E-Paper
Advertisement

Layoff: 2 నిమిషాల వీడియో కాల్.. 200 మంది ఉద్యోగులు అవుట్

Layoff: 2 నిమిషాల వీడియో కాల్.. 200 మంది ఉద్యోగులు అవుట్
Advertisement

Layoff: 2024.. కొత్త ఏడాది ప్రారంభమై వారమైనా గడవలేదు. అప్పుడే ఉద్యోగులకు లే ఆఫ్ ల బెడద మొదలైంది. 2 నిమిషాల వీడియోకాల్ లో 200 మంది ఉద్యోగులకు ఉద్యాసన పలికిందో సంస్థ. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ వర్కర్లతో పాటు.. కాంట్రాక్టర్లను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లు వర్చువల్ కాల్ లో వెల్లడించింది. ఈ విషయాన్ని టెక్ క్రంచ్ అనే వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది.

ఫ్రంట్ డెస్క్ సీఈఓ జెస్సీ డిపింటో గూగుల్ మీట్ కాల్ లో మాట్లాడుతూ.. సంస్థ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటోందని తెలిపారు. అద్దె చెల్లింపుల విషయంలో ఆర్థిక సవాళ్లున్నాయని, దివాలా ప్రక్రియకు ప్రత్యామ్నాయమైన స్టేట్ రిసీవర్ షిప్ కోసం దరఖాస్తు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

2017లో స్థాపించిన ఫ్రంట్ డెస్క్ సంస్థ అమెరికా వ్యాప్తంగా 1000కు పైగా ఫర్నిష్డ్ అపార్ట్ మెంట్లను నిర్వహిస్తోంది. మార్కెట్ రేట్లకు అపార్ట్ మెంట్లను లీజుకు తీసుకుని తాత్కాలికంగా అద్దెకు ఇస్తోంది. జెట్ బ్లూ వెంచర్స్, వెరిటాస్ ఇన్వెస్ట్ మెంట్స్ వంటి పెట్టుబడిదారుల నుంచి 26 మిలియన్ డాలర్స్ ను సేకరించింది. అయినప్పటికీ కంపెనీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

Related News

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

Big Stories

Advertisement
×