BigTV English

Biden Withdraws From Election: జో బైడెన్ అవుట్.. రేసులో నిలబడేవారేవరు?

Biden Withdraws From Election: జో బైడెన్ అవుట్.. రేసులో నిలబడేవారేవరు?

జో బైడెన్.. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఈ వృద్ధుడు.. మరోసారి బరిలోకి దిగాలని నిర్ణయించారు. కానీ మతిమరుపుతో పాటు.. ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు. అయినా తానే బరిలోకి దిగుతానంటూ మంకు పట్టు పట్టారు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్‌తో ఫస్ట్‌ డిబేట్ జరిగిందో.. అమెరికన్లకు ఓ క్లారిటీ వచ్చేసింది. బైడెన్‌ను తప్పించకపోతే అసలుకే మోసం వస్తుందని దీనికి తోడు ట్రంప్‌పై హత్యాయత్నం అతని గ్రాఫ్‌ను మరింత పెంచేసింది. దీంతో డెమోక్రాట్లు అలర్ట్ అయ్యారు. మొండికేసిన బైడెన్‌ను ఒప్పించారా? లేక తనంతట తానే రియలైజ్ అయ్యారా? అనేది తెలీదు కానీ.. మొత్తానికైతే మెట్టు దిగారు. ఎందుకిలా అనాల్సి వస్తుందంటే మొదట ఆయనపై వచ్చిన విమర్శలపై కొంచెం ఘాటుగానే స్పందించారు. అధ్యక్ష రేస్‌ నుంచి వెనక్కి తగ్గేదే లేదన్నారు.

అధ్యక్ష రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు ఓ లెటర్‌ ద్వారా ప్రజలకు తెలిపారు బైడెన్.. నా హాయంలో అమెరికా నిర్మాణం కోసం ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాను. వృద్ధులకు చౌకగా ఔషధాలను అందించడం. అమెరికన్లకు వైద్య చికిత్సలను అందుబాటులోకి తేవడం.. గత 30 ఏళ్లలో గన్స్‌ నుంచి రక్షణకు చట్టాన్ని చేయడం. సుప్రీంకోర్టుకు మొదటి అఫ్రో అమెరికన్‌ను నియమించడం.వాతావరణ మార్పులపై చట్టం తీసుకురావడం.. ఇలా.. ఇవన్నీ తన విజయాలంటూ లెటర్‌లో మెన్షన్‌ చేశారు బైడెన్.


కాబట్టి అమెరికాలో బైడెన్ శకం ముగిసింది.. బాగుంది.. మరి నెక్ట్స్‌ అధ్యక్ష రేస్‌లో నిలిచేది ఎవరు? ఇది ఇప్పుడు అసలు ప్రశ్న.. అయితే దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియాలంటే ఆగస్టు 19 వరకు ఆగాల్సిందే..ఆ తర్వాతే డెమోక్రాట్ల నుంచి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుంది. అయితే నెక్ట్స్‌ ప్రెసిడెన్షియల్ రేస్‌లో ఉండేది కమలా హ్యారిసేనా? అనేది ఇప్పుడు అసలు ప్రశ్న.. ఎందుకంటే ప్రస్తుతం ఆమె వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతేకాదు బైడెన్‌ కూడా ఆమెకే జై కొట్టారు. తన మద్దతు హ్యారిస్‌కే అని అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. దీనికి ఆమె కూడా ఆమోదం తెలిపింది.. కాబట్టి.. ఇక్కడో సమస్య ఉంది.. అదే ఇప్పుడు కొత్త డౌట్స్‌ను తెరపైకి తీసుకొస్తుంది.

బైడెన్‌ ఇలా రిటైర్మెంట్ ప్రకటించగానే.. డెమోక్రాట్ల నుంచి ప్రశంసలు మొదలయ్యాయి. ఆయన అమెరికాకు చాలా సేవలు చేశారని. అమెరికా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచారంటూ అభినందనలు తెలిపారు. ఈ లిస్ట్‌లో మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ఉన్నారు.. స్వచ్చంధంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గొప్ప దేశభక్తి ఉండాలన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ చివర్లో ఓ మాట అన్నారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్.. ఆయన కామెంట్స్ ఏంటంటే.. కొత్త అధ్యక్ష అభ్యర్థి సెలక్షన్‌ కోసం పార్టీ నేతలు సరైన ప్రక్రియతో ముందుకు వస్తారు.

అదేంటి.. బైడెన్ ఆల్రెడీ హ్యారిస్‌ పేరును చెప్పేశాక.. మళ్లీ ఎంపిక ప్రక్రియ ఏంటి? అనేది అసలు ప్రశ్న.. అంటే హ్యారిస్‌కు ఒబామా మద్ధతు పలకడం లేదని అర్థమవుతుంది. అటు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మరో కీలక నేత నాన్సీ పెలోసీ కూడా కమలాకు మద్ధతు పలకడం లేదు.. కాబట్టి.. కమలాకు అందరి నుంచి ఆమోద ముద్ర లేదని తెలుస్తుంది. అంటే రేపటి రోజు ఈ నిర్ణయం మారవచ్చు.. మద్దతు పలకవచ్చు.. కానీ ఇప్పటికిప్పుడైతే ఆమె పేరు కన్ఫామ్ కాలేదు.. కానీ రేస్‌లో మాత్రం ఉన్నారు. ఆగస్టులో డెమోక్రటిక్‌ పార్టీ మీటింగ్ ఉంది.

ఇందులోనే అభ్యర్థి ఎవరనే క్వశ్చన్‌కు ఆన్సర్ తెలుస్తుంది. మొత్తం 4 వేల 700 మంది ప్రతినిధులు నామినీని ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పుడింత మంది మనసులను హ్యారిస్ గెలుచుకోవాలి. అయితే బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌ అయితే హారిస్‌కు జై కొట్టారు. అయితే కమలా హ్యారిస్‌కు ఈ పోటీలో కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎందుకంటే 2020 ఎన్నికల సమయంలో కూడా అమె అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్నారు. అయితే అప్పుడు నిర్వహించిన కొన్ని ఇంటర్వ్యూస్‌లో ఆమె తడబడ్డారు.
క్యాంపెయిన్‌ కూడా అంత గొప్పగా నిర్వహించలేకపోయారు. దీంతో అప్పుడు నామినేషన్‌ నుంచి తప్పుకున్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. నాలుగేళ్లు గడిచిపోయింది. వైస్ ప్రెసిడెంట్‌గా ఎక్స్‌పీరియన్స్‌ కూడా వచ్చింది. వీటన్నింటిని తనకు అనుకూలంగా మలుచుకుంటారా? లేదా చూడాలి.

డెమోక్రాట్ల పంచాయితీ ఇలా ఉంటే..ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్స్ మాత్రం చాలా స్ట్రాటజిక్‌గా ముందుకు వెళుతున్నారు. మొన్నటి వరకు బైడెన్‌ మైనస్‌ పాయింట్స్‌ను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇప్పుడు డెమోక్రాట్లలో ఉన్న కన్‌ఫ్యూజన్‌ను ఉపయోగించుకుంటున్నారు. యంగ్‌స్టర్స్‌ను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ట్రంప్‌ దూకుడు కూడా కలిసి వస్తోంది. ఇప్పుడు డెమోక్రాట్లు అభ్యర్థిని ఫైనల్ చేయగానే.. బైడెన్ హయాంలో ఉన్న లోటుపాట్లను తెరపైకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటిని ఎదుర్కోవాలంటే డెమోక్రాట్లు సరైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ముందు ముందు అమెరికన్ పాలిటిక్స్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి..

Related News

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Anti-immigrant Sentiment: లండన్ నిరసనలు.. ఎవరికి పాఠం, ఎవరికి గుణపాఠం?

Donald Trump: అక్రమ వలసలే అన్నిటికీ కారణం.. భారత సంతతి వ్యక్తి దారుణ హత్యపై ట్రంప్ స్పందన

London: నిరసనలతో దద్దరిల్లిన లండన్‌.. లక్షమంది హాజరు, అదే ప్రధాన ఎజెండా?

Japan Population: జపాన్‌లో వందేళ్లకు పైబడిన వారు 1,00,000 చేరువలో.. కారణం ఇదేనట

Russia Earthquake: మరోసారి రష్యాను వణికించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ!

Nepal: నేపాల్ పార్లమెంట్ రద్దు.. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

Musk Vs Ellison: మస్క్ ని మించిన మొనగాడు.. ప్రపంచ నెంబర్-1 కుబేరుడు అతడే

Big Stories

×