ఆదివారం తెల్లవారుజామున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రతం 5.9గా నమోదు అయ్యింది. రాజధాని టోక్యోతోపాటు తూర్పు జపాన్‌లోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు.. 30 మందికి పైగానే గాయపడినట్టు తెలుస్తోంది. నిద్రలో భూకంపం రావడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోయారు.
ఆదివారం వేకువజామున జపాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. ఇది 5.9 తీవ్రతతో నమోదు అయ్యింది. రాజధాని టోక్యోతో సహా తూర్పు జపాన్‌లోని పలు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘటనలో 30 మంది గాయపడగా, చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే సునామీ ముప్పు ఉన్నట్లు సమాచారం లేదు. జపాన్ వాతావరణ సంస్థ నివేదిక మేరకు.. భూకంప కేంద్రం దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌లోని సుమారు 70 కిలోమీటర్లు లోతులో గుర్తించారు. ఈ ప్రాంతం తరచుగా భూకంపాలకు కేరాఫ్‌గా చెబుతున్నారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ఈ భూకంపం తీవ్రత 5.8గా నమోదు చేసింది.
టోక్యో ప్రాంతంలోనూ ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు. సైతామాలో తొమ్మిది మంది, కనగావాలో తొమ్మిది మంది, చిబాలో నలుగురు, ఇబరాకిలో ఒకరు గాయపడ్డారు. చాలా మంది నిద్రలో ఉండగా ఆకస్మిక భూకంపం కారణంగా ఉలిక్కిపడి నిద్రలేచిపోయారు. టోక్యోలోని తూర్పు ప్రాంతం టైటోలో షాపింగ్ చేస్తుండగా భూకంప హెచ్చరిక మోగిన కొద్దిక్షణాలకే భారీ కుదుపుకు గురైనట్లు చెప్పాడు 23 ఏళ్ల యువకుడు. భూకంపం కారణంగా టోక్యో, నరిటా ఎయిర్‌పోర్టులకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే ఇతర లోకల్ రైళ్లు ఆలస్యమయినట్టు జపాన్ వెల్లడించింది.
షింకన్సెన్ బుల్లెట్ రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ వెల్లడించింది. రానున్న వారంరోజుల పాటు భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. నష్టం అంచనా వేయడానికి ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని ప్రధాన మంత్రి సనాయ్ తెలిపారు. డజను అణు విద్యుత్ కేంద్రాలు ఎలాంటి నష్టం లేదని అణు నియంత్రణ అథారిటీ తెలియజేసింది. గత నెల జపాన్‌లోని దక్షిణ ద్వీపం క్యుషులోని కుమామోటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 38 మంది మరణించగా, 364 మంది గాయపడిన విషయం తెల్సిందే.
ALSO READ: వరల్డ్ ఫేమస్ వ్యక్తులు.. చనిపోయినా వదల్లేదు
🆘 🇯🇵 Sismo de 5.9 sacude Japón.
Un terremoto de magnitud preliminar 5.9 se registró en el sur de la prefectura de Ibaraki y provocó fuertes movimientos en distintas zonas del este de Japón, incluida Tokio.
El sismo ocurrió a unos 70 kilómetros de profundidad y alcanzó una… pic.twitter.com/BzGe9k1xsT
— Luis Gabriel Velázquez (@soyluisgabriel1) August 22, 2026
🚨🇯🇵#BREAKING | NEWS ⚠️
Additional footage out of Honshu Japan after a powerful 5.8 magnitude earthquake struck around 2 AM audible alerts throughout the city heard.Thousands of people have been evacuating large apartment buildings and building after the earthquake rocked the… pic.twitter.com/sBluUZIdxz
— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) August 22, 2026