E-Paper
Advertisement

జెన్సన్ రాజీనామా చేయలేదు,తప్పించారు! అమెరికా కాంగ్రెస్ ముందు హాజరు, తాత్కాలిక సీఈఓ కొల్లెట్ క్రెస్

జెన్సన్ రాజీనామా చేయలేదు,తప్పించారు! అమెరికా కాంగ్రెస్ ముందు హాజరు, తాత్కాలిక సీఈఓ కొల్లెట్ క్రెస్
Advertisement

Jensen Huang: ప్రపంచంలో అతిపెద్ద ఏఐ చిప్ కంపెనీ ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌ విషయంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు మూడో మహిళతో సంబంధాలు ఉన్నట్లు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ కోడై కూస్తోంది. సీఈవో పదవికి ఆయన రాజీనామా చేయలేదు. బోర్డు బలవంతంగా తప్పించిందని సమాచారం. జెన్సన్ స్థానంలో తాత్కాలిక సీఈవోగా కొల్లెట్ క్రెస్ ఎంట్రీ ఇచ్చారు.

జెన్సన్ రాజీనామా చేయలేదు,తప్పించారు!

ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా సీఈవో పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారు. కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవులకు తక్షణం ఆయన వైదొలిగినట్లు తెలిసింది. ఆయన రాజీనామా చేయలేదని, కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆయన చేత రాజీనామా చేయించారని సమాచారం. అతడ్ని తొలగించాలని బోర్డు నిర్ణయించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. నవంబర్ 11న రాత్రి జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో 11 మంది డైరెక్టర్లలో 10 మంది హువాంగ్‌ను తొలగించడానికి ఓటు వేశారు. కంపెనీ అధికారిక ప్రకటనలో కేవలం రాజీనామా అని మాత్రమే ఉంది. అందుకు గల కారణాన్ని వెల్లడించలేదు.

తాత్కాలిక సీఈఓ కొల్లెట్ క్రెస్, అమెరికా కాంగ్రెస్ ముందుకు జెన్సన్

Advertisement

సుమారు 33 ఏళ్లపాటు కంపెనీకి నాయకత్వం వహించిన జెన్సన్, కేవలం మహిళల కాలంగా ఆయన పదవీకాలం అర్థాంతరంగా ముగిసింది. జెన్సన్ తప్పుకున్నట్లు వార్త కంపెనీ భవిష్యత్తుపై ఆందోళన పెరిగింది. దీంతో గురువారం ఆ కంపెనీ షేర్లు భారీ అమ్మకాలు జరిగాయి. ట్రేడింగ్ సమయంలో ఆ కంపెనీ షేర్లు 14.3 శాతానికి పడిపోయి 148.80 డాలర్లకు చేరింది. జెన్సన్ హువాంగ్ ఆకస్మిక రాజీనామా వార్త షేర్ల పతనానికి ప్రధాన కారణం చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు.

జెన్సన్ రాజీనామా తర్వాత ఆ కంపెనీ దీర్ఘకాల సీఎఫ్‌ఓ‌గా పని చేసిన కోలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించింది బోర్డు. ఆమె చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవులను కొనసాగిస్తారు. ఆ కంపెనీ హార్వే జోన్స్‌ను మొదటి బోర్డు ఛైర్మన్‌గా నియమించింది. జోన్స్ గతంలో సైనోప్సిస్ సీఈఓగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. టెక్నాలజీ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. కంపెనీ ఇప్పుడు శాశ్వత సీఈఓ కోసం అన్వేషణ మొదలుపెట్టింది.

Advertisement

ALSO READ: బిడ్డకు జన్మనిస్తే 100 కొరడా దెబ్బలు.. ఎక్కడో తెలుసా?

ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ కథనాల మేరకు హువాంగ్ మరో మహిళా ఉద్యోగితో సంబంధం కలిగి ఉన్నారని పేర్కొంది. అయితే ఆ మహిళ పేరు వెల్లడించలేదు. దీంతో జెన్సన్‌కుముగ్గురు మహిళలతో సంబంధాలు వెల్లడయ్యాయి. గతంలో చైనా మహిళ ఆలిస్‌తో, ఎన్విడియా ఉద్యోగి కింబర్లీతో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. కొత్త మహిళ విషయంపై ఎన్విడియా సంస్థ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

జెన్సన్ పై చైనా స్పై వ్యవహారంలో ఇప్పటివరకు ఎన్విడియా కంపెనీ అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు ఎఫ్‌బిఐ విచారణ ప్రారంభించింది. ఈ విచారణ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆలిస్.. హువాంగ్ చైనాకు చిప్‌లను రవాణా చేసిందా? లేదా? హువాంగ్ నుండి ఏదైనా రహస్య సమాచారం తీసుకుందా? దీంతోపాటు ఆలిస్‌కు సంబంధించి విచారణ నిర్వహిస్తోంది. మరోవైపు జెన్సన్‌ను నవంబర్ 18న రహస్య సమావేశం కోసం యూఎస్ కాంగ్రెస్‌ ముందు హాజరుకానున్నారు. ఆలిస్-జెన్సన్ సంబంధం, గూఢచర్య కేసు దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుండి ఎన్విడియా షేర్లు 5 శాతానికి పడిపోయాయి. జెన్సన్ సంపద రూ.6.92 లక్షల కోట్లకు పడిపోయింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో జెన్సన్ రెండు స్థానాలు దిగజారి 10వ స్థానానికి పడిపోయారు.

Related News

బిడ్డకు జన్మనిస్తే 100 కొరడా దెబ్బలు.. ఎక్కడో తెలుసా?

ఎన్విడియా ఏఐ చిప్స్ వ్యవహారంతో.. ట్రంప్ ఇజ్జత్ గల్లంతు!

ఇరాన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు.. ఫోన్ కాల్‌లో తీవ్ర వాగ్వాదం?

నేపాల్‌లో భారీ భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు, 4.9‌గా నమోదు

ఎన్విడియాలో అల్లకల్లోలం.. ఉద్యోగినితో జెన్సన్‌కు లింకులు, పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు

అమెరికా టారిఫ్ షాక్.. కొత్త దారుల్లో భారత గార్మెంట్ కంపెనీలు!

హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. పేలిన మూడు నౌకల టాంకర్లు-ఎగిసిపడిన మంటలు, హెచ్చరించిన ఐఆర్‌జిసి

Big Stories

Advertisement
×