Mirai : మిరాయ్ (Mirai) .. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. సూపర్ హీరోగా కాదు ఇప్పుడు సూపర్ యోధా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తేజ సజ్జా (Teja Sajja). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ (TG Viswaprasad) నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. కృతి ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మంచు మనోజ్ (Manchu Manoj) విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసినప్పుడు ట్రైలర్ చివర్లో రాముడి గెటప్ లో ఒక పాత్రను చూపించారు. అందులో పలువురు నటిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఈ సినిమా ట్రైలర్ చివర్లో రాముడు పాత్రలో కనిపించింది అక్కడ నటుడే కాదు అని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో ఏ ఐ టెక్నాలజీ ఉపయోగించి రాముడి పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఆడియన్స్ కాస్తా.. జనాలను టెక్నాలజీ పేరిట కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు కదా అంటూ చిత్ర బృందంపై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా చేస్తారా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఏఐ టెక్నాలజీ తో రాముడి పాత్రను క్రియేట్ చేసిన యూనిట్ తెరపై ఈ పాత్రను ఎలా చూపించబోతున్నారు అనేది తెలియాలి అంటే ఇంకొక్క రోజు ఆగాల్సిందే.
బిగ్ టికెట్ ఆవిష్కరించిన మిరాయ్ టీమ్..
మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ టికెట్ ని సోమవారం రాత్రి విశాఖపట్నంలో విడుదల చేయగా.. ఈ వేడుకను ఉద్దేశించి హీరో తేజా సజ్జా ఇలా మాట్లాడారు. ఈ సినిమాతో ఒక కొత్త ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాము. యాక్షన్, అడ్వెంచర్ తో పాటు ఆశ్చర్యపోయే ఎన్నో విషయాలు కూడా ఈ సినిమా ద్వారా మీకు పరిచయం చేస్తున్నాము.. పిల్లలను మొదలుకొని పెద్దల వరకు అందరూ మెచ్చే సినిమాగా ఇది నిలవబోతోంది. ఒక మంచి సినిమా చేయాలనే లక్ష్యంతో మేమంతా పనిచేశాము.
ALSO READ:Lavanya -Varun: మెగా వారసుడు ఎంత ముద్దుగున్నాడో.. ఫ్యామిలీ ఫుల్ ఖుష్!
నిర్మాత వల్లే ఇదంతా సాధ్యం..
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా వెనకాల ఉండడంతోనే ఇదంతా చేయగలిగాము. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది అంత ఈజీ కాదు. అలాంటిది నేను ఇంత దూరం వచ్చాను అంటే నాకు మరింత సంతోషంగా ఉంది. ఇక భవిష్యత్తులో ఎంతో దూరం వెళ్ళాలి. మొదట ఈ సినిమా కథ నాకు డైరెక్టర్ చెప్పినప్పుడు దీని వెనుక చాలా ఇబ్బందులే ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు ఎవరూ చేయలేదు మనం చేయాల్సి వస్తోంది అని చెప్పారు.. ఇదే కదా మనం మన ప్రేక్షకులకు ఇవ్వాల్సింది అని ఇక రంగంలోకి దిగాము. ఆ తర్వాత మనోజ్ అన్న మాకు అండగా నిలిచారు.
అంతర్జాతీయ స్థాయికి చేరుకునే దిశగా..
ఇప్పుడు అందరితో సినిమా చేస్తున్నా..భవిష్యత్తులో రాబోయే చిత్రాలతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటాము. తక్కువ ధరలకే సినిమా చూసేలా అన్ని ఏర్పాట్లు చేసాం” అంటూ తేజ తెలిపారు. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు