BigTV English

Israel-Hezbollah: భీకర దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 356 మంది మృతి!

Israel-Hezbollah: భీకర దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 356 మంది మృతి!

Israeli strikes kill 274 in Lebanon: లెబనాన్ అతివాద సంస్థ హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ లెబనాన్‌ పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేయగా..356 మంది మృతి చెందారు. ఈ దాడుల్లో మరో 1246 మందికి పైగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.


మృతుల్లో 27 మంది చిన్నారులు, మహిళలు, పారామెడికల్‌ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. అయితే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది. అయితే ఈ దాడులను అరికట్టేందుకు ఐక్య రాజ్య సమితితోపాటు బలమైన దేశాలకు సైతం లేఖ రాసినట్లు సమాచారం.

హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్.. ఒక్కరోజే దాదాపు 300లకు పైగా స్థావరాలపై దాడులు చేసినట్లు అక్కడి వార్తా కథనాలు వెల్లువడ్డాయి. ఈ దాడుల్లో గ్రామాలు, పట్టణాలు నామరూపాలు లేకుండా పోయాాయి. పక్కా ప్రణాళికతోనే దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా, లెబనాన్‌లో దాడులపై ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గాలంట్ స్పందించారు. లెబనాన్‌లో మా దాడులను తీవ్రతరం చేస్తున్నామన్నారు. మా ప్రజలు ప్రశాంతంగా నివసించాలనే మా లక్ష్యం నెరవేరే వరకు మా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అయితే, దక్షిణ ప్రాంతంలో హెజ్ బొల్లా ఆయుధాలు నిల్వ చేసిన స్థావరాలు, నివాసాలను వీడాలని అక్కడ ఉన్న స్థానికులు హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం బెకా లోయ ప్రాంతంపై విరుచుకుపడింది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భీకర దాడులు చేసింది. ఈ విషయంపై ఐక్య రాజ్య సమితి చీప్ ఆంటోనియా గుటెరస్ స్పందించారు. లెబనాన్ మరో గాజాలా మరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.

Also Read: శ్రీలంక ప్రధాని రాజీనామా.. కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరం చేయనున్న దిసనాయకె

మరోవైపు, లెబనాన్ రాజధాని బీరుట్ లో దాడులు చేసిందని సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. దక్షిణ, తూర్పు లెబనాన్‌లోని హెజ్ బొల్లా స్థావరాలపై దాడులు చేపట్టిన కాసేపటికే ఈ దాడులకు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల ఇరాన్ మద్దతు గల సాయుధ బృందం ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఇందులో భాగంగానే ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

హెజ్‌బొల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ తరుణంలో పశ్చిమ ఆసియాకు అదనపు దళాలను తరలించినట్లు అమెరికా వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో దాదాపు 40 వేలమంది అగ్రరాజ్యం సైనికులు ఉన్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×