E-Paper
Advertisement

కుప్పకూలిన బంగారు గని, 100 మందికి పైగా మృతి! ఇంతకీ ఎక్కడో తెలుసా?

కుప్పకూలిన బంగారు గని, 100 మందికి పైగా మృతి! ఇంతకీ ఎక్కడో తెలుసా?
Advertisement

Gold Mine Collapsed: మధ్య ఆఫ్రికాలో ఘోరం చోటు చేసుకుంది. కామెరూన్- సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సరిహద్దులో ఓ బంగారు గని కుప్ప కూలింది. ఈ ఘటనలో 100 మందికి పైగా కార్మికులు మృత్యువాతపడ్డారు. పగటి వేళ ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించాడు. ఆ ప్రాంతమంతా శ్మశాన దిబ్బగా మారింది. అసలేం ఘటన ఎలా జరిగింది?

సెంట్రల్ ఆఫ్రికా ఘోరం

సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్‌ ప్రాంతం ఈ ఘటనకు వేదికైంది. బాబూవా పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కామెరూన్ సరిహద్దుకు సమీపంలో జాంబోయే గ్రామం ఉంది. బంగారు గనులకు ఫేమస్‌ ఆ ప్రాంతం. అసలే బంగారం ధర రోజు రోజుకూ మార్కెట్‌లో ఎగబాకుతోంది. బంగారం గనులు ఓనర్లు ఉత్పత్తి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బంగారం కోసం గని ప్రాంతానికి చేరుకుని తవ్వకాలు మొదలు పెట్టారు పని చేసే కార్మికులు. 100 అడుగుల లోపు తవ్వకాలు చేశారు. ఈలోగా కిందటిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి.

బంగారం తవ్వకాలు.. కుప్పకూలిన బంగారం గని

Advertisement

సోషల్ మీడియాలో వచ్చిన ఫుటేజీ ఆధారంగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో దాని ప్రవాహంతో అందులో వారిని కప్పేసినట్టు కనిపించింది. అందులోని వారంతా అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టారు. కామెరూన్ ప్రభుత్వ మీడియా సంస్థ వివరాల మేరకు మృతుల సంఖ్య 100 దాటిందని తెలిపింది. ఇతర స్థానిక మీడియా సంస్థల కథనాలు మేరకు, శిథిలాల నుంచి 107 మృతదేహాలను వెలికి తీసినట్టు రాసుకొచ్చాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారని సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లోని స్థానిక మీడియా పేర్కొంది. గనుల కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో భూగర్భ సొరంగాలు కూలిపోవడం వల్ల ఘటన జరిగినట్టు బాబూవాకు చెందిన అధికారులు తెలిపారు.

 

100 మంది వరకు మృతి, శిధిలాల కింద మృతదేహాలు

Advertisement

ఈ ఘటనపై సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ గనులు- భూగర్భ శాఖ మంత్రి రుఫిన్ బెనామ్ ఓ ప్రకటన చేశారు. ఘోర దుర్ఘటనలో మొత్తం 49 మంది మరణించినట్లు తెలిపారు. మృతుల్లో 34 మంది సీఏఆర్ జాతీయులు, 13 మంది కామెరూన్ వాసులు, ఇద్దరు చాద్ దేశస్థులు ఉన్నారు. కార్మికుల నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణమని కొందరు అధికారులు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. వెంటనే గని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు సదరు మంత్రి. ఈ ఘటనతో స్థానిక ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా? అన అనుమానంతో సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.

ALSO READ: ఆపరేషన్ బార్బరోస్సా.. హిట్లర్ చేసిన ఆ ఒక్క పొరపాటే రెండో ప్రపంచ యుద్ధ ఫలితాన్ని మార్చేసిందా?

ఇటీవల కాలంలో ఆఫ్రికాలో గనుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జులైలో కెన్యాలోని నరోక్ కౌంటీలో ఓ బంగారు గని కూలిన ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించారు. ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలలో చిన్న తరహా గనులు సర్వసాధారణం. వాటిని నేరంగా పరిగణించే నిబంధనలు ఉన్నాయి. అయితే నిరుద్యోగం కారణంగా యువతీయువకులు జీవనోపాధి కోసం గనుల వైపు వెళ్తున్నారు. ఈ గనుల ప్రదేశాలు బలహీనమైన భద్రతా ప్రమాణాలతో పని చేస్తాయి. పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ, ఉపాధి కారణంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు అక్కడి ప్రజలు. ఫలితంగా ఆ లోకాన్ని విడిచిపెడుతున్నారు.

Related News

ఆపరేషన్ బార్బరోస్సా.. హిట్లర్ చేసిన ఆ ఒక్క పొరపాటే రెండో ప్రపంచ యుద్ధ ఫలితాన్ని మార్చేసిందా?

హర్మూజ్‌లో ఇరాన్‌కు మైండ్ బ్లాంక్ సీన్.. 80% నౌకలు అటే.. అసలు ఒమన్ ప్లాన్ ఏంటి?

ఉత్తర కెన్యాలో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి!

మత్స్యకారుడిపై ఆక్టోపస్ దాడి.. ముఖాన్ని చుట్టేసి చిత్రవధ.. వీడియో వైరల్!

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. జైలు నుంచి ఆస్పత్రికి.. పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

భారత ఎన్నికల వ్యవస్థ అమోఘం.. అమెరికా చూసి నేర్చుకోవాలి.. ట్రంప్ ప్రశంసల వర్షం!

పాకిస్తాన్‌లో ఘోరం.. ప్రముఖ టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య.. చెల్లెలికి తీవ్ర గాయాలు!

Big Stories

Advertisement
×