E-Paper
Advertisement

జెన్సన్ హువాంగ్‌తోపాటు ఐదుగురు.. వివాహేతర సంబంధాల ఉచ్చు, పదవులు కోల్పోయిన సీఈవోలు

జెన్సన్ హువాంగ్‌తోపాటు ఐదుగురు.. వివాహేతర సంబంధాల ఉచ్చు, పదవులు కోల్పోయిన సీఈవోలు
Advertisement

America: మహిళలు తలచుకుంటే రాజ్యాలు కూలిపోతాయని సమయం, సందర్భం వచ్చినప్పుడు పెద్దలు చెబుతారు. రాజుల కాలం నాటి నుంచి ఈ తరహా తతంగాలు జరుగుతూనే ఉన్నాయి. వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతులుగా వెలుగొందిన కొందరు ఉన్నతస్థాయి వ్యక్తులు చేసిన చిన్న పొరపాటు వారి జీవితాలను తలకిందులు చేసింది.. చేస్తూనే ఉంది. ఎన్వీడియా కంపెనీ మాజీ సీఈవో జెన్సన మొదలు దాదాపు ఐదుగురు సీఈవోలు తమ పదవుల నుంచి తప్పుకున్నారు.

సీఈవోలను వెంటాడుతున్న వివాహేతర సంబంధాలు ఉచ్చు

ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించింది ఎన్విడియా కంపెనీ. గ్రాఫిక్స్ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ రెండు వివాహేతర సంబంధాల ఆరోపణలు ఆయన్ని వెంటాడాయి. ఫలితంగా కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ, బోర్డు సభ్యత్వ పదవుల నుండి తప్పించు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్విడియా కంపెనీ సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామాకు అదనంగా జాతీయ భద్రతా కోణం తోడైంది. బహిరంగ క్షమాపణలో వివాహేతర సంబంధాన్ని ఆయన అంగీకరించారు. కానీ చైనా గూఢచార సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న ఓ మహిళకు సంబంధించిన ఆరోపణలు ఇక్కడ కీలకమైనవి. ఈ వివాదం వాషింగ్టన్‌కు చేరింది. ఈనెల 18న ఆయన కాంగ్రెస్ ముందు హాజరుకానున్నారు. చైనా గూఢచార సంస్థతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న మహిళతో ఎన్విడియా భద్రతా ప్రోటోకాల్స్‌ సంబంధాల గురించి చట్టసభ సభ్యులు సమాధానాలు కోరుతున్నారు.

జెన్సన్ హువాంగ్‌తోపాటు ఐదుగురు

Advertisement

బెర్నార్డ్ లూనీ.. ప్రపంచ ఇంధన సంస్థ, బ్రిటిష్ పెట్రోలియం మాజీ సీఈఓ బెర్నార్డ్ లూనీ ఒకరు. మూడేళ్ల కిందట 2023 సెప్టెంబర్‌లో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సహోద్యోగులతో వ్యక్తిగత సంబంధాల గురించి పారదర్శకత పాటించలేదని తేలిపోయింది. ఈ విషయంలో ఆయన విఫలమయ్యారని అంతర్గత విచారణలో తేలడంతో చర్యలు తీసుకుంది సదరు కంపెనీ. ఆయనకు చెల్లించాల్సిన జీతం, ఇతర ప్రయోజనాల్లో కొంత మొత్తాన్ని తిరిగి తీసుకునే ప్రక్రియ జరిగింది. అంతర్జాతీయ సంస్థకు నాయకత్వం వహించిన వ్యక్తి సొంత కారణంగా పదవిని కోల్పోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.

నెస్లే సీఈఓ లారెంట్ ఫ్రైక్స్- ప్రపంచంలోని అతిపెద్ద ఆహార, పానీయాల సంస్థ నెస్లే కూడా ఒకటి. గతేడాది సెప్టెంబర్‌లో ఆ సంస్థ.. సీఈఓ లారెంట్ ఫ్రైక్స్‌ను పదవి నుంచి తొలగించింది. తన కింద పని చేసే మహిళా ఉద్యోగితో వ్యక్తిగత సంబంధం కొనసాగించడం అందుకు కారణమైంది. ఈ విషయం ఆ సంస్థ అంతర్గత విచారణలో బయటపడటంతో లారెంట్ ను నెస్లే తొలగించింది. ఈ సమస్య తమ వ్యాపార ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించింది. ఆయన స్థానంలో కొత్త సీఈవో కోసం నియమించే ప్రక్రియ చేపట్టింది.

Advertisement

మెక్‌డొనాల్డ్స్ సీఈఓ స్టీవ్ ఈస్టర్‌బ్రూక్- ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే ఫాస్ట్‌ ఫుడ్ బ్రాండ్ మెక్‌డొనాల్డ్స్ మాజీ సీఈఓ. ఆయన కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకుని తన పదవికి ఎసరు తెచ్చుకున్నారు. 2019 నవంబర్‌లో ఓ ఉద్యోగితో వ్యక్తిగత సంబంధం కొనసాగించిన విషయం ఆలస్యంగా బయటపడింది. కంపెనీ నిబంధనల ప్రకారం ఉద్యోగులతో ఇలాంటి సంబంధాలు నిషేధం. దీంతో ఆ సంస్థ ఆయన్ని పదవి నుంచి తొలగించింది. తప్పుడు వివరాలతో పొందిన పరిహారానికి సంబంధించి న్యాయపరమైన చర్యలుఎదుర్కొన్నారు. తన పదవి, భారీ ఆర్థిక ప్రయోజనాలను కోల్పోవాల్సి వచ్చింది స్టీవ్ ఈస్టర్‌బ్రూక్.

ALSO READ: జెన్సన్ రాజీనామా చేయలేదు,తప్పించారు! అమెరికా కాంగ్రెస్ ముందు హాజరు, తాత్కాలిక సీఈఓ కొల్లెట్ క్రెస్

ఆస్ట్రానమర్ సీఈఓ ఆండీ బైర్న్- గతేడాది జూలైలో కోల్డ్‌ప్లే సంగీత కచేరీలో ఆ సంస్థ సీఈఓ ఆండీ బైర్న్.. ఓ ఉద్యోగిని కౌగిలించుకుంటున్న వీడియోవైరల్ అయ్యింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో సంస్థలో అంతర్గత విచారణ జరిగింది. చివరకు నాయకత్వంలో మార్పులు జరిగాయి. ఫలితంగా టెక్ కంపెనీకి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారం కంపెనీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది కూడా.

అలాన్ షా-నార్ఫోక్ సదరన్ కంపెనీ చీఫ్ లీగల్ ఆఫీసర్‌తో సంబంధం పెట్టుకున్నట్లు బయటపడింది. దీంతో నార్ఫోక్ సదరన్ సంస్థ 2024 సెప్టెంబర్‌లో సీఈఓ అలన్ షాను తొలగించింది. ఆ తర్వాత లీగల్ ఆఫీసర్‌ను ఉద్యోగం నుండి తొలగించారు. అంతకుముందు 2023 ఒహాయో రైలు పట్టాలు తప్పిన ఘటనను కంపెనీ నిర్వహించిన తీరుపై షా విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయన నిష్క్రమణకు ఆ సంబంధాన్ని కారణంగా కంపెనీ పేర్కొంది.

Related News

జెన్సన్ రాజీనామా చేయలేదు,తప్పించారు! అమెరికా కాంగ్రెస్ ముందు హాజరు, తాత్కాలిక సీఈఓ కొల్లెట్ క్రెస్

బిడ్డకు జన్మనిస్తే 100 కొరడా దెబ్బలు.. ఎక్కడో తెలుసా?

ఎన్విడియా ఏఐ చిప్స్ వ్యవహారంతో.. ట్రంప్ ఇజ్జత్ గల్లంతు!

ఇరాన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు.. ఫోన్ కాల్‌లో తీవ్ర వాగ్వాదం?

నేపాల్‌లో భారీ భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు, 4.9‌గా నమోదు

ఎన్విడియాలో అల్లకల్లోలం.. ఉద్యోగినితో జెన్సన్‌కు లింకులు, పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు

అమెరికా టారిఫ్ షాక్.. కొత్త దారుల్లో భారత గార్మెంట్ కంపెనీలు!

Big Stories

Advertisement
×