E-Paper
Advertisement

Donald Trump: చేతులెత్తేసిన ట్రంప్.. చమురు ధరలు పెరిగితే ఆర్థిక వ్యవస్థకు లాభమేనని వ్యాఖ్య

Donald Trump: చేతులెత్తేసిన ట్రంప్.. చమురు ధరలు పెరిగితే ఆర్థిక వ్యవస్థకు లాభమేనని వ్యాఖ్య
Advertisement

Donald Trump: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో అసలు ఏం జరుగుతోంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారా? ఆయిల్ ధరలు పెరగడంపై ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఏం జరుగుతోంది? కేవలం స్వలాభం కోసం అమెరికా యుద్ధానికి దిగిందా? అవుననే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.

ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా యూటర్న్

Advertisement

ఇరాన్‌ వార్నింగ్‌తో హార్ముజ్ జలసంధి నౌకా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా షిప్పింగ్‌ రవాణాకు అంతరాయం కలిగింది. ఫలితంగా మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మార్కెట్లో 100 డాలర్లు కంటే ఎక్కువగా ధర పెరగడం వల్ల అమెరికాకు ప్రయోజనం చేకూరుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా అమెరికా ఎదిగింది. ధరలు పెరగడం వల్ల మనకు ఎక్కువ డబ్బు వస్తుందన్నారు. అదే సమయంలో ఇరాన్‌ను అణ్వస్త్ర శక్తిగా మారకుండా నిరోధించడం అన్నింటి కంటే ముఖ్యమన్నారు. ప్రపంచాన్ని అణు ముప్పు నుంచి కాపాడటం తన తొలి కర్తవ్యంగా చెప్పుకొచ్చారు. కొన్ని వారాల కిందట ట్రంప్ తన ప్రసంగంలో తక్కువ పెట్రోల్ ధరలను హైలైట్ చేశారు.

Advertisement

చమురు ధరలు పెరిగితే ఆర్థిక వ్యవస్థకు లాభమేనన్న ట్రంప్

గాలన్‌కు 2.30 డాలర్లుగా ఉందని పేర్కొన్నారు. ఆనాటి నుండి నేటి వరకు మార్కెట్లో ధరలు దాదాపు 50 శాతం పైగానే పెరిగాయి. పెరుగుతున్న ఇంధన ధరలపై ఆయన మళ్ళీ మనసు మార్చుకున్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఓ వైపు ధరలు, మరోవైపు చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోవడం నేపథ్యంలో కష్టమని భావించి తరుణంలో ఆయన స్వరంలో ఈ మార్పు వచ్చిందని అంటున్నారు.

జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది చివరి త్రైమాసికానికి బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు సగటున 71 డాలర్లు ఉంటుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ విశ్లేషకులు అంచనా. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్-WTI అయితే అదే కాలంలో బ్యారెల్‌కు సగటున 67 డాలర్లు ఉండవచ్చని లెక్కలు వేస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 100.36 డాలర్లు వద్ద ట్రేడింగ్ అవుతోంది.

ALSO READ: హర్మూజ్ జలసంధి మూసే ఉండాలి.. ప్రతి ప్రాణానికి ప్రతీకారం.. ఇరాన్ కొత్త సుప్రీం వార్నింగ్

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×