BigTV English

T20 World Cup 2024: ఆస్ట్రేలియా టూర్ .. కొత్త కెప్టెన్, కొత్త కోచ్..?

T20 World Cup 2024: ఆస్ట్రేలియా టూర్ .. కొత్త కెప్టెన్, కొత్త కోచ్..?

T20 World Cup 2024: వన్డే వరల్డ్ కప్ 2023 ఆద్యంతం రసవత్తరంగా సాగుతోంది. ఒకొక్క జట్టు ఒకొక్క రీతిలో ఆడుతోంది. ఆస్ట్రేలియా లాంటి జట్టు పుంజుకుంటే, ఇంగ్లండు కుంగిపోతోంది. గెలుపు కోసం పాకిస్తాన్ పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ముందు రయ్ మంటూ లేచిన న్యూజిలాండ్ ఇప్పుడు తడబడుతోంది. సౌతాఫ్రికాకి అదృష్టం కలిసివస్తోంది. ఇలా రకరకాల విన్యాసాలతో వరల్డ్ కప్ 2023 సాగిపోతోంది.


వన్డే వరల్డ్ కప్ అయిన వెంటనే నవంబర్ 23 నుంచి 5 టీ 20 మ్యాచ్ లను ఆస్ట్రేలియాతో ఇండియా ఆడనుంది. ఈ నేపథ్యంలో టీ 20 జట్టు ఎంపికపై బీసీసీఐ దృష్టి సారించింది. ఎందుకంటే 2024 జూన్ లో టీ 20 వరల్డ్ కప్ ఉండటంతో అందుకు బీసీసీఐ సర్వ సన్నద్ధమవుతోంది. ఆ దిశగా జట్టు కూర్పుపై సన్నాహాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆస్ట్రేలియా టీ 20 టీమ్ ని ప్రకటించింది. ఇప్పుడు వరల్డ్ కప్ ఆడే జట్టు నుంచి ఏడుగురికి అవకాశం కల్పించింది.

టీమ్ ఇండియా విషయానికి వస్తే రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలకు విశ్రాంతి ఇవ్వనున్నారు. మరి టీ 20 టీమ్ కి కొత్త కెప్టెన్ ఎవరని అంటే, హార్దిక్ పాండ్యా ఉండవచ్చని అంటున్నారు. ఒకవేళ అప్పటికి కూడా అతను కోలుకోకపోతే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కావచ్చునని అంటున్నారు. సెకండ్ ఆప్షన్ గా రుతురాజ్ గైక్వాడ్ కి అవకాశం ఇచ్చేలా ఉన్నారు.


టీ 20 టీమ్ సెలక్షన్ పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, త్వరలోనే మిగతా సెలెక్టర్లతో సమావేశం కానున్నారు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ ,తిలక్ వర్మ, రింకూ సింగ్ వీరు రేస్ లో ఉన్నారు. అందుకని వీరిలోనే కొందరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మరోవైపు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆస్ట్రేలియా టీ 20 టూర్ కి కొత్త కోచ్ గా వీవీవీ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే టీ 20 సిరీస్ కి కూడా లక్ష్మణ్ కోచ్ గా రానున్నారు.

అయితే లక్ష్మణ్ కోచ్ గా రావడంపై కొందరిలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తను మంచి బ్యాటర్, స్లోగా ఆడతాడు. టెస్ట్ క్రికెట్ ప్లేయర్ అనే ముద్ర ఉంది కదా…మరి అలాంటి ప్లేయర్ ని టీ20 కెప్టెన్ గా ఎలా తీసుకొస్తారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమంటారంటే… రాహుల్ ద్రవిడ్ కి అదే పేరుంది కదా.. మరి తను కుర్రాళ్లతో ఎలాంటి క్రికెట్ ఆడించాడో తెలీదా? అని బదులిస్తున్నారు. ఇదండీ సంగతి… సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ డిస్కషన్ వచ్చినా అంతా ఓపెన్ గానే జరిగిపోతోంది కదా..!

Related News

IND Vs PAK : అర్శ్‌దీప్ సింగ్ పై బ్యాన్‌…స‌రికొత్త కుట్ర‌ల‌కు తెగించిన‌ పాకిస్థాన్..!

IPL 2026: ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. షాక్ లో ప్లేయర్లు… ఇకపై అక్కడ ఒక మ్యాచ్ ఆడాల్సిందే

IND Vs PAK : టీమిండియాతో ఫైన‌ల్‌..ఓపెన‌ర్ గా షాహీన్ అఫ్రిదీ..పాక్ అదిరిపోయే ప్లాన్‌

IND VS PAK Final: ఇండియాను వ‌ణికిస్తున్న పాత రికార్డులు..అదే జ‌రిగితే పాకిస్థాన్ ఛాంపియ‌న్ కావ‌డం పక్కా ?

IND Vs PAK : నోరు జారిన షోయబ్ అక్తర్.. అభిషేక్ బచ్చన్ ను సీన్ లోకి లాగి

IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వ‌నున్న‌ నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!

IND Vs PAK : ‘షేక్ హ్యాండ్’ వివాదం పై పాకిస్తాన్ కెప్టెన్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

NEP-WI : నేపాల్ సరికొత్త చరిత్ర.. వెస్టిండీస్ జట్టుపై చారిత్రాత్మక విజయం 18వ ర్యాంక్ లో ఉండి వణుకు పుట్టించింది

Big Stories

×