BigTV English

Israel-Hamas : UN సంధి తీర్మానంపై భారత్ ఓటు వేయకపోవడం సిగ్గుచేటు : ప్రియాంక గాంధీ

Israel-Hamas | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో ప్రవేశపెట్టిన సంధి తీర్మానం ఆమోదం పొందింది. అయితే ఈ సంధి తీర్మానంపై భారత్ ఓటు వేయకపోవడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన సంధి తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండడంపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. భారత్ తీరుపై షాక్ కు గురయ్యానని, సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు.

ట్విట్టర్ వేదికగా ఆమె తన అభిప్రాయం తెలియజేశారు. సత్యం, అహింస, లాంటి పునాదులపై ఏర్పడిన దేశం నుంచి అంతర్జాతీయ వేదికపై ఇలాంటి స్పందన వస్తుందని ఊహించలేదన్నారు. ‘కంటికి కన్ను’ అనే ప్రతీకార విధానాన్ని భారతదేశం ఎప్పుడూ సమర్థించలేదని ఆమె గుర్తు చేశారు. ఇజ్రాయెల్ – హమాస్ తక్షణమే మానవీయ కోణంలో యుద్ధ విరమణ చేయాలన్న ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనకు భారతదేశం ఆమోదించకపోవడం బాధాకరమైన విషయమన్నారు.

మానవతా దృష్ట్యా తక్షణమే యుద్ధ విరమణ చేపట్టి, గాజా నివాసులకు నిత్యావసర సహాయం అందించేందుకు వీలు కల్పించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ లో ఒక తీర్మానం ఆమోదం పొందింది. ఆ తీర్మానాన్ని జోర్డాన్ ప్రవేశపెట్టగా, 120 దేశాలు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. 12 దేశాలు వ్యతిరేకించాయి. 45 దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఓటింగ్ లో పాల్గొనని దేశాల్లో భారత్, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, గ్రీస్, ఉక్రెయిన్ తదితర దేశాలున్నాయి. భారత్ తీరుపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×