E-Paper
Advertisement

హర్మూజ్‌లో ఇరాన్‌కు మైండ్ బ్లాంక్ సీన్.. 80% నౌకలు అటే.. అసలు ఒమన్ ప్లాన్ ఏంటి?

హర్మూజ్‌లో ఇరాన్‌కు మైండ్ బ్లాంక్ సీన్.. 80% నౌకలు అటే.. అసలు ఒమన్ ప్లాన్ ఏంటి?
Advertisement

Strait of Hormuz: చమురు రవాణాకు అత్యంత కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిపై.. ఇరాన్ క్రమంగా పట్టు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయకుండా.. 80 శాతానికి పైగా నౌకలు.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నట్లు షిప్పింగ్ డేటా తెలియజేస్తోంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ డేటా ప్రకారం.. రెండు వారాలుగా హర్మూజ్ గుండా ప్రయాణిస్తున్న నౌకల్లో.. 80 శాతానికి పైగా ఒమన్ వైపు ఉన్న షిప్పింగ్ వాటర్ వేని ఉపయోగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆమోదం పొందిన ఈ మార్గాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. నౌకలు మాత్రం ఇప్పుడిదే రూట్ సేఫ్ అనుకుంటున్నాయ్.

నౌకాయాన స్వేచ్ఛపై ప్రత్యేక చర్చలు

Advertisement

నెల రోజుల కిందటి వరకు.. ఈ మార్గంలో రాకపోకలు దాదాపు శూన్యం. అయితే, అమెరికా నేవీ బలగాల రక్షణకు తోడు, సురక్షిత ప్రయాణం కోసం నౌకలు ఒమన్ మార్గాన్ని ఆశ్రయిస్తున్నాయి. దీనివల్ల..  ఈ జలసంధిలో.. ఇరాన్ వసూలు చేయాలనుకుంటున్న రవాణా, టోల్ ఫీజుల ప్రణాళిక దెబ్బతింది. ఇరాన్ దాడుల ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు.. అనేక చమురు ట్యాంకర్లు తమ ట్రాన్స్‌పాండర్‌లని నిలిపివేసి.. డార్క్ ట్రాఫిక్‌గా మారుతున్నాయ్. మరోవైపు, ఈ ప్రాంతం నుంచి రోజుకు సుమారు 15 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతోందని అమెరికా ఇంధన శాఖ తెలియజేసింది. ఇది.. యుద్ధానికి ముందున్న స్థాయికి దాదాపు దగ్గరగా ఉంది. ఈ సంక్షోభం వేళ.. ఇరాన్, ఒమన్ మధ్య.. నౌకాయాన స్వేచ్ఛపై ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి.

ఇరాన్ వ్యూహానికి గండి..

Advertisement

ఈ పరిణామం ట్రంప్‌కు నచ్చలేదు. టెహ్రాన్, మస్కట్ మధ్య కుదిరే ఏ ఒప్పందమైనా.. షిప్పింగ్ సరళిని, జలసంధిపై నియంత్రణని సమూలంగా మార్చేస్తుందా? అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇరాన్, అమెరికా.. పూర్తి నియంత్రణని క్లెయిమ్ చేయలేని వాస్తవాన్ని.. షిప్పింగ్ ట్రాకింగ్ డేటా సూచిస్తోంది. ఏదేమైనా.. ఈ వ్యూహాత్మక జలమార్గంపై ఏ దేశానికీ సంపూర్ణ నియంత్రణ లేదనే విషయం స్పష్టమైంది. ఈ మార్పును బట్టి చూస్తే.. హర్మూజ్ గుండా వెళ్లే నౌకలపై.. ఇరాన్‌కు ఇకపై మునుపటి లాంటి నియంత్రణ ఉండకపోవచ్చని అర్థమవుతోంది.

Also Read: టీడీపీ కంచుకోటపై మిత్రపక్షాల కన్ను.. ఉత్తరాంధ్రలో మారిన పవన్, బీజేపీ వ్యూహం!

Tags

Related News

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం.. భారత్ ఫార్మా కంపెనీపై డ్రోన్ల దాడి, రూ.400 కోట్ల నష్టం!

తీగలాగితే డొంక కదిలింది.. ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు, ఇకపై ఇజ్రాయెల్..

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో..

‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

ఫ్లైదుబాయ్ దాడి ఘటన.. కో-పైలెట్ వెనుక ఉగ్రకోణం.. వెలుగులోకి సంచలన నిజాలు!

మాపై దాడికి తెగిస్తే అణ్వాయుధాలే.. నాటో దేశాలకు పుతిన్ ఘాటు వార్నింగ్!

ఫ్లై దుబాయ్ కాక్‌పిట్‌లో ఏం జరిగింది? గాల్లో ఉండగానే పైలట్‌పై కో-పైలట్ దాడి!

టిబెట్‌లో చైనా రహస్య తవ్వకాలు.. భారత్‌కు పొంచి ఉన్న అతిపెద్ద పర్యావరణ ముప్పు!

Big Stories

Advertisement
×