BigTV English
Advertisement

Russia Earthquake: మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన భారీ అగ్నిపర్వతం.. 6000 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన..?

Russia Earthquake: మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన భారీ అగ్నిపర్వతం.. 6000 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన..?

Russia Earthquake: రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. పలు ప్రాంతాల్లో అక్కడి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 8.8 తీవ్రతతో ఇటీవల వచ్చిన భూకంప ప్రభావం వల్లే మరోసారి భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. రష్యాలోని కమ్చట్కా ద్వీపంలోని క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం బద్దలైంది. ఇటీవల వచ్చిన భూకంపం కారణంగానే 600 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్దలైనట్టు అధికారులు భావిస్తున్నారు.


భూకంపం ధాటికి ఊగిపోయిన బిల్డింగులు…

ఈ రోజు సంభవించిన భారీ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదు అయినట్టు జపాన్‌ వాతావరణ శాఖ, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ రెండూ వివరించాయి.. ఈ క్రమంలో రష్యా ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను అలర్ట్ చేసింది. అయితే ఇప్పటివరకు కమ్చట్కా దీవుల పరిసర ప్రాంతాల్లో.. ఇంకా ఇతర ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియలేదు. భారీ భూకంపం సంభవించడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భవంతులు ఊగిపోయాయాని అక్కడి మీడియా వివరించింది. భవంతుల కూలిపోవడం, కొన్ని చోట్ల చెట్లు నేలకు ఒరగడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో ఇళ్ల నుంచి ఒక్కసారిగా పరుగులు తీశారు.


14 ఏళ్ల తర్వాత భారీ భూకంపం…..

ఇటీవల కూడా రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించిన తెలిసిందే. అప్పుడు కూడా రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత 8.8గా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. ఈ భారీ భూకంపం సంభవించండంతో రష్యా, జపాన్ దేశాలతో పాటు ఉత్తర పసిఫిక్ లోని పలు తీర ప్రాంతాల్లో కూడా సునామీ తాకింది. పసిఫిక్ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత పెద్ద భూకంపం అని అధికారులు చెబుతున్నారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. మళ్లీ భూకంపం సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

600 ఏళ్ల తర్వాత మొదటిసారి బద్దలైన అగ్నిపర్వతం

రష్యా దేశ తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని  క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం నిన్న(శనివారం) అర్ధరాత్రి బద్దలైనట్లు అధికారులు తెలిపారు. ఇటీవల సంభవించిన భారీ భూకంపం ధాటి వల్ల దాదాపు 600 ఏళ్ల తర్వాత మొదటిసారి ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు రష్యా ప్రభుత్వం వివరించింది. ఈ అగ్నిపర్వతం బద్దలు కావడంతో… 6 వేల మీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఘటనలో కమ్చట్కా ద్వీపకల్పంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతం క్ల్యూచెస్కీ బద్దలైనట్టు అధికారులు తెలిపారు. దేశంలో పలు ప్రాంతాల్లో మళ్లీ భూకంపం సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Related News

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పాక్-చైనా అణ్వాయుధ పరీక్షలు, వచ్చే ఏడాది కోసం గ్రౌండ్ ప్రిపేర్

Nepal Avalanche: నేపాల్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌.. విరుచుకుపడిన హిమపాతం, ఏడుగురు మృతి

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 6.3 తీవ్రతతో అల్లకల్లోలం

Netherlands Next Prime Minister: నెదర్లాండ్ కు తొలి ‘గే’ ప్రధానమంత్రి.. ఎవరీ రాబ్ జెట్టెన్?

Big Stories

×