BigTV English
Advertisement

Iran War Khamenei: ‘చేతకాని వాళ్లం కాదు.. యుద్ధానికి సిద్ధం కండి’.. సైన్యానికి ఇరాన్ అధ్యక్షుడి ఆదేశం

Iran War Khamenei: ‘చేతకాని వాళ్లం కాదు.. యుద్ధానికి సిద్ధం కండి’.. సైన్యానికి ఇరాన్ అధ్యక్షుడి ఆదేశం

Iran War Khamenei| ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడానికి తాము ఏమీ చేతకాని వాళ్లం కాదని.. శత్రువుకు ఊహకందని గట్టిగా దెబ్బకొడతామని ఇరాన్ అధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమెనీ చెప్పారు. ఇజ్రాయెల్ పై యుద్ధానికి సిద్ధం కావాలని గురువారం రాత్రి సైన్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు. కొన్ని రోజుల క్రితం ఇరాన్ రాజధాని పరిసరాల్లోని మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో ఇరాన్ తిరిగి దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అధ్యక్షుడు ఖమేనీ ఇరాన్ మిలిటరీని ఆదేశించారు.


అయితే ఇరాన్ ఎప్పుడు దాడి చేయబోతోందో ఖమేనీ స్పష్టం చేయలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ముదురుతున్న శత్రుత్వం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మిడిల్ ఈస్ట్ లోని అన్ని దేశాలు ఇజ్రాయెల్ చర్యలను ఐక్యరాజ్యసమితిలో ఇప్పటికే ఖండించాయి. అయితే నెల రోజుల క్రితం ఇజ్రాయెల్ పై ఇరాన్ దాదాపు 200 మిసైల్స్ తో దాడి చేసింది. హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాను హత్య చేసినందుకే ఈ దాడులు చేశామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ దీనికి సమాధానం కొన్ని రోజుల క్రితం ఇరాన్ రాజధాని టెహ్రాన్ పరిసరాల్లో మిలిటరీ స్థావరాలు, ఇరాన్ మిసైల్ తయారీ కేంద్రాలపై దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు ఇరాన్ సైనికులు చనిపోయినట్లు అధికారిక సమాచారం.

అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇరాన్ సైన్యం యుద్ధానికి సమాయత్తమవుతోంది. అయితే అమెరికా ఎన్నికల సమయంలోనే ఇరాన్ దాడి చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరుగనుండగా.. ఇరాన్ ఈలోపే దాడి చేస్తుందని నిపుణుల అంచనా.


ఇజ్రాయెల్ లో కీలక ప్రదేశాలే ఇరాన్ టార్గెట్
వారం రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడి వల్ల జరిగిన నష్టం గురించి ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ అధికారులతో సమావేశం చేశారు. అధికారులు జరిగింది చిన్న నష్టమే అని చెప్పినా.. ఖమేనీ మాత్రం తిరిగి దాడి చేయాల్సిందే.. లేకపోతే చేతకాని వాళ్లంలాగా ప్రపంచం తమను చూస్తుందని అన్నారు. తాము బలహీనులం కాదని ప్రపంచానికి తెలిపేందుకు దాడి చేయాల్సిందేనని అందుకోసం యుద్ధానికి సిద్దం కావాలని ఆయన చెప్పారు.

టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తా కథనం ప్రకారం.. ఇజ్రాయెల్ లోని కీలక ప్రదేశాల్లో మాత్రమే ఇరాన్ టార్గెట్ చేస్తుంది. అయితే ఈ దాడి ఇరాన్ భూభాగం నుంచి జరగదు. పొరుగు దేశమైన ఇరాక్ లో ఇరాన్ ప్రైవేట్ సైన్యం ఈ దాడులు చేస్తుంది. దీనివల్ల ఇజ్రాయెల్ తిరిగి దాడి చేసినా.. అది ఇరాన్ భూభాగం వరకు విస్తరించదు.

మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించాం..
గురువారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ.. నేను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఇజ్రాయెల్ సైన్యం) ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశమే ఇరాన్‌ని నియంత్రణలో ఉంచడం. మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పై దాడి చేసి దాని రెక్కలు తెగనరికాము. భవిష్యత్తులో కూడా ఇరాన్ చేతికి అణు ఆయుధాలు దక్కకుండా అడ్డుకొని తీరుతామని అందుకోసం అవసరమైతే సైనిక చర్యలు చేపడతామని చెప్పారు. ఇజ్రాయెల్ కళ్లు అనుక్షణం ఇరాన్ చర్యలపైనే కేంద్రీకృతమై ఉంటాయని వ్యాఖ్యానించారు.

Related News

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

Big Stories

×