BigTV English
Advertisement

Pushpa – Trump: ‘పుష్ప’ తరహాలో ఆ దేశానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్.. ఇలా తయారయ్యావేంటి మామ!

Pushpa – Trump: ‘పుష్ప’ తరహాలో ఆ దేశానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్.. ఇలా తయారయ్యావేంటి మామ!

పుష్ప సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్ర అల్లుఅర్జున్ ది. మోసాన్ని మోసంతోనే జయిస్తాడు. పుష్ప సినిమాలో మంగళం శ్రీను బావమరిదిని చంపే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. తన బావమరిదిని ప్లాణాలతో వదిలేయాలంటూ మంగళం శ్రీను పుష్పకి ఫోన్ చేస్తాడు. అరెరె 5 నిమిషాలు ముందు ఫోన్ చేసి ఉంటే బాగుండేదే అని చెప్పి మరీ గన్ తో షూట్ చేస్తాడు పుష్ప. సరిగ్గా ఇలాంటి డబుల్ గేమ్ ఆడాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఖతార్ పై ఇజ్రాయెల్ దాడి గురించి ట్రంప్ కి ముందే సమాచారం ఉంది. కానీ దాడి మొదలైన 10 నిమిషాలకు ఖతార్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. హమాస్ కీలక నేత ఖలీల్‌ అల్‌-హయ్యా కుమారుడితో సహా ఆరుగురు ఈదాడిలో ప్రాణాలు వదిలారు. అంటే అక్కడ సినిమాలో పుష్ప చేసినట్టే ఇక్కడ ట్రంప్ కూడా చేశారనమాట. కాల్పుల విరమణకు సంబంధించి చివరి హెచ్చరికగా అమెరికా ప్రతిపాదన మేరకు దోహాలో చర్చలు జరుగుతుండగా ఇజ్రాయెల్‌ దాడి చేయడం విశేషం. అయితే దాడి గురించి ముందుగా తెలిసినా ఉద్దేశపూర్వకంగానే ట్రంప్ ఎందుకు ఆలస్యం చేశారనేది ఇప్పుడు సంచలనంగా మారింది.


స్నేహమంటే ఇదేరా!
పోనీ ఖతార్ అంటే ట్రంప్ కి కోపం ఉందా అంటే అదీ కాదు. ఖతార్ తో అమెరికాకి, ముఖ్యంగా తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మంచి స్నేహం ఉంది. ఆమధ్య ఖతార్ పర్యటన సందర్భంగా 400 మిలియన్ డాలర్ల విలువైన ‘ఫ్లయింగ్ ప్యాలెస్’ గా పిలువబడే లగ్జరీ బోయింగ్ 747-8 జెట్‌ విమానాన్ని ఆ దేశం ట్రంప్ కి బహుమతిగా ఇచ్చింది. ట్రంప్, ఖతార్ నుండి 243.5 బిలియన్ డాలర్ల ఆర్థిక ఒప్పందాలను కూడా పొందారు. ట్రంప్ కుమారుడు ఎరిక్, ఖతార్‌లో ట్రంప్ బ్రాండ్ గోల్ఫ్ కోర్సు కోసం ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాడు. ఇక దేశాల మధ్య స్నేహం విషయానికొస్తే ఖతార్ లో అతిపెద్ద US సైనిక స్థావరం అల్ ఉదీద్ ఎయిర్ బేస్ కూడా ఉంది. ఇంత నమ్మకమైన మిత్రుడికి చేయరాని ద్రోహం చేశారు ట్రంప్.

భారత్ తో కూడా అంతే!
భారత్ తనకు మిత్ర దేశం అని పదే పదే చెబుతుంటారు ట్రంప్. మోదీ లాంటి శక్తిమంతమైన నేత లేరని పొగడ్తల్లో ముంచెత్తుతారు. అదే సమయంలో భారత్ పై ట్రంప్ ప్రతీకార సుంకాల దాడి చేశారు. 25 శాతం నుంచి ఏకంగా 50శాతానికి సుంకాలు పెంచి మన ఎగుమతుల నడ్డి విరిచారు. నమ్మక ద్రోహం అంటే ఇదే అనుకుంటున్న తరుణంలో ఖతార్ కి అంతకు మించిన ద్రోహం తలపెట్టారు ట్రంప్. దాడుల విషయం తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నారు. మొహమాటానికి దాడులతో నష్టం జరిగిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఖతార్ కి చిర్రెత్తుకొచ్చింది.


నోబెల్ కావాలా నాయనా?
15 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఖతార్ పై విరుచుకుపడ్డాయి. హమాస్ కీలక నేతల్ని అంతం చేయాలనేది వారి ప్లాన్. కానీ ఇజ్రాయెల్ దాడి నుండి తమ అగ్ర నాయకులు బయటపడ్డారని, ఐదుగురు దిగువ స్థాయి సభ్యులు మరణించారని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ఖతర్ భద్రతా సిబ్బంది కూడా మరణించారు. అయితే ఈ దాడి పూర్తిగా ఇజ్రాయెల్ చర్య మాత్రమేనని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ప్రకటించడం విశేషం. ఆయన ట్రంప్ ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఖతర్ సహా.. ఇతర అరబ్ దేశాలు అమెరికా చర్యలతో ఆందోళనలో పడ్డాయి. ట్రంప్ ఇంత నమ్మక ద్రోహం చేస్తారా అని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తమ్మీద ట్రంప్ ఎలాంటి వారో, నోబెల్ బహుమతి తీసుకోడానికి అతను ఏ పాటి అర్హుడో ఈ చర్య ద్వారా మరోసారి స్పష్టమైందని అంటున్నారు.

Related News

Explosion in America: అమెరికాలో భారీ పేలుడు..16 మంది దుర్మరణం

Diwali Celebrations Canada: కెనడాలో దీపావళి వేడుకలు.. 2 ఇళ్లను తగలబెట్టేసిన భారతీయులు!

Mahnoor Omer: పీరియడ్ ట్యాక్స్‌పై.. పాక్ ప్రభుత్వానికి రోడ్డుకీడ్చిన యువతి, ఈమె ధైర్యానికి సలాం!

Happiest Countries 2025: ఈ ఏడాది హ్యాపీయెస్ట్ కంట్రీస్ లిస్ట్ వచ్చేసింది, ఆ దేశానికి మళ్లీ ఫస్ట్ ర్యాంక్!

KG Tomatoes Rs 600: కిలో టమాటాలు రూ.600.. అల్లం రూ.750.. ఉల్లి రూ.120, ఎక్కడో తెలుసా?

Dubai Gold Dress: ప్రపంచంలోనే అత్యంత బరువైన గోల్డ్ డ్రెస్.. దీని ఖరీదు ఎంతంటే..

Trump Zelensky: వైట్ హౌస్ చర్చల్లో రచ్చ రచ్చ.. ఇంతకీ ట్రంప్ మద్దతు రష్యాకా? ఉక్రెయిన్ కా?

PM Pakistan: దీపావళి విషెస్ చెప్పిన పాకిస్థాన్ ప్రధాని.. విరుచుకుపడుతోన్న భారత నెటిజన్లు

Big Stories

×