Big Stories

Mali Gold Mine : కూలిన బంగారు గని.. 70 మందికి పైగా మృతి

Mali Gold Mine : బంగారు గని కూలి 70 మందికి పైగా మరణించిన విషాద ఘటన మాలిలో చోటుచేసుకుంది. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గోల్డ్ మైన్ కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 73 మందికి పైగా మరణించారు. నాలుగు రోజుల క్రితమే ఈ ప్రమాదం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

- Advertisement -

బంగారు గని కుప్పకూలిన సమయంలో 100-150 మంది కార్మికులు ఉన్నట్లు మాలి చాంబర్ ఆఫ్ మైన్స్ అధ్యక్షుడు అబ్దులయే పోనా వెల్లడించారు. కాగా.. మృతుల్లో ఎక్కువమంది మైనర్లే ఉన్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గని వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

ఆఫ్రికాలోని మూడవ అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు అయిన మాలిలో.. ఇలాంటి ప్రమాదాలు జరగడం సాధారణం. కానీ.. ఈసారి జరిగిన ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. 2022లో మాలి 72.2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News