Trump Challenges: మిడ్ టర్మ్ ఫలితాలతో ట్రంప్ పరిస్థితి త్రిశంకు నరకంలా మారింది. మరోవైపు ఎన్విడియో సీఈవో బ్లూస్ తో పాటు కొందరు మంత్రుల ప్రవర్తన ట్రంప్‌కు చికాకులు తెస్తున్నాయి. ఇంటా బయట ముఖంచూపుకోలనే సిట్చుయేషన్. ఇప్పుడేం చూశారు.. ముందన్నది మొసళ్ల పండుగ అని ట్రంప్ కోటరికి అల్టిమేట్ ఇస్తున్నారు డెమోక్రాట్స్.
ఏఐ చిప్‌ల వ్యవహారం..
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వాన్ని రాజకీయ సవాళ్లు ఇరుకున పెడుతున్నాయి. ఇప్పటికే ఎన్విడియా ఏఐ చిప్ ల వ్యవహారం.. సీఈవో జెన్స్‌న లవ్వాయణంతో పెద్దన్న ఇజ్జత్ బజార్ల పడింది. ఇంతలోనే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్‌కు ఆర్లింగ్టన్ నేషనల్ సెమిట్రీలో చేదు అనుభవం ఎదురైంది. వెటరన్స్ డే కార్యక్రమం అనంతరం టూంబ్ ఆఫ్ ది అన్‌నోన్ సోల్జర్ వద్ద హెగ్సేత్ అతని టీమ్ ఫోటోలు దిగారు, ఐతే సైలెన్స్ పాటించాల్సిన చోట నవ్వుతూ మాట్లాడుకోసాగారు, అది గమనించిన ఓ సైనికుడు వెంటనే రియాక్టయ్యారు. నిశ్శబ్దం, గౌరవం పాటించాలని చోట నవ్వడం ఏంటని పీట్ హెగ్సేత్ టీమ్‌ను గట్టిగా మందలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. సైనికుడు అలా మందలించడం కరెక్టేనని పెంటగాన్ స్పందించింది.
అభిశంనన విషయం..
సిమెట్రీ దగ్గర ప్రవర్తించిన తీరుకు చీవాట్లు పడినా.. అభిశంనన విషయంలో పీట్ హెగ్సేత్‌కు ఊరట దక్కింది.ట్రంప్ టీమ్ ప్రయత్నాలు ఫలించి అమెరికా కాంగ్రెస్‌లో ఆయనపై అభిశంసన తీర్మానం నిలిచిపోయింది. ఇది ప్రస్తుతానికి రిలీఫ్ మాత్రమే. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డెమోక్రాట్స్ జనవరిలో బాధ్యతలు చేపడుతారు. అప్పుడు పీట్ హెగ్సేత్‌పై అభిశంసన ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం వుంది.
విచారణ పేరుతో బెదిరింపులు..
జనవరి నుంచి కాంగ్రెస్‌లో పట్టు సాధించనున్న డెమోక్రాట్లు.. ట్రంప్ ప్రభుత్వం, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల వ్యవహారాలపై విచారణకు సిద్ధమవుతున్నారు. ట్రంప్ అండ్ కో ఇక న్యాయవాదులను సిద్ధం చేసుకోవాల్సిందేనన్నారు. డెమోక్రాట్ నేత రాబర్ట్ గార్సియా. ఆయన వ్యాఖ్యలపై వైట్‌హౌస్ కౌన్సెల్ విల్ షార్ఫ్ ఘాటుగా స్పందించారు. విచారణ పేరుతో బెదిరింపులకు దిగడం, చట్టవిరుద్ధంగా సబ్‌పోనాలు జారీ చేయడం నేరపూరిత చర్యల పరిధిలోకి రావచ్చని హెచ్చరించారు. దీనిపై డెమోక్రాట్లు కూడా గట్టిగానే స్పందించారు. కాంగ్రెస్‌కు తన రాజ్యాంగబద్ధమైన విచారణాధికారం ఉందని, వైట్‌హౌస్ అనుమతి అవసరం లేదన్నారు. మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాల తరువాత అమెరికా రాజకీయాల్లో కొత్త మెరుపులు తెరపైకి వస్తున్నాయి. మిసిసిపీ రాష్ట్రం నుంచి తొలి ఆఫ్రికన్-అమెరికన్ సెనేటర్‌గా డెమోక్రాట్ స్కాట్ కొలోమ్ చరిత్ర సృష్టించారు.
107వ వార్షిక వెటరన్స్ డే..
అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న ద్వేషపూరిత వ్యాఖ్యలు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతానని భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ అమిష్ షా స్పష్టం చేశారు.గత ఆరు నెలల నుంచి యాంటీ ఇండియా ద్వేషం పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా, బాధిత వర్గాలకు అండగా నిలుస్తామన్నారు, అవసరమైతే చట్టపరమైన చర్యలు, భద్రతా చర్యలకు కూడా మద్దతు ఇస్తామన్నారు. ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేసేలా చేయడం వాణిజ్య నిర్ణయాల్లో కాంగ్రెస్ అధికారాలను పునరుద్ధరించడం తమ ప్రాధాన్యమన్నారు అమిష్ షా. జనవరిలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు అమెరికాలో విశేష గౌరవం దక్కింది. న్యూయార్క్‌లో జరిగిన 107వ వార్షిక వెటరన్స్ డే పరేడ్‌కు గ్రాండ్ మార్షల్‌గా ఆమె వ్యవహరించారు.
Tags

Share