E-Paper
Advertisement

పెళ్లిపై కామాక్షి క్రేజీ రియాక్షన్?

పెళ్లిపై కామాక్షి క్రేజీ రియాక్షన్?
Advertisement

Kissik Talks: టాలీవుడ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) తాజాగా అగధ సినిమాతో తన ఖాతాలో మంచి విజయాన్ని వేసుకుంది. ఈ నేపథ్యంలోనే పలు ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటున్న కామాక్షి.. తొలిసారి తన పెళ్లిపై స్పందించి అభిమానులలో ఆసక్తిని రేకెత్తించింది. విషయంలోకి వెళ్తే.. అగధ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ కార్యక్రమానికి గెస్ట్ గా వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే వర్ష (Varsha ) అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే.. తాను సింగిల్ అని చెబుతూ పెళ్లిపై ఊహించని కామెంట్లు చేసింది.

పెళ్లిపై కామాక్షి భాస్కర్ల కామెంట్.

ప్రస్తుతానికి నేను సింగిలే కానీ మింగిల్ అవ్వడానికి ఇప్పట్లో సిద్ధంగా లేను. సౌత్ ఇండస్ట్రీ విషయానికొస్తే.. ముఖ్యంగా మన తెలుగు ఫ్యామిలీస్ లో ప్రత్యేకించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో అమ్మాయిలు ఒక ఏజ్ వరకు చదువుకోవాలి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి.. పిల్లల్ని కనాలి.. లోన్లు తీసుకోవాలి అంటూ ఒక టైం పీరియడ్ పెట్టుకుంటాం కదా.. ముఖ్యంగా పెళ్లిపై నేనేం చెబుతాను అంటే.. ఎమోషనల్ గా రెడీగా ఉన్నప్పుడు.. మన లైఫ్ లోకి ఒకటి వచ్చింది అంటే.. ఆనందించి, దాన్ని షేర్ చేసుకునే ఒక స్పేస్ లో ఎమోషనల్ గా ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ లోకి వెళ్ళండి అంటూ కామెంట్లు చేసింది.

పిల్లలు కనడంపై కామాక్షి ఏమన్నారంటే?

Advertisement

ఒక వ్యక్తితో సంతోషంగా ఉంటాము.. మన ఎమోషన్ ని షేర్ చేసుకోగలము అని అనుకునేటప్పుడే రిలేషన్ లోకి వెళ్ళండి.
అప్పుడే పిల్లల్ని కనండి.. లేదంటే పిల్లలు సఫర్ అవుతారు. ముఖ్యంగా పిల్లలకి వాళ్ల తల్లిదండ్రుల నుంచి ఒక ఎమోషనల్ బాండింగ్ చాలా అవసరం. అడల్ట్ బ్రెయిన్ ఎమోషన్ ని అర్థం చేసుకున్నంతగా చిన్న పిల్లల బ్రెయిన్ అర్థం చేసుకోలేదు. మనకు చిన్న చిన్నగా అనిపించే సమస్యలే వాళ్లకు చాలా పెద్దవి. చిన్నపిల్లల బాల్యం ప్రమాదకరంగా మారిందంటే.. అది వారి భవిష్యత్తుకు తీవ్రంగా నష్టాన్ని మిగులుస్తుంది కాబట్టి పిల్లల్ని చూసుకునే కెపాసిటీ మీ వద్ద ఉంటేనే పెళ్లి చేసుకోండి అంటూ కూడా తెలిపింది కామాక్షి. ఇక నా విషయానికొస్తే ఇప్పుడిప్పుడే కెరీయర్ ను బిల్డ్ చేసుకుంటున్నాను. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తిని నా లైఫ్ లోకి తెచ్చుకొని వారికి టైం కేటాయించకుండా ఇబ్బందులు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు అంటూ తెలిపింది.

ALSO READ:కామాక్షి డైరెక్టర్ గా చేసిన సినిమాలేంటో తెలుసా?

భగవంతుడిపై నమ్మకం గురించి కామాక్షి ఏమన్నారంటే?

Advertisement

భగవంతుడిని ఏం కోరుకుంటారు? అని వర్షా ప్రశ్నించగా.. “నేను భగవంతుడిని నమ్మను.. అసలు ఆ కాన్సెప్ట్ నాకు అర్థం అవ్వదు.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ భగవంతుడిని కోరుకుంటారు. కానీ నేను మనుషుల్ని నమ్ముతాను. నాకు ఈ కష్టం వచ్చినప్పుడు వేళ్ళ మీద లెక్కపెట్టుకునే ఒక నలుగురు ఉన్నారు. ముందుగా నాకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మొదట నేను చెప్పుకునే వ్యక్తులు వాళ్లే.. ఇక చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్తే నేను కూడా వెళ్లే దాన్ని. కానీ దేవుడిని మాత్రం అందరూ నీ దగ్గరకు వచ్చి కోరికలు కోరుతున్నారు కదా.. వారి కోరికలు అన్ని తీర్చేయి అని మాత్రమే నేను అడిగేదాన్ని అంటూ తన గొప్ప మనసు చాటుకుంది కామాక్షి.

Related News

పెళ్లి పీటలెక్కిన కావ్య శ్రీ.. ఇదెక్కడి ట్విస్ట్!

ఆమెపై పగబట్టిన హౌస్ మేట్స్.. ఎలిమినేషన్ తప్పదా?

ఛాలెంజ్ యాక్సెప్టెడ్.. మరో వీడియోతో అదరగొట్టేసిన అనసూయ!

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్?

సోషల్ మీడియాలో రెచ్చిపోయిన విష్ణు ప్రియ.. వీడియో వైరల్!

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన బిగ్ బాస్ విన్నర్..!

Telugu Tv Serials : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు అవుట్..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. మనోజ్ కు ఏమైంది..రోహిణికి సపోర్ట్ మనోజ్..

Big Stories

Advertisement
×