E-Paper
Advertisement

MissTerious Movie: కిల్లర్‌ను ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేరు.. మిస్టీరియస్‌పై డైరెక్టర్ మహి కోమటిరెడ్డి

MissTerious Movie: కిల్లర్‌ను ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేరు.. మిస్టీరియస్‌పై డైరెక్టర్ మహి కోమటిరెడ్డి
Advertisement

రోహిత్ హీరోగా, అబిద్ భూషణ్ పోలీస్ పాత్రలో నటించిన సినిమా “మిస్టీరియస్”. రియా కపూర్, మేఘనా రాజ్ పుత్ కీలక పాత్రల్లో కనిపించగా.. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై జయ్ వల్లందాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన ఇంటర్వ్యూలో దర్శకుడు మహి కోమటిరెడ్డి సినిమా హైలైట్స్‌తో పాటు పలు ముఖ్య విషయాలను పంచుకున్నారు.

ఇంటర్వ్యూలో దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ .. తమ “మిస్టీరియస్” సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా కొత్తదనంతో తెరకెక్కించామని తెలిపారు. ఇందులో క్రైమ్ ప్రధానంగా ఉంటూనే ప్రేమ, క్రష్ వంటి భావోద్వేగాలూ ఉంటాయని చెప్పారు. వీటితో పాటు థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను చివరి వరకూ కట్టిపడేస్తాయని, ఇప్పటివరకు ఎక్కడా చూడని విధమైన సస్పెన్స్‌ను ఈ సినిమాలో చూపించామని అన్నారు.

Advertisement

సినిమా మొత్తం కిల్లర్ ఎవరు అనే ఉత్కంఠతో సాగుతుందని.. క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం ఎవరూ ఊహించని ట్విస్ట్‌తో సస్పెన్స్, థ్రిల్ రెండింటినీ మేళవించి ఉంటుందని వెల్లడించారు. సినిమా పూర్తయ్యాక కూడా ప్రేక్షకులు క్లైమాక్స్ గురించే మాట్లాడుకునేలా రూపొందించామని చెప్పారు.

థ్రిల్లర్ సినిమాల్లో సాధారణంగా పాటలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని.. కానీ కథ అవసరాన్ని బట్టి మూడు పాటలను చేర్చామని తెలిపారు. అవి కథ ప్రవాహాన్ని ఆపకుండా మంచి ఎనర్జీ ఇచ్చేలా ఉంటాయని అన్నారు. సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని చెప్పారు. పోలీసుల గొప్పతనాన్ని చాటే “అడుగు అడుగునా” పాటను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేయించామని.. ఆ పాటకు మంచి స్పందన వస్తోందని తెలిపారు.

Advertisement

క్రైమ్, ప్రేమ, థ్రిల్, సస్పెన్స్‌తో పాటు ఓ అద్భుతమైన ఫైట్ సీన్ కూడా సినిమాలో హైలైట్‌గా ఉంటుందని చెప్పారు. నిర్మాత జయ్ వల్లందాస్ సహకారంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించామని తెలిపారు. మొదట ఈ నెల 12న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ “అఖండ 2” కారణంగా ఈ నెల 19న 150కి పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని అన్నారు.

ఈ చిత్రంలో రోహిత్, మేఘన రాజపుట్, అభిద్ భూషణ్, రియా కపూర్, బాలరాజ్ వాడి, శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆకునూరి గౌతమ్, జబర్దస్త్ రాజమౌళి, నవీన్, లక్కీ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బ్రహ్మానందం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×