E-Paper
Advertisement

బిడ్డకు జన్మనిస్తే 100 కొరడా దెబ్బలు.. ఎక్కడో తెలుసా?

బిడ్డకు జన్మనిస్తే 100 కొరడా దెబ్బలు.. ఎక్కడో తెలుసా?
Advertisement

ఐదుగురు పిల్లలున్న ఓ తల్లి… పొట్ట చేత పట్టుకుని బతుకుదెరువు కోసం మరో దేశానికి వెళ్లింది. అక్కడ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డకు జన్మనివ్వడమే ఆమె పాలిట శాపంగా మారింది. దీంతో సౌదీ అరేబియా కోర్టు ఆమెకు విధించిన శిక్ష ఎంటో తెలుసా? ఏకంగా 100 కొరడా దెబ్బలు. అంతేకాదు.. ఏడాది పాటు బహిష్కరణ. ఇంతకీ ఆమె చేసిన పాపమేంటి? రీసెంట్‌గా ఓ జంటకు మరణశిక్ష విధించిన తర్వాత వరల్డ్‌వైడ్‌గా సౌదీ చట్టాలపై డిస్కషన్ జరిగింది తెలుసు కదా.. ఇప్పుడు ఈ మహిళా కొరడా దెబ్బల శిక్ష కూడా మరోసారి చర్చకు వచ్చింది.

అసలు ఏమైంది?

ఎస్తర్ వాంజా ముథోని… ఆమె వయసు 40 ఏళ్లు. కెన్యాకు చెందిన ఈమె ఐదుగురు పిల్లల తల్లి. బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ ఓ ఇంట్లో పనిచేస్తోంది. మహారహ్ హ్యూమన్ రిసోర్సెస్ అనే సంస్థ ద్వారా లీగల్‌గానే ఉద్యోగంలో చేరింది. ఈ టైమ్‌లో మొహమద్ అనే ఈజిప్టు వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధం వరకు వెళ్లింది. ఆ తర్వాత అతడు సౌదీ అరేబియా విడిచి వెళ్లిపోయాడు. కానీ ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. 2025 ఆగస్టులో ఎస్తర్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి పేరు అబుడీ. అయితే ఎస్తర్ పని ఇచ్చిన ఏజెన్సీ సూపర్ వైజర్ బిడ్డకు జన్మనివ్వడాన్ని చూసి.. వెంటనే తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించాడు. అక్కడి నుంచే ఆమె కష్టాలు మొదలయ్యాయి.

ఆశ్రయం కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో..

Advertisement

ఆ హాస్పిటల్ అధికారులు .. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. అప్పుడే పుట్టిన చిన్నారి ఓ వైపు.. పోలీసులు విచారణ మరోవైపు. కష్టాన్ని అనుభవిస్తూనే అసలేం జరిగిందో ఆమె పోలీసులకు చెప్పింది. పిల్లాడి తండ్రి దేశం విడిచి వెళ్లిపోయాడంది. ఆ తర్వాత పోలీసులు ఆమెను రిలీజ్ చేశారు. ఎలాగోలా పోలీసుల నుంచి తప్పించుకున్నాను అనుకునే సరికి.. మరో కొత్త సమస్య. నిన్నటి వరకు ఏ ఏజెన్సీ అయితే ఆశ్రమిచ్చిందో.. ఆమెను తిరిగి రానివ్వలేదు. మరోవైపు ఏ షెల్టర్ హోమ్ కూడా ఆమెకు ఆశ్రయం కల్పించలేదు. కెన్యా ఎంబసీ నుంచి కూడా తగిన సహాయం చేయలేదు. దీంతో అప్పుడే పుట్టిన బిడ్డతో కలిసి రియాద్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఉండేది. ఆ ఏరియాలోనే సొంత దేశాలకు తిరిగి వెళ్లాలనుకుంటున్న వలస మహిళలకు ఓ కేర్ సెంటర్‌గా ఉండేది.

సొంత దేశానికి తిరిగి వెళ్తుందనగా.. ఊహించని ట్విస్ట్

ఆమె పరిస్థితిపై ఇంటర్నేషనల్ మీడియా కొన్ని కథనాలు ప్రచురించింది. దీంతో మహారహ్ తిరిగి ఆమెకు వసతి కల్పించింది. కెన్యా ఎంబసీ కూడా సొంత దేశానికి వెళ్లేందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసింది. మళ్లీ అంతా సెట్ అయ్యింది అనుకునే టైమ్‌లో.. ఈసారి ఏకంగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది ఆమె పరిస్థితి. ఈసారి సౌదీ కోర్టులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఎందుకంటే పోలీసులు అప్పటికే కేసు ఫైల్ చేశారు. సౌదీ అరేబియా న్యాయవ్యవస్థ ఇస్లామిక్ షరియా చట్టాల ఆధారంగా పనిచేస్తుంది. ఆ చట్టాల ప్రకారం వివాహేతర లైంగిక సంబంధం ఓ నేరం. రియాద్‌లోని క్రిమినల్ కోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 2025 అక్టోబరులో ఎస్తర్ కేసును విచారించింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు నిర్ధారిస్తూ ఆమెకు 100 కొరడా దెబ్బలు, ఏడాది పాటు బహిష్కరిస్తూ శిక్ష విధించింది. మరో దారుణమైన విషయం ఏంటంటే.. కోర్టు విచారణ టైమ్‌లో తనకు ఓ ట్రాన్స్‌లేటర్ ఉన్నాడు కానీ.. ఆమె తరఫున వాదించడానికి లాయర్‌ మాత్రం లేడు.

అప్పీల్ చేయను.. శిక్షను భరిస్తానంటూ..

Advertisement

తనకు విధించిన శిక్షపై అప్పీల్ చేయలేదు ఎస్తర్. ఎందుకంటే.. ఈ విచారణ ఇంకా కొన్నాళ్ల పాటు కొనసాగడం ఆమెకు ఇష్టం లేదు. ఆ శిక్షనైనా భరిస్తా.. కానీ వెంటనే కెన్యాలో ఉన్న తన నలుగురు పిల్లల దగ్గరికి వెళ్లిపోతా అంటోంది ఆమె. కానీ 100 కొరడా దెబ్బలను తాను భరించలేనేమోనని భయపడుతున్నట్లు చెప్పింది. ఈ కేసుతో మరోసారి సౌదీ చట్టాలపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. ఎందుకంటే సౌదీ అరేబియా గత కొన్నేళ్లుగా తన చట్టాలు, సామాజిక విధానాల్లో అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తోంది. మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దడం వంటి అంశాలపై యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా 2020లో కొరడా దెబ్బల శిక్షను ఎక్కువగా విధించకూడదు అనే సంస్కరణలను ప్రకటించింది.

ఈ మార్పులు అన్ని శిక్షలకు కాదు

ప్రభుత్వం చేసిన ఆ మార్పులు అన్ని నేరాలకూ వర్తించలేదు. న్యాయమూర్తుల విచక్షణాధికారంతో విధించే తజీర్ శిక్షలకు మాత్రమే అవి వర్తించాయి. కొన్ని హుదూద్ నేరాలకు సంబంధించిన శిక్షల్లో కొరడా దెబ్బల అవకాశం ఇప్పటికీ ఉంది. అందుకే ఎస్తర్‌కు విధించిన శిక్షపై మానవ హక్కుల సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పెళ్లికాని మహిళలు గర్భం దాల్చినప్పుడు వారికి రక్షణ, వైద్య సహాయం, న్యాయ సహాయం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వలస కార్మికుల హక్కుల కోసం పనిచేసే సంస్థలు. మహిళను శిక్షించే బదులు తన బిడ్డతో స్వదేశానికి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

మరి, ఆ చిన్నారి భవిష్యత్తు ఏమిటీ?

ఈ కేసులో మరో పెద్ద సమస్య చిన్నారి అబుడీ ఫ్యూచర్. సౌదీ అరేబియాలో పెళ్లికాని తల్లులకు జన్మించిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు పొందడం చాలా కష్టం. అలాంటి డాక్యుమెంట్స్‌ లేకపోతే పాస్‌పోర్టు, ప్రయాణ అనుమతులు పొందడం ఇంకా కష్టం. ఇప్పుడు ఎస్తర్‌ విషయాన్నే తీసుకోండి. గతంలో జారీ చేసిన డాక్యుమెంట్స్‌ ఎక్స్‌పైరీ అయ్యాయి. కోర్టు కేసు పెండింగ్‌లో ఉండటంతో ఆమె సౌదీని విడిచి వెళ్లలేకపోయింది. ఇప్పుడు ఆ చిన్నారి ఫ్యూచర్ ఏంటనేది కూడా పెద్ద క్వశ్చన్.

Also Read: పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్ మాయం? ఏఐతో వ్యాధులకు చెక్!

ఆమెకు న్యాయం జరుగుతుందా?

మరోవైపు కెన్యా, సౌదీ అరేబియాలు గృహ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఒప్పందం చేసుకున్నప్పటికీ… ఇలాంటి క్రిమినల్ కేసులను ఎలా పరిష్కరించాలనే దానిపై క్లారిటీ లేదు. ఒకవైపు చట్టం.. మరోవైపు మానవ హక్కులు. ఈ రెండింటి మధ్య ఎస్తర్, ఆమె పసిబిడ్డ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఎస్తర్‌కు న్యాయం జరుగుతుందా? ఆమె తన బిడ్డతో కలిసి ఎప్పుడు కెన్యాకు చేరుకుంటుంది? అనేది ఇప్పుడు తేలాలి.

Tags

Related News

ఎన్విడియా ఏఐ చిప్స్ వ్యవహారంతో.. ట్రంప్ ఇజ్జత్ గల్లంతు!

ఇరాన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు.. ఫోన్ కాల్‌లో తీవ్ర వాగ్వాదం?

నేపాల్‌లో భారీ భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు, 4.9‌గా నమోదు

ఎన్విడియాలో అల్లకల్లోలం.. ఉద్యోగినితో జెన్సన్‌కు లింకులు, పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు

అమెరికా టారిఫ్ షాక్.. కొత్త దారుల్లో భారత గార్మెంట్ కంపెనీలు!

హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. పేలిన మూడు నౌకల టాంకర్లు-ఎగిసిపడిన మంటలు, హెచ్చరించిన ఐఆర్‌జిసి

ఇజ్రాయెల్‌లో రసవత్తర సమరం.. ప్రధానిగా నెతన్యాహు పనైపోయినట్లేనా..?

Big Stories

Advertisement
×