Ahmad Vahidi: ఇరాన్ సుప్రీం ఖమేని మృతితో ఆ దేశం యుద్ధం కొనసాగిస్తుందా? శాంతి చర్చలకు సిద్ధమవుతుందా? ఈ సమయంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ నియామకం వెనుక అసలు ఏం జరుగుతోంది? శాంతి చర్చల కోసమా? యుద్ధానికి కంటిన్యూ చేయడానికి ఆదేశం సిద్ధమయ్యిందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత రూటు మార్చింది ఇరాన్. ఆదేశ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్-IRGC కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ నియమించింది. ఇరాన్ రక్షణ వ్యవస్థలో కీలకం, డేంజరస్ వ్యక్తి వాహిదీ. గతంలో ఇరాన్ రక్షణ మంత్రిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. విదేశాల్లో ఆపరేషన్లకు ఈయనే వ్యవస్థాపక కమాండర్.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కొత్త చీఫ్ అహ్మద్ వాహిదీ
ముఖ్యంగా గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో ఆయనకు తిరుగు ఉండదని చెబుతుంటారు. దీనికితోడు క్షిపణి ప్రయోగాల్లో కూడా తిరుగులేదని ఆదేశ నాయకులు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతుంటారు. ఖమేనీ మృతి తర్వాత చెల్లాచెదురైన సైన్యాన్ని ఏకం చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా-ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవచ్చంటూ లెక్కలు వేస్తున్నారు. కొత్త కమాండర్ నియామకం జరిగిన వెంటనే భారీ హెచ్చరికను జారీ చేసింది ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో ఆపరేషన్ చేపడుతున్నట్లు పేర్కొంది. మధ్య ప్రాచ్యంలోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు మా తదుపరి లక్ష్యమని ప్రకటన చేసింది.
యుద్ధ వ్యూహం.. క్షిపణుల ప్రయోగంలో ఆయన వాహిదీ దిట్ట
అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం.. ఇరాన్ రాజకీయ వ్యక్తులు, సైన్యం లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇరాన్‌లో ప్రస్తుతం తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను రక్షించడం, విదేశాలలో ఇరాన్ ప్రభావాన్ని అంచనా వేయడం వంటి బాధ్యతలను కలిగి ఉన్న IRGC ఇప్పుడు కీలక పాత్ర పోషించనుంది.
తాజాగా అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం దుబాయ్‌లోని అమెరికా నిఘా సంస్థ CIA కి చెందిన కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా తెలియరాలేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పుడు గల్ఫ్ దేశాలకు పాకినట్టు సంకేతాలు ఉన్నాయి.
ఇలాంటి సమయంలో వాహిదీని నియమించడమంటే శాంతి చర్చల కంటే యుద్ధం వైపు ఇరాన్ మొగ్గు చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులపై దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ALSO READ: ఇరాన్ సుప్రీం ఖమేలి మృతిపై ప్రకటన.. రోడ్లపై ఇరానియన్ల సంబరాలు
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్-IRGC అనేది ఇస్లామిక్ పాలనలో అంతర్గత, బయట నుంచి పొంచివున్న ముప్పుల నుండి రక్షించడానికి బాధ్యత వహించే ఆదేశం ఉన్నత సైనిక దళం. 1,25,000 మంది సిబ్బందితో కూడిన IRGCలో దాదాపు 90 వేల మంది క్రియాశీల సభ్యులను కలిగి ఉంది. విదేశీ ప్రత్యేక కార్యకలాపాలకు కుడ్స్ దళాన్ని నడుపుతుంది కూడా.
1979 ఇస్లామిక్ విప్లవం ముగింపుతో ఇరాన్‌లో ఉన్నత సాయుధ మిలీషియా గ్రూప్‌గా IRGC స్థాపించారు ఖమేని. షియా మతాధికారుల పాలనను రక్షించడం దీని ఉద్దేశం. ఆ తర్వాత ఇరాన్ సంప్రదాయ సైన్యానికి ముఖ్యమైన గ్రూప్‌గా మారింది. IRGC మొదట్లో దేశీయ గ్రూప్‌గా పని చేసేది. 1980లో ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ దాడి చేసింది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ రంగాలకు విస్తరించింది.
IRGC గురించి ఆ దేశ రాజ్యాంగంలో పొందుపరచబడింది. ఇరాన్ సుప్రీం ఖమేనీ మాత్రమే IRGC గ్రూప్‌కు అధినేత. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆ దేశానికి నిజమైన పాలకులుగా చెబుతుంటారు. 1989లో రివల్యూషనరీ గార్డ్ విదేశీ కార్యకలాపాలకు బాధ్యత వహించే కుడ్స్ విభాగాన్ని ఖమేని సృష్టించాడు. కొన్నిసార్లు ఇంపీరియల్ గార్డ్స్ పిలువబడే వీరి సంఖ్య దాదాపు 10 వేల వరకు ఉంటుందని ఓ అంచనా.