E-Paper
Advertisement

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!
Advertisement

Rat in Noodles: హాంగ్ కాంగ్‌లోని క్వాయ్ చుంగ్ లో పనిచేసే ఓ మహిళకు ఛేదు అనుభవం ఎదురైంది. ఆఫీస్ దగ్గర్లోని ‘వా జెర్ రెస్టారెంట్’ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఆమెకు నూడుల్స్ లో చిన్న ఎలుక కదులుతూ కనిపించి ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సాస్‌లో కదులుతున్న ఎలుక

వైరల్ వీడియోను గమనిస్తే.. టిఫిన్ బాక్స్ తెరవగానే పసికందు లాంటి చిన్న రోడెంట్ (ఎలుక పిల్ల) కదులుతూ మహిళకు కనిపించింది. ఇంకా కళ్ళు కూడా తెరివని ఆ గులాబీ రంగు ఎలుక పిల్ల.. గాలి ఆడక సాస్‌లోనే కాళ్లు ఊపుతూ ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘోరాన్ని చూసి షాక్ తిన్న ఆ మహిళ వెంటనే దాన్ని రికార్డ్ చేసింది. 18 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియా యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార భద్రతపై ప్రశ్నలు గుప్పిస్తూ రెస్టారెంట్ యాజమాన్యాన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

రంగంలోకి ఫుడ్ సేఫ్టీ అధికారులు

ఈ దారుణ ఘటనపై బాధితురాలు వెంటనే హాంగ్ కాంగ్ ఫుడ్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ హైజీన్ డిపార్ట్‌మెంట్ (FEHD)కి ఫిర్యాదు చేసింది. అలర్ట్ అయిన హెల్త్ ఇన్స్పెక్టర్లు తక్షణమే ఆ రెస్టారెంట్‌పై దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో రెస్టారెంట్ కిచెన్ లోని అపరిశుభ్ర వాతావరణాన్ని అధికారులు గుర్తించారు. అక్కడ ఉన్న ఆహార శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించడంతో పాటు, పరిశుభ్రత నియమాలను ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ యజమానిపై కేసులు నమోదు చేశారు. వెంటనే హోటల్‌ను శుభ్రం చేయాలని ఆదేశించారు.

Advertisement

Also Read: జియో రూ.500 vs రూ.550 ప్లాన్స్.. ఉచిత ఓటీటీలు, అపరిమిత 5G.. యూజర్లకు పండగే!

దర్యాప్తు అధికారి ఏమన్నారంటే?

అయితే నూడిల్స్ బాక్స్ లోపలికి ఆ ఎలుక పిల్ల ఎలా వచ్చిందనే దానిపై ఫుడ్ సేఫ్టీ ప్రతినిధి స్పందించారు. ‘ఫుడ్ ప్రిపరేషన్, ప్యాకేజింగ్, స్టోరేజ్, డెలివరీ సహా అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నాం. ఎలుక ఎలా వచ్చిందన్న దానిపై ఇప్పుడే ఒక స్పష్టతకు రాలేం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఈ ఘటనపై హాంగ్ కాంగ్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రెస్టారెంట్ యాజమాన్యం కూడా విచారణకు సహకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులతో పిడుగులు!

Tags

Related News

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

Big Stories

Advertisement
×