E-Paper
Advertisement

ఇరాన్-అమెరికా మధ్య మరోసారి చర్చలు.. ఇస్లామాబాద్ వేదికగా, కొనసాగుతున్న ఉత్కంఠ, ప్రకటన చేయని ఇరాన్

ఇరాన్-అమెరికా మధ్య మరోసారి చర్చలు.. ఇస్లామాబాద్ వేదికగా, కొనసాగుతున్న ఉత్కంఠ, ప్రకటన చేయని ఇరాన్
Advertisement

Iran vs America: ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చల్లో పురోగతి కనిపిస్తుందా? తొలి విడత మాదిరిగా ఇరుదేశాలు వెనక్కి తగ్గుతాయా? తమ దేశ ప్రతినిధులు సోమవారమే పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. కాకపోతే హోర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితి కాసింత ఉత్కంఠగా మారినట్టు తెలుస్తోంది.

ఇరాన్-అమెరికా మధ్య మరోసారి చర్చలు

Advertisement

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ వేదికగా మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగున్నాయి. ఈ విషయమై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తమ ప్రతినిధులు సోమవారం పాకిస్తాన్‌కు చేరుకుంటారని తేల్చిచెప్పేశారు. ఒప్పందాన్ని అంగీకరించాలని ఇప్పటికే ఇరాన్‌కు సూచించినట్టు ఆయన చెప్పారు.

అంతేకాదు ఈసారి కాసింత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఒప్పందానికి ముందుకు రాకుంటే ఆ దేశ విద్యుత్కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామని మరోసారి హెచ్చరించారు. ఈసారి చర్చలపై ఇరాన్‌ నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో చర్చలు ఉన్నట్టా? లేనట్టా? అంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Advertisement

ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు..  ఎలాంటి ప్రకటన చేయని ఇరాన్

దౌత్య రంగంలో వెనక్కి తగ్గడం ఉండదని ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఘాలిబఫ్‌ ఇటీవలో ఓ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. ఈ లెక్కన సంప్రదింపులకు టెహ్రాన్‌ సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి. అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఇరాన్ రెవిల్యూషనరీ గార్డ్ కార్ప్స్ రెండోసారి చర్చలను వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు లేకపోలేదు.

అమెరికాతో చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ అధికారిక మీడియా ఓ ప్రకటన చేసింది. చర్చలకు అంగీకరించిందన్న వార్తలను తోసిపుచ్చింది. రెండోవిడత చర్చలపై వస్తున్న వార్తలు అవాస్తమని ఐఆర్ఎన్ఏ తెలిపింది. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ బృందాలు కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించింది అమెరికా. కాల్పుల ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపించింది.

ALSO READ: అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది చిన్నారుల మృతి..

ఇస్లామాబాద్‌లో రెండో దఫా చర్చల కోసం పాకిస్తాన్ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆ నగరంలో అదనపు బలగాలను మోహరించింది. అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఈనెల 22 బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మలి విడత చర్చలపై యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×