E-Paper
Advertisement

రిటైర్డ్‌ టీచర్‌ ఫ్యామిలీని చంపి.. ఏడుగంటపాటు ఇంట్లో నిందితులు, బంగ్లాదేశ్‌లో దారుణం

రిటైర్డ్‌ టీచర్‌ ఫ్యామిలీని చంపి.. ఏడుగంటపాటు ఇంట్లో నిందితులు, బంగ్లాదేశ్‌లో దారుణం
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై రోజురోజుకూ దారుణాలు పెరుగుతున్నాయి. కనీసం నెలకు లేదా రెండు నెలలకు ఒకటి చొప్పున హత్య చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నలుగురు సభ్యుల గల ఫ్యామిలీని చంపేశారు. అంతేకాదు నిందితులు సుమారు ఆరేడు గంటల పాటు ఆ ఇంట్లో ఉన్నారు. హత్యల తర్వాత ఇంట్లోనే తిని,  తాగారు. స్నానం చేసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది. అసలు ఘటన ఎందుకు జరిగింది?

 

బంగ్లాదేశ్‌లో దారుణం

Advertisement

బంగ్లాదేశ్‌లోని రంగపూర్‌ సిటీలో ఓ హిందూ కుటుంబంలోని నలుగురు సభ్యులను దారుణంగా హత్య చేసుకున్నారు వ్యక్తులు. ఈ హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు పోలీసులు. నిందితులు.. చక్రవర్తి కుటుంబంలో నలుగుర్ని చంపేశారు. ఆ తర్వాత ఆరేడు గంటు ఆ ఇంటిలోనే గడిపారు. ఆ సమయంలో వారికి కావాల్సిన ఆహారం తిన్నారు, ఆ తర్వాత మందుకొట్టారు, చివరకు స్నానం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

నలుగురు సభ్యుల ఫ్యామిలీని చంపిన యువకులు

Advertisement

రంగపూర్ సిటీలో నివాసం ఉంటున్నారు గణపతి చక్రవర్తి ఫ్యామిలీ. ఆయన వయస్సు 65 ఏళ్లు. గతేడాది డిసెంబర్ 31న రంగపూర్ జిల్లా పాఠశాలలో పదవీ విరమణ చేశారు. ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి, ఆమె వయస్సు దాదాపుగా 50 ఏళ్లు. చక్రవర్తి దంపతులకు ఇద్దరు పిల్లులు ఉన్నారు. కూతురు అగామి చక్రవరికి 23 ఏళ్లు కాగా, కొడుకు ప్రియం చక్రవర్తికి 12 ఏళ్లు. కూతురు ఈ ఏడాది.. ఇంగ్లీషులో తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. కొడుకు ప్రియం.. రంగపూర్ జిల్లా పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. చక్రవర్తి ఇంటి పక్కన సిద్ధార్థ దాస్-19, ముగ్ధ దాస్-23లు ఇళ్లు ఉంటున్నాయి. గురువారం రాత్రి చక్రవర్తి ఇంటి మేడ మీదకు వచ్చి ఇద్దరు యువకులు మాదకద్రవ్యాలు తీసుకున్నారు.

 

ఇంట్లోనే ఏడుగంటలపాటు గడిపిన నిందితులు

పై అంతస్తు నుంచి శబ్దం రావడంతో గణపతి చక్రవర్తి పైకి వెళ్లి చూశారు. వీరి వ్యవహారం తెలిసి యువకులను మందలించారు. తాము డ్రగ్స్‌ తీసుకుంటున్న విషయం బయటపడు తుందని భయంతో చక్రవర్తి మెడకు తువాలు బిగించి ప్రాణాలు తీశారు. చక్రవర్తి కేకలు విన్న అతని భార్య ప్రీతి మేడపైకి వచ్చారు. ఆమెని ఇద్దరు యువకులు చంపేశారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి ఇద్దరు పిల్లలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులకు చక్రవర్తి కూతురు తెలియడంతో తమకు ఇబ్బందులు తప్పవని అగామిని చంపేశారు. ఆ తర్వాత మైనర్ బాలుడ్ని చంపేశారు. హత్యల తర్వాత నిందితులు ఆ రాత్రి చక్రవర్తి ఇంట్లో ఉన్నారు.

ALSO READ: కూతురు కళ్ల ముందే.. భారత వ్యాపార‌వేత్త కాల్చివేత, అమెరికా దారుణమైన ఘటన

అక్కడే స్నానం చేసి ఫ్రిజ్‌లో ఉన్న ఆహారం తిన్నట్లు గుర్తించారు పోలీసులు. బయటకు వెళ్లిపోయే ముందు బీరువా తెరిచి బంగారు నగలను ఎత్తుకెళ్లారు. మృతులకు సంబంధించిన రెండు మొబైల్‌ ఫోన్లను నీటిలో పడేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడానికి బీరువా, సొరుగులు తెరిచి బట్టలు అన్నిచోట్లా చెల్లాచెదురుగా పడేశారు. నిందితుల్లో సిద్ధార్థ్ చేపల వ్యాపారం చేస్తుండగా, ముగ్ధ కంసాలిగా పని చేసేవాడు.

Related News

టీచర్‌పై కాల్పులు జరిపిన 6 ఏళ్ల బాలుడు.. పోలీసులు రాగానే మరింత తెగించి

ఉక్రెయిన్ బస్టాప్‌పై రష్యా బాంబుల వర్షం.. 33 మంది మృతి!

ట్రంప్‌కు బంగారు విగ్రహం.. కానీ, బట్టల్లేకుండా.. ఏందయ్యా ఇది?

కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

చమురు బాంబు పేల్చిన ట్రంప్.. పతనమైన స్టాక్‌మార్కెట్లు, ఇంతకీ ట్రంప్ ఏమన్నారు?

అమెరికా చదువులు ఖరీదు బాబోయ్.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ ఝలక్, ఇకపై రూ. 67 లక్షలు

చేప వలలతో పాకీ సైన్యం సరికొత్త ప్రయోగం.. నవ్వుతున్న జనం

కెప్టెన్ స్మిత్ పుర్రెకు శస్త్రచికిత్స.. విజయవంతంగా నిర్వహించిన సౌదీ వైద్యులు!

Big Stories

Advertisement
×