BigTV English

Mozambique Coast: కలరా భయంతో ప్రయాణం.. పడవ బోల్తా పడి 90 మందికి పైగా మృతి

Mozambique Coast: కలరా భయంతో ప్రయాణం.. పడవ బోల్తా పడి 90 మందికి పైగా మృతి
Mozambique Ferry Disaster
Mozambique Ferry Disaster
Mozambique Ferry Disaster kills More than 90 People: సముద్రంలో చేపల వేటకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోటు మునగడంతో దాదాపు 90 మందికి పైగా మరణించారు. ఈ ఘటన నైరుతి ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ ఉత్తర తీరంలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో సుమారు 130 మంది ఉన్నారు.
ఈ పడవ లో పరిమితికి మించి  ప్రయాణిస్తుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో చాలా మంది చిన్నారులు సహా 91 మంది మరణించారు.ఫెర్రీని చేపల పడవగా మార్చి ఎక్కవ సంఖ్యలో ప్రయాణిస్తుండంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
రెస్క్యూ టీమ్ ఇప్పటివరకు ఐదుగురిని రక్షించినట్లు నంపులా ప్రావిన్స్‌లోని అధికారులు తెలిపారు.
ఇతరుల కోసం గాలిస్తున్నారు. అయితే సముద్రంలో అలలు ఎగసిపడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చాలా మంది ప్రయాణికులు కలరా భయంతో ప్రధాన ప్రాంతాల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని నాంపుల ప్రావిన్సి సెక్రటరీ జైమ్ నెటో తెలిపారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన మొజాంబిక్‌లో అక్టోబర్ నుండి దాదాపు 15,000 కలరా కేసులు నమోదు కాగా, అందులో 32 మంది మరణించినట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×