E-Paper
Advertisement

ఇరాన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు.. ఫోన్ కాల్‌లో తీవ్ర వాగ్వాదం?

ఇరాన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు.. ఫోన్ కాల్‌లో తీవ్ర వాగ్వాదం?
Advertisement

Trump vs Netanyahu: ఇరాన్‌పై దాడులను తిరిగి ప్రారంభించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. గత వారాంతంలో వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని.. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో అరుచుకున్నారని ఇజ్రాయెల్ వార్తా సంస్థ ‘వై-నెట్ న్యూస్’ (Ynet News) పేర్కొంది.

అయితే వై-నెట్ న్యూస్ కథనాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పూర్తిగా తోసిపుచ్చింది. ఇరువురు నేతల మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదని స్పష్టం చేసింది. ‘అది పూర్తిగా అవాస్తవం. అర్థరహితమైన వార్త’ అని నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఫోన్ సంభాషణ జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ.. అందులో ఎలాంటి మాటల యుద్ధం జరగలేదని సీనియర్ ఇజ్రాయెల్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా గత జూన్‌లో కూడా వీరిద్దరి మధ్య ఇలాంటి వాగ్వాదమే జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నెతన్యాహుపై తాను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ట్రంప్ స్వయంగా ‘ది పోస్ట్’ పత్రికకు తెలిపారు.

Advertisement

అయితే మంగళవారం జరిగిన 26వ ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) ప్రమాణ స్వీకారోత్సవంలో నెతన్యాహు చేసిన ప్రసంగం అమెరికాతో ఉన్న విభేదాలను స్పష్టంగా బయటపెట్టింది. ఇరాన్ తన అణు సామర్థ్యాలను తిరిగి నిర్మించుకోవడానికి చురుకుగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇరాన్‌లోని అయతుల్లా పాలనను కూల్చివేయడమే ఈ ముప్పును శాశ్వతంగా తొలగించడానికి ఉన్న ఏకైక మార్గమని ఆయన అన్నారు. అయితే అణ్వాయుధాలు కలిగిన ఇరాన్‌ను అంగీకరించాలని.. గాజా, లెబనాన్, సిరియాలో తాము సాధించిన సైనిక విజయాలను వదులుకోవాలని త్వరలోనే తమపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ నెతన్యాహూ అన్నారు.

Also Read: ఒకప్పుడు ఫైర్ ఇంజన్లు కడిగాడు.. నేడు రూ. 2,100 కోట్ల కంపెనీకి అధిపతి.. 27 ఏళ్ల కుర్రాడి గ్రేట్ సక్సెస్!

Advertisement

ఇరాన్‌పై వెంటనే సైనిక చర్యలకు దిగాలని నెతన్యాహు పట్టుబడుతున్నప్పటికీ ట్రంప్ మాత్రం దౌత్యపరమైన చర్చలు, ఆర్థిక ఒత్తిళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘ఫైనాన్షియల్ టైమ్స్’ కథనం ప్రకారం.. ఇరాన్‌పై దాడులను తిరిగి ప్రారంభించాలని కోరుతూ నెతన్యాహు ప్రతిరోజూ ట్రంప్‌కు ఫోన్ చేస్తున్నారు. కానీ ఇందుకు ట్రంప్ అంగీకరించడం లేదట. ఎందుకంటే యుద్దం కంటే చర్చలకే ప్రాధాన్యం ఇవ్వాలని శ్వేతసౌధం వర్గాలు ట్రంప్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సదరు కథనం రాసుకొచ్చింది. మరోవైపు నెతన్యాహు దాడులను కోరుకుంటున్నప్పటికీ ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేసింది.

Also Read: 65 ఏళ్ల వయసులో రూ. 20 భోజనంతో ప్రారంభం.. నేడు రూ. 2.5 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

Tags

Related News

నేపాల్‌లో భారీ భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు, 4.9‌గా నమోదు

ఎన్విడియాలో అల్లకల్లోలం.. ఉద్యోగినితో జెన్సన్‌కు లింకులు, పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు

అమెరికా టారిఫ్ షాక్.. కొత్త దారుల్లో భారత గార్మెంట్ కంపెనీలు!

హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. పేలిన మూడు నౌకల టాంకర్లు-ఎగిసిపడిన మంటలు, హెచ్చరించిన ఐఆర్‌జిసి

ఇజ్రాయెల్‌లో రసవత్తర సమరం.. ప్రధానిగా నెతన్యాహు పనైపోయినట్లేనా..?

పాక్‌లో కూలిన ఆనకట్టు..జనావాసాల్లోకి భారీగా నీరు, ప్రాజెక్టు కాంట్రాక్టర్ చైనాయే

వైట్‌హౌస్ వద్ద కారు ప్రమాదం.. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ప్రమాదమా లేక కుట్రా?

Big Stories

Advertisement
×