E-Paper
Advertisement

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ 2.0 యాక్టివేట్.. అమెరికాకు ఘాటు హెచ్చరిక, యుద్ధం మళ్లీ మొదటికి

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ 2.0 యాక్టివేట్..  అమెరికాకు ఘాటు హెచ్చరిక, యుద్ధం మళ్లీ మొదటికి
Advertisement

Mojtaba Khamenei warn: ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ యాక్టివేట్ అయినట్టు కనిపిస్తోంది. యుద్ధం మొదలైన నుంచి ప్రజల దృష్టికి దూరంగా ఉన్న ఆయన, ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ఓ సందేశం ఇచ్చారు. పర్షియన్ గల్ఫ్‌లో అల్లరి సృష్టిస్తున్న విదేశీయులను అగాధంలోకి పంపిస్తామని హెచ్చరించారు. హర్మూజ్‌ జలసంధిలో శత్రువుల దురాగతాలను నిర్మూలిస్తామని తేల్చిచెప్పారు. దీంతో ఇరాన్ యుద్ధం మళ్లీ మొదటికి వచ్చిందని అంటున్నారు.

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ 2.0 యాక్టివేట్

Advertisement

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం మళ్లీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది. హోర్మూజ్ జలసంధి విషయంలో ఇరుదేశాలు పట్టు వీడలేదు. ఫలితంగా చమురు నౌకలు నిలిచిపోవడంతో  మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి.  ఈ ధరలు మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ సందేశం కొత్త చర్చకు దారి తీసింది.

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ యాక్టివేట్ అయ్యారు. ఈసారి అమెరికాకు ఆయన ఘాటు హెచ్చరిక చేశారు. పర్షియన్‌ గల్ఫ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీ పేరిట ఓ సందేశం విడుదలైంది. దేశం ఇంటా బయటా ఉన్న 9 కోట్ల మంది ఇరాన్ ప్రజలు, నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ నుంచి అణు, క్షిపణి సామర్థ్యాల వరకు సాంకేతిక సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా భావిస్తారని అన్నారు.

Advertisement

ఇరాన్ ప్రజలు తమ భూమి, గగనతలం, సముద్ర జలాలు ఎలాగైతే కాపాడుకుంటారో, టెక్ సామర్థ్యాలను అలాగే రక్షించుకుంటారని ప్రస్తావించారు. దేవుడి దయవల్ల పర్షియన్‌ గల్ఫ్‌ ఉజ్వల భవిష్యత్తులో అమెరికా ప్రమేయం ఉండదని తేల్చేశారు. హర్మూజ్‌జలసంధి కోసం కొత్త నిబంధనలను తీసుకువస్తామని తేల్చేశారు.

అమెరికాకు ఘాటు హెచ్చరిక, యుద్ధం మళ్లీ మొదటికి

ఆ నిబంధనలు గల్ఫ్‌ దేశాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతాయని, శాంతిని నెలకొల్పుతాయని అన్నారు. హర్మూజ్ జలసంధి.. గల్ఫ్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవుతోందన్నారు. అదే సమయంలో అమెరికాను పెద్ద సైతానుగా వర్ణించారు. పర్షియన్‌ గల్ఫ్‌లో అమెరికన్లకు పనేంటని ఇరాన్ సుప్రీం ప్రశ్న. విదేశీయులకు పర్షియన్‌ గల్ఫ్‌లో నీటి అడుగున తప్ప మరెక్కడా స్థానం ఉండదని తేల్చేశారు.

పర్షియన్ గల్ఫ్‌లో అల్లరి సృష్టిస్తున్న విదేశీయులను దాని జలాల అగాధంలోకి పంపిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో అమెరికా తన స్థావరాలను కాపాడుకోలేకపోతున్నాయని, అలాంటప్పుడు తమపై ఆధారపడిన దేశాల భద్రతకు అవి ఎలా హామీ ఇవ్వగలవన్నది ఆయన ప్రధాన ప్రశ్న.

ALSO READ: నేపాల్ లో ఘోర ప్రమాదం.. 700 మీటర్ల లోయలో పడ్డ జీపు.. 17 మంది దుర్మరణం

అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్‌లోని అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది ఇరాన్. ఈ నేపథ్యంలో హోర్మూజ్ జలసంది అమెరికా దిగ్బంధనం తరుణంలో ఈ సందేశం వెలువడింది. గల్ఫ్ దేశాలతో అమెరికా సంబంధాలు పెట్టుకోనున్న నేపథ్యంలో ఇరాన్ రూటు మార్చింది. భవిష్యత్తులో స్థిరత్వానికి హామీ ఇచ్చే దేశంగా తనను తాను నిలబెట్టుకోవడానికి ఇరాన్ ప్రయత్నిస్తోందని అంటున్నారు.

హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరిచేందుకు కొత్త ప్రణాళికను ప్రతిపాదించింది అమెరికా. ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుందని, ఇంధన స్వేచ్ఛా ప్రవాహానికి విఘాతం కలిగించే ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పకనే చెప్పారు ట్రంప్. ఒకవేళ అడ్డుకుంటే టెహ్రాన్‌ భారీ మూల్యం చెల్లించుకోవాలని, ఈ విషయంలో మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతుంద్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×