E-Paper
Advertisement

Iran War: ఇరాన్ టార్గెట్ ఫిక్స్.. చమురు క్షేత్రాల తర్వాత, నెక్ట్స్ ఇంటర్నెట్ కేబుల్స్? అప్పుడే ఆందోళనలు షురూ!

Iran War: ఇరాన్ టార్గెట్ ఫిక్స్.. చమురు క్షేత్రాల తర్వాత, నెక్ట్స్ ఇంటర్నెట్ కేబుల్స్? అప్పుడే ఆందోళనలు షురూ!
Advertisement

Iran War: ఇరాన్ యుద్దం కొత్త మలుపు తిరుగుతుందా? పొరుగు దేశాల చమురు క్షేత్రాలపై దాడులు తీవ్రతరం చేసిన ఇరాన్, నెక్ట్స్ టార్గెట్ ఏంటి? ఇంటర్నెట్‌పై గురి పెట్టనుందా? ఎందుకు టెక్ కంపెనీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి? అదే జరిగితే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇరాన్ టార్గెట్ ఫిక్స్.. అప్పుడే భయాందోళనలు

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం నాలుగో వారానికి చేరింది. ముగింపు కనబడుతున్న తరుణంలో కొత్త ఆందోళన మొదలైంది. ఇరాన్ ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ప్రపంచానికి ఇంధన సరఫరాను అమాంతంగా నిలిపి వేసింది. కీలకమైన సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లు హోర్ముజ్ గుండా వెళ్తాయి.

చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకుని యుద్ధం మూడో దశలోకి ప్రవేశిస్తున్న తరుణంలో టెహ్రాన్ ఇంటర్నెట్‌ను నిలిపి వేస్తుందా? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించినప్పటికీ ఎర్ర సముద్రంలో బాబ్ ఎల్-మండేబ్‌పై కూడా ఇరాన్ మద్దతుదారులు హౌతీలు దాడి చేయవచ్చనే భయాలు అప్పుడే మొదలయ్యాయి.

Advertisement

రెండు ప్రాంతాల్లో సముద్రం అడుగున వేల కిలోమీటర్ల మేరా ఇంటర్నెట్ కేబుల్స్ విస్తరించి ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలో ఇంటర్నెట్‌కు అత్యంత కీలకం కూడా.ఈ మెయిల్స్‌, బ్యాంకింగ్ లావాదేవీలు, ఏఐ సర్వీసులకు సంబంధించిన డేటాను ఆయా కేబుళ్ల ద్వారా వెళ్తాయి. రెడ్ సీ అడుగున దాదాపు 17 కేబుళ్లు ఉన్నాయి.

చమురు క్షేత్రాల తర్వాత, నెక్ట్స్ ఇంటర్నెట్ కేబుల్స్?

యూరప్, ఆసియా, ఆఫ్రికాలో ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌లో కీలక పాత్ర పోషించనుంది. ఇరాన్ అనుబంధ గ్రూప్ హూతీ మద్దతుగా అప్పుడప్పుడు ఎర్రసముద్రంలోని నౌకలపై దాడులు చేస్తుంటాయి. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా రెండేళ్ల కిందట ఎర్రసముద్రంలో పలు ఇంటర్నెట్ కేబుళ్లపై దాడులు చేసింది. ఆ సమయంలో ఆసియా, ఆఫ్రికాలో ఇంటర్నెట్‌ వేగం దాదాపు తగ్గింది. వాటిని సరి చేయడానికి నెలల సమయం పట్టింది.

హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్ సముద్రపు మైన్స్ అమర్చింది. అవి పేలితే ఇంటర్నెట్‌కు ప్రమాదంగా మారవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సముద్రంలో 300కు పైగా ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లు ఉన్నాయి. ఫోన్ ‌కాల్స్‌ మొదలు రోజువారీ జరుగుతున్న బిలియన్‌ డాలర్ల వ్యాపార లావాదేవీలు వీటి నుంచే సాగుతుంటాయి. కమ్యూనికేషన్ల వ్యవస్థలో దాదాపు 90 శాతానికి ఇదే కీలకం.

ALSO READ: అమెరికాలో ఇరాన్ డ్రోన్ల కలకలం.. రక్షణ.. విదేశాంగ మంత్రులే టార్గెట్?

రెండు కీలక మార్గాలను ఏకకాలంలో మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా విఘాతకరమైన సంఘటన అవుతుంది. న్యూయార్క్ టైమ్స్ చెబుతున్న వివరాల ప్రకారం.. హోర్ముజ్ జలసంధిలో ఇరుకైన ప్రదేశంలో నీటి లోతు కేవలం 200 అడుగులు ఉంటుంది. అక్కడ కేబుల్స్ నీటిలో ఉంటాయి.

ఆ ప్రాంతంలో ఇరాన్ నౌకలు మునిగిపోయినప్పటికీ, ఆ దేశానికి చెందిన జలాంతర్గాములు, రహస్య నౌకాదళం ఇప్పటికీ ఆ ప్రాంతంలో పని చేస్తున్నాయని రాసుకొచ్చింది. ఇరాన్ ఆ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటుందో లేదో ఎవరికీ తెలియకపోయినా,ఆ అవకాశం ఉందని పేర్కొంది. ఆ నష్టం కేవలం ఫోన్‌లు, వెబ్‌సైట్‌లకే పరిమితం కాదు. బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, ఆసుపత్రులు, ఏఐ వ్యవస్థలు అన్నీ దానిపై ఆధారపడి ఉన్నాయి.

గల్ఫ్ దేశాలు మొదట నష్టపోతాయని, ఆ తర్వాత భారత్ మొదలు ఆసియా దేశాలు మందగమనాన్ని ఎదుర్కోవచ్చని ప్రస్తావించింది. ప్రస్తుతానికి కేబుళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా పని చేస్తున్నాయి. అయినప్పటికీ నీటిలో మందుపాతరలు ఉండటం, దాడులు తీవ్రతరం కావడంతో ఇంటర్నెట్‌కు ప్రమాదం పొంచివుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×