E-Paper
Advertisement

కూతురు కళ్ల ముందే.. భారత వ్యాపార‌వేత్త కాల్చివేత, అమెరికా దారుణమైన ఘటన

కూతురు కళ్ల ముందే.. భారత వ్యాపార‌వేత్త  కాల్చివేత, అమెరికా దారుణమైన ఘటన
Advertisement

America: అమెరికాలో మరొక భారతీయుడు తుపాకీకి బలైపోయారు. టెన్నెస్సీ రాష్ట్రంలోని జాక్సన్ సిటీలో ఈ ఘటన జరిగింది. కుమార్తె కళ్ల ముందు తండ్రిని దోపిడీకి వచ్చిన దొంగలు కాల్చి చంపడం తీవ్ర కలకలం సృష్టించింది. కాల్పులు తర్వాత దుండగులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు. అసలు ఘటన ఏం జరిగింది?

 

అమెరికా దారుణమైన ఘటన

Advertisement

పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త సురేష్ పటేల్‌కు చెందిన రిడ్జ్‌క్రెస్ట్ సెల్లార్స్ పేరిట మద్యం షాపు ఉంది. దోపిడీకి వచ్చిన ఓ ఆగంతకుడు మాస్క్ ధరించిన షాపులోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత తుపాకీ చూపించి నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మారు మాట్లాడకుండా షాపులోని ఉన్న డబ్బులు ఇచ్చేశాడు సదరు వ్యాపారి. డబ్బు తీసుకున్న తర్వాత నిందితుడు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో సురేష్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన వయస్సు 56 ఏళ్లు. అందులో పని చేసే మరో ఉద్యోగి గాయపడ్డారు.

 

కొన్నాళ్లు కిందట షాపు కొనుగోలు, అంతలో ఘటన

Advertisement

కాల్పులు జరుగుతున్నప్పుడు కిందపడి పోవడంతో అతడి మణికట్టు విరిగింది. ఆ సమయంలో ఆయన పక్కన ఉన్న పటేల్ కుమార్తెకు ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటన జరిగిన సురేశ్ కి చెందిన 19 ఏళ్ల కూతురు అక్కడే ఉంది. వెంటనే సురేశ్‌ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మరణించినట్లు వైద్యులు తెలిపారు. దుండగుడు కాల్పులు జరిపిన తర్వాత కారులో అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు నల్ల జాతీయుడని బూడిద రంగు హూడీ, జీన్స్, నల్లటి వర్క్-స్టైల్ బూట్లు ధరించి ఉన్నాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సురేశ్ పటేల్ గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని అఖజ్ గ్రామానికి చెందినవాడు. అతడి కుటుంబం ఇటీవల ఈ షాపుని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట వ్యాపారం ప్రారంభించాడని చెబుతున్నారు.

ALSO READ: జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. భయాందోళనలో టోక్యోవాసులు

గతేడాది మే నెలలో టెన్నెస్సీలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో దోపిడీ సందర్భంగా 30 ఏళ్ల పరేష్ అలియాస్ ప్రిన్స్ పటేల్‌ను కాల్చి చంపారు దుండగులు. నగదు అప్పగించిన తర్వాత దోపిడీ దారుడు పలుమార్లు కాల్పులు జరిపారు. రెండు నెలల కిందట వర్జీనియాలోని నార్ఫోల్క్‌ ప్రాంతంలో గుజరాతీ మహిళ మేఘనా పటేల్ తన షాపులో కాల్చి చంపారు. అమెరికాలో భారత సంతతికి చెందిన కిరాణా షాపులు, వ్యాపార యజమానులు ఆ తరహా సమస్యను ఎదుర్కొంటున్నారు. అక్కడ షాపులు రాత్రి పొద్దుపోయే వరకు పని చేస్తుంటాయి. వాటిని టార్గెట్ చేసుకుని దోపిడీలకు తెగబడుతున్నారు. అంతేకాదు షాపులోని వారిని సైతం చంపేస్తున్నారు.

Related News

చమురు బాంబు పేల్చిన ట్రంప్.. పతనమైన స్టాక్‌మార్కెట్లు, ఇంతకీ ట్రంప్ ఏమన్నారు?

అమెరికా చదువులు ఖరీదు బాబోయ్.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ ఝలక్, ఇకపై రూ. 67 లక్షలు

చేప వలలతో పాకీ సైన్యం సరికొత్త ప్రయోగం.. నవ్వుతున్న జనం

కెప్టెన్ స్మిత్ పుర్రెకు శస్త్రచికిత్స.. విజయవంతంగా నిర్వహించిన సౌదీ వైద్యులు!

ఆ 5000 మంది ఏమైపోయారు? ఇక వెతకలేక చేతులెత్తేసిన నేపాల్!

ఫ్లైదుబాయ్ కో-పైలట్.. విచారణలో కీలక విషయాలు, షాకైన అధికారులు

కూలిన సైనిక విమానం.. 32 మంది మృతి, నైజీరియాలో ఘటన

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం.. భారత్ ఫార్మా కంపెనీపై డ్రోన్ల దాడి, రూ.400 కోట్ల నష్టం!

Big Stories

Advertisement
×