉపయోగించవచ్చు. అధ్యక్షుడు చేసిన వీటోను అధిగమించడానికి డెమోక్రాట్లకు ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం.