BigTV English

Aukus pact: చైనాకు భారీ షాక్ ఇచ్చిన జపాన్.. ఆకస్ కూటమితో ఒప్పందాలు షురూ..!

Aukus pact: చైనాకు భారీ షాక్ ఇచ్చిన జపాన్.. ఆకస్ కూటమితో ఒప్పందాలు షురూ..!

Aukus pactAukus pact: గత కొన్నేళ్లుగా జపాన్, చైనా మధ్య వివాదం తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ చైనాకు కట్టడి చేసేందుకు మరో ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణ మహా సముద్రంలో చైనాను అదుపు చేసేందుకు జపాన్ ఆకస్ కూటమిలో చేరి ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది.


ఆస్ట్రేలియా తమ నౌకాదళానికి చెందిన కీలకమైన అణుశక్తి సబ్ మెరైన్ల తయారీ ఒప్పందమైన ఆకస్ ను విస్తరించి అందులో జపాన్ ను కూడా చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

అగ్రరాజ్యం అమెరికానే ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ కూటమి ఎళ్లవేలలా చైనాపై నిఘా ఉంచుతుంది. కృత్రిమ మేథ, సైబర్ సాంకేతికతను అభివృద్ధి చేసి, డ్రోన్లు, రాడార్ల సాయంతో చైనాపై నిఘా ఉంచనున్నారు.


ఈ తరుణంలో ఆకస్ కూటమి మంత్రులు సోమవారం భేటి కానున్నారు. ఈ సమావేశంలో పిల్లర్-2ను బలోపేతం చేసే ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పిల్లర్-2 సభ్య దేశాలు.. క్వాంటమ్ కంప్యూటింగ్, జలగర్భ, హైపర్ సోనిక్, ఏఐ, సైబర్ సాంకేతికతను అభివృద్ధి చేయనున్నాయి. అయితో ఈ ఒప్పందంలో భాగంగా మొదటి పిల్లర్ కింద ఆస్ట్రేలియాకు అత్యంత శక్తి వంతమైన అణుశక్తి సబ్ మెరైన్లు అందించనున్నారు.

Also Read: రెండు విమానాలు ఢీ.. లండన్ ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది?

అయితే టోక్యో ఈ కూటమిలో చేరాల్సిన అవసరం ఎంతో ఉందని జపాన్ మాజీ ప్రధాని టారో అసో తెలిపారు. టోక్యో ఈ కూటమిలో చేరితే.. తైవాన్ పై ఎప్పుడైనా సరే చైనా దాడికి పాల్పడితే కట్టడి చేయడానికి వీలుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 2023లో బ్రిటన్ ఫారెన్ అఫైర్స్ కమిటీ ఆకస్ లోకి జపాన్, దక్షిణ కొరియాలను తీసుకోవాలని సూచించింది. అయితే ఈ కూటమి ఏర్పాటుపై చైనా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×