E-Paper
Advertisement

Mexico Parliament: మెక్సికో పార్లమెంట్‌లో రచ్చ రచ్చ.. జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళా ఎంపీలు

Mexico Parliament: మెక్సికో పార్లమెంట్‌లో రచ్చ రచ్చ.. జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళా ఎంపీలు
Advertisement

Mexico Parliament: మెక్సికో పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామ్య దేవాలయం రణరంగాన్ని తలపించింది. చట్టసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య జరిగిన ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభ్యులు గందరగోళం సృష్టించగా, ముఖ్యంగా మహిళా సభ్యులు పరస్పరం దాడులు చేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. అధికార పక్షం సభలో ఒక చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ నిరసనను వ్యక్తం చేస్తూ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకొచ్చారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ మాటల యుద్ధం క్షణాల్లోనే భౌతిక దాడులకు దారితీసింది.

Advertisement

ముఖ్యంగా మహిళా సభ్యుల మధ్య తలెత్తిన ఘర్షణ తారాస్థాయికి చేరింది. సహనం కోల్పోయిన మహిళా ఎంపీలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. తోపులాటలు, వాగ్వాదాలతో సభ దద్దరిల్లింది. సభాపతి (స్పీకర్) ఘర్షణను ఆపేందుకు, సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఇలా పార్లమెంట్ సాక్షిగా కొట్టుకోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×